Joint Collector harikiran
-
24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కర్నూలు(అగ్రికల్చర్): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి నిర్వహించనున్నామని జాయింట్‌కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం.. జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ నెల 24 నుంచి ఉదయం 9 నుంచి12 వరకు మెదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలకు25975 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 10856 మంది హాజరవుతారని, ఇందుకు జిల్లా వ్యాప్తంగా 78 పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేసినట్లు వివరించారు. ఆర్ఐఓ పరమేశ్వరరెడ్డి, జెడ్పీ సీఈవో ఈశ్వర్, డీఈవో రవీంద్రనాథరెడ్డి, డీఎంహెచ్ఓ శారద, ఆర్టీసీ ఆర్ఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
కరువు సీమపై ఇంత నిర్లక్ష్యమా?
► ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ► ఎమ్మెల్సీ గేయానంద్ ► కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా కర్నూలు (న్యూసిటీ): వరుస కరువులతో అల్లాడుతున్న సీమ ప్రాంతంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మెల్సీ గేయానంద్ విమర్శించారు. తాగునీరు కూడా లభించక ప్రజలు నిత్యం బాధలు పడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులకు ఏ మాత్రం పట్టడం లేదన్నారు. కలెక్టరేట్ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా గేయానంద్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు ఇంత అన్యాయం జరుగుతుండడం ఆయన చేతకాని తనమేనని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద యం త్రాల వినియోగం తగ్గించి కూలీలకు పనులు కల్పించాలన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ హరికిరణ్ కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో రైతు సంఘం నేతలు ఆంజనేయుడు, సీపీఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, నగర నాయకులు పుల్లారెడ్డి, రాజశేఖర్, వివిధ సంఘాల నాయకులు వెంకట్రాముడు, సి.గురుశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం నీటి ముంపు బాధితుల ధర్నా కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 98 ప్రకారం తమకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్‌తో శ్రీశైలం నీటి ముంపు బాధితులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. బాధితుల సంఘం నాయకుడు మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 1996లో జీఓ నెంబర్ 98 జారీ చేశారన్నారు. దీని ప్రకారం కేటగిరీల వారీగా జిల్లాలో పలువురికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం చాలా మందిని పట్టించుకోలేదన్నా రు. ఇదే జీఓ ప్రకారం ఇటీవలే ప్రకాశం జిల్లాలో బాధితులకు ఉద్యోగాలిచ్చారని, ఇక్కడ మాత్రం వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం ఎమ్మెల్సీ డా.గేయానంద్‌కు వినతిపత్రం అందించారు. మండలిలో చర్చించి న్యాయం చేయాలని కోరా రు. బాధితులు ఎస్ మక్బూల్‌బాషా, మోహీన్‌బాషా, ఏ జనార్దన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జయంతి వేడుకలకు పక్కా ఏర్పాట్లు
► జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ జయంతి పై కలెక్టర్ ఏర్పాట్లు చేయాలని ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): మహనీయుల జయంతి వేడుకలను పండుగలా నిర్వహించాలని, ఇందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. బాబు జగ్జీవన్‌రామ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించాలని దళిత సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్, 14న అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ .. కాన్పరెన్స్ హాల్లో దళిత, యువజన, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. మహనీయల జయంతి ఉత్సవాలకు అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించాలన్నారు. ఇందు కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ డీడీని ఆదేశించారు. 8,9,10 తరగతుల విద్యార్థులకు జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ జీవిత చరిత్రపై వ్యాసరచన, వక్తృత్వపోటీలు నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్‌లో పరిష్కరించిన అంశాలపై విజయగాథలను సభకు తీసుకరావాలన్నారు. ప్రతి నాయకుడు కనీసం 5 మంది కార్యకర్తలను సమావేశానికి తీసుకరావాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ర్యాలీ నిర్వహించడం లేదని చెప్పిన కలెక్టర్.. సభను ఉదయం 9గంటలకే ప్రారంభిస్తామన్నారు. 8.45కే అందరూ సభ నిర్వహించే 5 రోడ్ల కూడలికి చేరకోవాలన్నారు. 12 గంటలకు ఉపన్యాసాలు ముగించిన తర్వాత బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు. జేసీ, జేసీ-2 తో సమావేశమై జయంతి వేడుకల ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. వేదికపై ఎవరెవరు కూర్చోవాలో నిర్ణయించాలని, ఈ విషయంలో గత ఏడాది చోటుచేసుకున్న పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. బాబు జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ దళితుల అభున్నతికి చేసిన కృషిని సమాజానికి తెలిసే విధంగా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఆహ్వాన పత్రికలు, కరపత్రాలు తదితరవాటిని ముద్రణలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జయంతి వేడుకలను నిర్వహ ణలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా పలువురు దళిత నేతలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఒక్కో అసోసియేషన్ నుంచి ఒకరిని మాత్రమే వేదిక పైకి పిలవాలన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సభ్యుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టంచేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరికిరణ్, జేసీ-2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడ్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ ప్రసాద్‌రావు, ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత, ఉద్యోగ విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. -
ఈ-ఆఫీసుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించండి
కర్నూలు(అగ్రికల్చర్) : ఈ-ఆఫీసుల నిర్వహణపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. మొదటి విడతలో 10 ప్రభుత్వ విభాగాల్లో ఈ-ఆఫీసు విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి పకడ్బందీగా అమలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే రెండో విడతలో 32 ప్రభుత్వ విభాగాల్లో అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం జిల్లా అధికారులతో తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. ఈ-ఆఫీసుల నిర్వహణకు ప్రతిశాఖ జిల్లా అధికారి కార్యాలయంలో ఒక పరిపాలనాధికారిని నియమించాలని తెలిపారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి, స్థానికంగా పనిచేస్తూ ఎస్టాబ్లిష్మెంట్పై పట్టుగలిగిన వారిని స్థానిక పరిపాలనాధికారిగా నియమించాలని సూచించారు. రెండో విడతలో వ్యవసాయ శాఖ, పశుసంవర్థక శాఖ, బీసీ కార్పొరేషన్, బీసీ సంక్షేమం, వికలాంగుల శాఖ, జిల్లా వృత్తివిద్యా, ఆర్ఐఓ, డీఈఓ అగ్నిమాపక దళం, ఉద్యాన శాఖ, హౌసింగ్, ఎన్సీఎల్పీ, ప్లానింగ్, ఆర్ అండ్ బీ, ఆర్డబ్ల్యూఎస్, ఫారెస్ట్ తదితర వాటిల్లో ఈ- పాలన కొనసాగించనున్నట్లు చెప్పారు. ఈ-విధానం వల్ల పాలన పారదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని డీపీఓను ఆదేశించారు. జేసీ-2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు. -
పక్కాగా భూ వివరాల నమోదు
► ఐదు జాబితాలుగా భూములు ► 17 నాటికి జాబితాలు సిద్ధం చేయాలి ► జిల్లా జాయింట్ కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో గురువారం ప్రభుత్వ భూముల వివరాల నమోదుపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక టీములను నియమించి పరిశీలన జరిపించారు. కార్యక్రమాన్ని జేసీ పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ భూముల వివరాలను ఐదు జాబితాలుగా తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17 నాటికి ప్రభుత్వ భూములను నాలుగు జాబితాలుగా తయారు చేసి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలకు పంపుతామన్నారు. మొదటి లిస్టులో అసైన్డ్ భూములు, రెండవ జాబితాలో పోరంబోకు భూములు, మూడవ జాబితాలో దేవాదాయ, వక్ఫ్ భూములు, నాలుగో జాబితాలో అర్బన్ ల్యాండ్ సీలింగ్, వ్యవసాయ భూములు, సీలింగ్ భూముల వివరాలు నమోదు చేయాలన్నారు. ఈ జాబితాలను తక్షణం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలకు పంపుతామని, ఇదే చివరి జాబితా అవుతందని వివరించారు. ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిష్టర్ చే సే అవకాశం ఉండదన్నారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలున్న భూముల వివరాలను ఐదో జాబితాలో నమోదు చేయాలన్నారు. ఈ జాబితాను ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ప్రభుత్వం వీటిపై అభ్యంతరాలు స్వీకరించి వాటిని స్ట్రూటిని చేసిన తర్వాత తుదిజాబితాను తయారు చేసి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలకు పంపుతామన్నారు. ఏమైనా ప్రభుత్వ భూములను మిస్ చేసి ఉంటే వెంటనే నమోదు చేయాలన్నారు. ఈ జాబితాలు తయారైతే ప్రభుత్వభూములపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుందన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ గంగాధర్‌గౌడు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, ఈ-సెక్షన్ సూపరింటెండెంట్ ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.