పోలింగ్ కేంద్రాలపై సూచనలివ్వండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: పోలింగ్ కేంద్రాల చేర్పులు - మార్పులపై తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని సం యుక్త కలెక్టర్ జి.వీరపాండ్యన్ రాజకీయ పార్టీల ప్రతి నిధులను కోరారు. ఎలక్టోరల్ సమరీ రివిజన్‌పై అన్ని రాజకీయ పార్టీలతో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి, ఆయన మాట్లాడారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ గ్రామీణ ప్రాం తాల్లో 1200 మంది ఓటర్లు, పట్టణ ప్రాంతాల్లో 1400 మించకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. సహా యక పోలింగ్ కేంద్రాలుగా ఉన్నవాటిని ప్రధాన పో లింగ్ కేంద్రాలుగా మార్చేందుకు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని 10 నియోజక వర్గాల పరిధి 15 ప్రాంతాల్లో లొకేషన్ మార్పునకు, ఆరు పోలింగ్ స్టేషన్ల పేర్లు మార్పునకు,
98 పోలింగ్ స్టేషన్ల రేషనలైజ్ చేసేం దుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. వీటిపై అభిప్రాయాలు, సూచనలను తెలి యజేయాని కోరారు. ఈ సందర్భం గా వివిధ పార్టీల ప్రతినిధులు మా ట్లాడుతూ వాటి జాబితాలను అందజేయాలని కోరారు. ఈ సమావేశం లో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి డోల జగన్, టీడీపీ జిల్లా ప్రతినిధి చౌదరి నారాయణమూర్తి (బాబ్జి), సీపీఐ పార్టీ ప్రతినిధి చౌదరి తేజేశ్వరరావు, బీజేపీ ప్రతినిధి కోటగిరి నారాయణరావు, ఆమ్‌ఆద్మీపార్టీ తరపున పైడి రవికుమార్, లోక్‌సత్తా పార్టీ ప్రతినిధిగా వి. అప్పలరాజు, బీఎస్పీ ప్రతినిధిగా కె. నీలకంఠం, డీఆర్వో నూర్ భాషాఖాసిం, ఎలక్టోరల్ అధికారులు బి.సూర్యనారాయణ, జి.మనోరమ, నియోజకవర్గాల తహశీల్దార్లు చక్రవర్తి, జల్లు రామారావు, జి. వీర్రాజు, ఆర్. అప్పలరాజు, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.