24 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ | 24 Inter advanced supplementary examinations | Sakshi
Sakshi News home page

24 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

Published Sun, May 22 2016 3:51 AM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM

24 Inter advanced supplementary examinations

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

కర్నూలు(అగ్రికల్చర్): ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి నిర్వహించనున్నామని జాయింట్‌కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం.. జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ నెల 24 నుంచి ఉదయం 9 నుంచి12 వరకు మెదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

మొదటి సంవత్సరం పరీక్షలకు25975 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 10856 మంది హాజరవుతారని, ఇందుకు జిల్లా వ్యాప్తంగా 78 పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేసినట్లు  వివరించారు.  ఆర్‌ఐఓ పరమేశ్వరరెడ్డి, జెడ్పీ సీఈవో ఈశ్వర్, డీఈవో రవీంద్రనాథరెడ్డి, డీఎంహెచ్‌ఓ శారద, ఆర్టీసీ ఆర్‌ఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement