సీఎం జగన్‌ నిర్ణయం అభినందనీయం | Allahabad Former Chief Justice Lakshman Rao Praised CM Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ నిర్ణయం అభినందనీయం

Nov 24 2019 4:04 PM | Updated on Nov 24 2019 8:16 PM

Allahabad Former Chief Justice Lakshman Rao Praised CM Jagan - Sakshi

సాక్షి, గుంటూరు: ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ అధ్యక్షుడిగా లక్ష్మణ్‌రెడ్డిని నియమించడం మంచి నిర్ణయం అని అలహాబాద్‌ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణరావు అన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంచి బాధ్యతను అప్పగించారన్నారు. ఆదివారం గుంటూరులో మాట్లాడుతూ.. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకూడదన్న సీఎం నిర్ణయం అభినందనీయం  అని ప్రస్తుతించారు. మద్యం వల్ల పేద కుటుంబాలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాయన్నారు. కుటుంబాల హింసకు గురైన పిల్లలు రోడ్డున పడుతున్నారని తెలిపారు.  అనేక నేరాలు, అరాచకాలు, రోడ్డు ప్రమాదాలకు కారణం మద్యమేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement