కీచక మేనమామ | a person sexual attack on his niece | Sakshi
Sakshi News home page

కీచక మేనమామ

Published Sun, Dec 1 2013 4:20 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

a person sexual attack on his niece

 ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : మేనకోడలిని తండ్రిలా చూసుకోవాల్సిన మామ కామంతో కళ్లు మూసుకుపోరుు కాటెయ్యూలని చూశాడు. 13 ఏళ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేశాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా రుు. ఉట్నూర్ మండలం గంగాపూర్‌కు చెందిన దుర్గం జ్ఞానేశ్వర్ చెన్నూరు మండలం రొయ్యలపల్లికి చెందిన తన మేనకోడలి(13)పై కన్నేశాడు. ఆ బాలిక జిల్లా కేంద్రంలోని వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. శనివారం జ్ఞానేశ్వర్ జిల్లా కేంద్రానికి చేరుకుని పాఠశాలకు వెళ్లే సమయంలో మేనకోడలిని అడ్డుకున్నాడు. తనతో పార్కుకు రావాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. పాఠశాల వద్దే పడిగాపులు కాస్తూ బయటకు రావాలని హెచ్చరించడంతో భయందోళన గురైన బాలిక ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు విషయం చెప్పింది.

దీంతోవారు మహిళా సంరక్షణ అధికారి ఉజ్వలకు సమాచా రం అందించారు. వెంటనే ఆమె పాఠశాల ఎదుట పడిగాపులు కాస్తున్న జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న సంచిని సోదా చేయగా కిరోసిన డబ్బా, అగ్గిపెట్టే లభ్యమయ్యూరుు. అనుమానం కలగడంతో పాఠశాల లోపలికి తీసుకెళ్లి ప్రశ్నించగా తాను చనిపోవడానికి  కిరోసిన్ తెచ్చుకున్నానని బదులిచ్చాడు. ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించగా తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని చెప్పుకొచ్చా డు. బాలికను పిలిపించగా తన మేనమామను తల్లిదండ్రులు సైతం గతంలో పలుమార్లు మం దలించారని, అరుునా అతడి ప్రవర్తన మారలేదని పేర్కొంది.

దీపావళి సమయంలో హాస్టల్‌కు వచ్చి తనతో మేనకోడలిని పంపాలని కోరి నా అనుమానం వచ్చి పంపలేదని హాస్టల్ వా ర్డెన్ పేర్కొన్నారు. పోలీసులు జ్ఞానేశ్వర్ పర్సు ను పరిశీలించగా అందులో మేనకోడలు చిన్ననాటి ఫొటోలు లభించారుు. అతడి సెల్‌ఫోన్ స్క్రీన్‌పై ఆమె ఫొటో ఉంది. జ్ఞానేశ్వర్‌కు మేలో వివాహం జరగగా రెండు నెలల క్రితం భార్య అతడిని విడిచి వెళ్లిందని, నిర్మల్‌లో ఒంటరిగా ఉంటూ మేస్త్రీగా పనిచేస్తున్నాడని మహిళా సంరక్షణ అధికారి తెలిపారు. అతడు పారిపోయేందుకు యత్నించగా వన్‌టౌన్ పోలీసుల సాయంతో ఠాణాకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement