సాలూరు : విజయనగరం జిల్లా లో పేకాట స్ధావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. రోజూ పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో శుక్రవారం ఆకస్మిక దాడి చేసిన పోలీసులు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలోని కంచేడువలస గ్రామంలో పేకాట ఆడుతున్న ఓ ఇంటిపై పోలీసులు శుక్రవారం సాయంత్రం దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిదిమందిని అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి రూ.11,700 నగదు, ఆటో, బైకు, ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.