రాంబిల్లి : విశాఖపట్నం రాంబిల్లిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఆహారం వికటించి 25 మంది విద్యార్థినులు అస్వస్థత పాలయ్యారు. ఈ విద్యాలయంలో మొత్తం 180 మంది విద్యార్థినులు ఉండగా, ఆదివారం రాత్రి వీరికి ఉడికీ ఉడకని ఆహారాన్ని వడ్డించారు. సోమవారం ఉదయం మెనూ ప్రకారం పులిహోర పెట్టాల్సి ఉండగా.. రాగి జావను ఇచ్చారు.
ఆ తర్వాత వాంతులు, కడుపు నొప్పితో 25 మంది అస్వస్థతకు గురికాగా వారిలో 16 మందికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మిగిలిన 9 మందిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాత్రి ఆహారానికి, ఉదయం ఇచ్చిన జావకు సరిపడక విద్యార్థినులు అస్వస్థత పాలైనట్టు విద్యాలయం సిబ్బంది తెలిపారు.
25మంది విద్యార్థినులకు అస్వస్థత
Published Mon, Jul 13 2015 3:02 PM | Last Updated on Fri, Oct 5 2018 6:48 PM
Advertisement
Advertisement