భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నీముచ్ జిల్లాలో భక్తులతో వెళుతున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన దుర్ఘటనలో 11మంది దుర్మరణం చెందగా, మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స‍్థానిక ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక్కొక్కరికి రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
మరోవైపు జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లా షోపియాన్ సమీపంలోని ఫూంచ్ వద్ద స్కూలు బస్సు ప్రమాదానికి గురైందని, లోయలో పడిందని తొలుత కథనాలు వచ్చాయి. 40 మంది విద్యార్థులతో వెళ్తున్న ఈ బస్సు నిజానికి అసలు ప్రమాదానికి గురికాలేదని, అది సురక్షితంగా పూంచ్ చేరుకుందని ఏఎస్పీ మస్రూర మిర్ తెలిపారు. గరిబ్ నవాజ్ స్కూలు విద్యార్థులు విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా బస‍్సు ప్రమాదానికి గురైనట్లు తొలుత వదంతులు వచ్చాయి. దాంతో బస్సులో ఉన్న మొత్తం 40 మంది విద్యార్థులూ మరణించారని కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే వీటన్నింటినీ మిర్ ఖండించారు.
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం
Published Thu, May 25 2017 5:06 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement