రాజధాని రీజియన్‌లో 63 శాతం గ్రీన్‌బెల్ట్‌గా ప్రకటన
దీంతో ఇకపై లేఅవుట్లు, బిల్డింగ్‌లకు అనుమతులు నిల్
పరిశ్రమలు, వ్యాపారాలకూ అవకాశం లేదు
దారుణంగా పడిపోయిన భూముల ధరలు
ఆయా ప్రాంత రైతుల్లో ఆందోళన
అస్మదీయులకు మేలు చేసేందుకేనంటూ విమర్శలు
ఆందోళనకు సిద్ధమవుతున్న బాధితులు
రాజధాని రీజియన్‌లో గ్రీన్‌బెల్ట్ వ్యవహారంపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల ఒక్కసారిగా భూముల రేట్లు పడిపోవటంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
రియల్ వ్యాపారాన్ని రాజధాని పరిసరాలకే పరిమితం చేయడం, భవిష్యత్తులో ఈ భూముల్ని వివిధ ప్రాజెక్టుల కోసం తేలిగ్గా తీసుకునే ఉద్దేశంతోనే కావాలని గ్రీన్‌బెల్ట్‌ను రూపొందించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని డెల్టా ప్రాంత రైతులు ఆందోళనకు సైతం సిద్ధమవుతున్నారు.
‘పచ్చ’ విషం
Published Wed, Jan 20 2016 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM
Advertisement
Advertisement