700 మంది వెళితే తిరిగి వచ్చినవారు 93 మంది మాత్రమే! | 700 people went to Nepal, came back Only 93 ! | Sakshi
Sakshi News home page

700 మంది వెళితే తిరిగి వచ్చినవారు 93 మంది మాత్రమే!

Published Wed, Apr 29 2015 8:03 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

పల్లె రఘునాథ రెడ్డి

పల్లె రఘునాథ రెడ్డి

విశాఖపట్నం: ప్రభుత్వ అంచనా ప్రకారం ఏపీ నుంచి నేపాల్కు 700 మంది పర్యాటకులు వెళ్లారని  సమాచార పౌరసంబంధాలు, ఐటి శాఖ మంత్రి  రఘునాథ రెడ్డి తెలిపారు. అయితే వారిలో 93 మంది మాత్రమే తిరిగి వచ్చారని ఆయన చెప్పారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, మైనారిటీల సంక్షేమం చూడవలసిన బాధ్యతలను అప్పగిస్తూ మంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్  అధ్యక్షులుగా వ్యవహరిస్తారని, ఎస్పీ, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారని ఆయన తెలిపారు.

 పేద, మైనార్టీల వివాహాలకు ప్రభుత్వ సహాయాన్ని 25 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయలకు పెంచుతూ జీఓ జారీ చేసినట్లు మంత్రి పల్లె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement