
శ్రీవారిని దర్శించుకున్న వేణుమాధవ్
తిరుమల: తిరుమల శ్రీవారిని శుక్రవారం రాజకీయ, సీనీ ప్రముఖులు దర్శించుకున్నారు. నటుడు వేణుమాధవ్ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి కూడా స్వామి సేవలో పాల్గొన్నారు. తన స్నేహితుడి కుమార్తె తల వెంట్రుకలు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుమలకు వచ్చినట్టు కాసు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు.