‘తర్వాత నా పాత్ర ఏంటో స్వామినే అడగాలి’ | all is well in telangana and Andhra pradesh, says governor narasimhan | Sakshi
Sakshi News home page

‘తర్వాత నా పాత్ర ఏంటో స్వామినే అడగాలి’

Published Sat, Apr 1 2017 7:38 PM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

‘తర్వాత నా పాత్ర ఏంటో స్వామినే అడగాలి’ - Sakshi

‘తర్వాత నా పాత్ర ఏంటో స్వామినే అడగాలి’

తిరుమల : ఇరు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు అభివృద్ధిలో పోటీపడి పనిచేస్తున్నారని గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసించారు. పదేళ్లుగా గవర్నర్‌గా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉందని గవర్నర్‌ అన్నారు.

ఆయన శనివారం తిరుమల వెంకన్నను దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్‌ 17న రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. పదేళ్లు గవర్నర్‌గా పని చేయడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. గవర్నర్‌  పదవి అనంతరం తన పాత్ర ఏంటో కలియుగ దైవం వెంకటేశ్వరస్వామినే  అడగాలన్నారు. ఇక ఏపీ కబినెట్‌ విస్తరణ సందర్భంగా రేపు (ఆదివారం) ఉదయం 9.22 గంటలకు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement