
600 గ్రాముల బంగారం పట్టివేత
హైదరాబాద్: ఎన్ని చర్యలు తీసుకుంటున్నా విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుకోవడం శంషాబాద్ విమానాశ్రయంలో నిత్యకృత్యంగా మారింది. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 600 గ్రాముల బంగారంను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి దీన్ని స్వాధీనం చేస్తున్నారు.
బంగారం అక్రమ రవాణా వెనుక చైనా మాఫియా హస్తం ఉందన్న అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు సమీకరణలో భాగంగానే విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా పెరిగిందని అనుమానిస్తున్నారు.