సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ముగ్గురు విద్యార్థులకు ఆదిత్యా బిర్లా స్కాలర్షిప్ లభించింది. జేఈఈ-అడ్వాన్సడ్ జాతీయస్థాయిలో ద్వితీయస్థానం సాధించి ప్రస్తుతం ఐఐటీ-బాంబేలో కంప్యూటర్సైన్స చదువుతున్న అద్దంకి రవిచంద్ర, ఐఐటీ-రూర్కీ విద్యార్థి మారం సాయివరుణ్రెడ్డి, నల్సార్‌లో న్యాయవిద్య అభ్యసిస్తున్న ఏ.ఎస్.రావునగర్‌కు చెందిన కాసర్ల హర్షితారెడ్డి ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైనవారిలో ఉన్నారు.
స్కాలర్‌షిప్‌గా ఐఐఎం విద్యార్థి అయితే ఏటా రూ. 1,75,000, ఐఐటీ, బిట్స విద్యార్థులు అయితే నాలుగేళ్ల పాటు ఏటా రూ.65 వేలు, న్యాయ విశ్వవిద్యాలయాల విద్యార్థులైతే ఐదేళ్లపాటు ఏటా రూ. 1,80,000 చెల్లిస్తారు. దేశంలో ఈ ఏడాది 41 మంది ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యారు.