స్కూలు బస్సు నుంచి జారిపడి విద్యార్థి మృతి | 7 years old boy dies in freak accident | Sakshi
Sakshi News home page

స్కూలు బస్సు నుంచి జారిపడి విద్యార్థి మృతి

Published Tue, Apr 5 2016 8:15 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

7 years old boy dies in freak accident

పొన్నూరు (గుంటూరు) : స్కూల్ బస్సు డోర్ అకస్మాత్తుగా తెరుచుకోవడంతో విద్యార్థి జారి పడి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం జూపూడి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జూపూడికి చెందిన కొడాలి శ్రీనివాసరావు కుమారుడు వీర శశాంక్(7) గోళ్లమూడిపాడు గ్రామంలో నాట్కో స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌లో రెండో తరగతి చదువుతున్నాడు. 
 
జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా పాఠశాలలకు సెలవుదినం అయినప్పటికి సీబీఎస్‌ఈ సిలబస్ కావడంతో మంగళవారం కూడా పాఠశాల జరిగింది. ఒంటిపూట బడుల నేపథ్యంలో ఉదయం 11 గంటల సమయంలో స్కూల్ పిల్లలను తిరిగి ఇంటికి చేర్చే క్రమంలో బస్సు జూపూడి చేరుకొనే సమయానికి అనుకోకుండా బస్సు డోరు తెరుచుకోవటంతో శశాంక్ జారి కిందపడ్డాడు. తలకు గాయం కావడంతో గుంటూరు తరలిస్తుండగానే చనిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement