justice lakshman reddy
-
న్యాయ రాజధానిలో ‘లోకాయుక్త’ ప్రారంభం
కర్నూలు (సెంట్రల్): లోకాయుక్త కార్యాలయాన్ని శనివారం కర్నూలులో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలోని మూడో గదిలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి ప్రారంభించి.. తన చాంబర్లో ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డికి కలెక్టర్ పి.కోటేశ్వరరావు, డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, జేసీలు ఎస్.రామ్సుందర్రెడ్డి, ఎంకేవీ శ్రీనివాసులు, డీఆర్వో బి.పుల్లయ్య తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జస్టిస్ లక్ష్మణరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ప్రజలు లోకాయుక్త గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందన్నారు. చదవండి: Andhra Pradesh: పేద విద్యార్థులకు... టాప్ వర్సిటీల్లో సీట్లు ప్రజలు తమకు అన్యాయం జరిగినప్పుడు పోస్టు, మెయిల్ ద్వారా గానీ, లేదంటే వాట్సాప్, ఫోన్ ద్వారా తమ సమస్యను చెబితే చాలన్నారు. వాటిని విచారించి న్యాయం చేస్తామని తెలిపారు. గతంలో హైదరాబాద్‌లో లోకాయుక్త కార్యాలయముండేదని గుర్తు చేశారు. ఆ సమయంలో ఏపీలోని కోస్తాంధ్ర నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. అక్కడి ప్రజలు తమకు చిన్న సమస్య వచ్చినా కూడా లోకాయుక్తను ఆశ్రయించేవారన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు దీని గురించి సరైన అవగాహన లేకపోవడంతో.. ఫిర్యాదులు పెద్దగా వచ్చేవి కాదన్నారు. రాయలసీమ ప్రజలు కూడా లోకాయుక్త గురించి తెలుసుకొని న్యాయం పొందాలని కోరారు. చదవండి: పంటలకు ‘ధ్రువీకరణ’ ధీమా మొదటి రోజే ఫిర్యాదు.. కర్నూలులో కార్యాలయం ప్రారంభమైన మొదటి రోజే లోకాయుక్తకు ఒక ఫిర్యాదు అందింది. కోడుమూరు మండలం పులకుర్తికి చెందిన వరలక్ష్మమ్మ అనే వృద్ధురాలి నుంచి జస్టిస్ లక్ష్మణరెడ్డి ఫిర్యాదును నేరుగా స్వీకరించారు. తమ గ్రామంలో దేవుడి మాన్యం ఆక్రమణలపై ఆమె ఫిర్యాదు చేసింది. కార్యక్రమంలో లోకాయుక్త రిజిస్ట్రార్ విజయలక్ష్మి, సెక్రటరీ అమరేందర్‌రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ పోలయ్య, ఆర్డీవో హరిప్రసాదు, కల్లూరు తహసీల్దార్ రమేష్‌బాబు, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషునాయుడు పాల్గొన్నారు. -
సీఎం జగన్ నిర్ణయం అభినందనీయం
సాక్షి, గుంటూరు: ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ అధ్యక్షుడిగా లక్ష్మణ్‌రెడ్డిని నియమించడం మంచి నిర్ణయం అని అలహాబాద్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు అన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి బాధ్యతను అప్పగించారన్నారు. ఆదివారం గుంటూరులో మాట్లాడుతూ.. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకూడదన్న సీఎం నిర్ణయం అభినందనీయం అని ప్రస్తుతించారు. మద్యం వల్ల పేద కుటుంబాలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాయన్నారు. కుటుంబాల హింసకు గురైన పిల్లలు రోడ్డున పడుతున్నారని తెలిపారు. అనేక నేరాలు, అరాచకాలు, రోడ్డు ప్రమాదాలకు కారణం మద్యమేనన్నారు. -
లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి పదవీ స్వీకార ప్రమాణం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం 11 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల పాటు లక్ష్మణ్‌రెడ్డి ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అవినీతి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. లోకాయుక్త నియామకంతో పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం కానున్నాయి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన లోకాయుక్తకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. -
అవినీతిపై ఆయుధం.. లోకాయుక్త
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/మంగళగిరి: అవినీతిపై ప్రజా ఆయుధంగా లోకాయుక్త వ్యవస్థ తోడ్పడుతుందని ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయనకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అవినీతిపై సాక్ష్యాలుంటే లోకాయుక్తకు ఫిర్యాదు చేయాలని, న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ అవినీతి రహిత, పారదర్శక పాలన అందించాలని బలంగా కోరుకుంటున్నారని, లోకాయుక్త నియామకం ద్వారా ఆయన ఆకాంక్ష నెరవేరుతుందన్నారు. కార్యక్రమంలో మానసిక నిపుణుడు డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి, సెంట్రల్ కస్టమ్స్ జాయింట్ కమిషనర్ శ్రీకాంత్, జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ సీఎస్ రాజు, జనచైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జి విజయసారథి పాల్గొన్నారు. సీఎంను కలిసిన జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళగరి పట్టణంలోని లక్ష్మీనృసింహస్వామిని జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి.. కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. (టీడీపీ) తదితరులు -
జస్టిస్ శివశంకరరావు బాధ్యతల స్వీకరణ
సాక్షి; అమరావతి: ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. శివశంకరరావు అన్నారు. టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన కమిటీ చైర్మన్‌గా శనివారం సచివాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టెండర్ల విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టాన్ని తెచ్చి, దీన్ని అమలు చేయడానికి ఒక న్యాయమూర్తిని నియమించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. విదేశాల్లో కూడా ఈ తరహా విధానం ఎక్కడా లేదని వెల్లడించారు. లోకకళ్యాణం కోసం మనమంతా జీవించాలని, ప్రజా సేవకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. హక్కుల కోసం పోరాడేవారు బాధ్యతగా ఉండాలని.. కర్మబద్దంగా.. ధర్మబద్దంగా అందరూ పని చేయాలని ఆయన అన్నారు. బాధ్యతలు చేపట్టడానికి ముందు తాడేపల్లి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని జస్టిస్ శివశంకరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం జగన్‌ను కలిసిన లక్ష్మణ్‌రెడ్డి తాడేపల్లి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర లోకాయుక్తగా ఆయన రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. -
ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతి నిరోధానికి తీసుకుంటున్నచర్యల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏపీ లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించింది. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. లోకాయుక్త నియామకంతో పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం కానున్నాయి. ఇటీవల తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం ప్రకారం హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తిని లోకాయుక్తగా నియమించుకునే వెసులు బాటు ప్రభుత్వానికి ఉంది. లక్ష్మణ్‌రెడ్డిని లోకాయుక్తగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘అగ్రిగోల్డ్’ పరిష్కారంలో జాప్యం సరికాదు
హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితుల కేసు కోర్టులో ఉందని సాకు చూపుతూ వారి సమస్యను పరిష్కరించడంలో జాప్యం చేయడం సరికాదని, సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తానంటే ఏ కోర్టూ అభ్యంతరం తెలపదని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నా రూ.1,150 కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు మంజూరు చేసిందని, తెలంగాణలోని బాధితులకు రూ.500 కోట్లు కేటాయిస్తే సరిపోతుందని, దీనిలో ముందుగా రూ.300 కోట్లు మాత్రమే కేటాయించాలని కోరుతున్నారని అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించి బాధితులకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్‌బాబు, అడ్వొకేట్ శ్రవణ్‌కుమార్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జస్టిస్ లక్ష్మణరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, సీపీఐ నగర కార్యదర్శి ఇ.టి.నర్సింహ హాజరయ్యారు. జస్టిస్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ సంస్థ నిర్వాహకులను ప్రభుత్వం అప్పుడే అరెస్టు చేసి ఉంటే బాగుండేదని, కానీ ఉదాసీనంగా వ్యవహరించడంతో వారు తమ ఆస్తులను బినామీల పేరిట బదలాయించారని, ప్రస్తుతం తమ వద్ద ఏమీ లేదని అంటున్నారని, ఇందులో ప్రభుత్వ తప్పు కూడా ఉందన్నారు. బాధితుల్లో 95% మంది పేదవారేనని, ప్రభుత్వం ఎన్నింటికో ఎన్నో ఖర్చు చేస్తున్నదని, రూ.500 కోట్లు బాధితులకు ఇవ్వాలన్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ పశ్చిమబెంగాల్లో శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో మోసపోయిన బాధితులకు అక్కడి ప్రభుత్వం న్యాయం చేసిందని, ఆ సంస్థ ఆస్తులను జప్తు చేసి బాధితులకు ఇచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణలో కూడా అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసి బాధితులకు ఇవ్వాలన్నారు. ధనిక రాష్ట్రంలో రూ.500 కోట్లు ఇవ్వలేరా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని, బాధితులకు రూ.500 కోట్లు ఇవ్వడం పెద్ద సమస్య కాదని అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో ప్రాజెక్టులు, నీళ్లు, పంపకాలపై సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ సమస్యపై కూడా దృష్టి సారించాలన్నారు. నర్సింహ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేసేందుకు ఎందుకు వెనకాడుతున్నదని ప్రశ్నించారు. ఇటీవల 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని, వారి సీటుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదేళ్లలో ఎన్ని పోరాటాలు చేసినా స్పందించలేదని, జగన్ మేనిఫెస్టోలో చేర్చగానే అధికారంలోకి వచ్చారన్నారు. -
రాయలసీమకు ఏపీ సర్కారు అన్యాయం
సాక్షి, హైదరాబాద్: ఏపీ సర్కారు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తోందని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(గ్రాట్) వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాచుపల్లి ఎక్స్‌రోడ్డులోని కొలను హన్మంత్‌రెడ్డి గార్డెన్స్‌లో జరిగిన కార్తీకమాస వనభోజన మహోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమాన్ని జస్టిస్ బి.శేషశయనారెడ్డి ప్రారంభించారు. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్య, ఉద్యోగ రంగాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్నారు. సరైన నైపుణ్యాల్లేక ఉద్యోగాల సాధనలో విద్యార్థులు వెనకబడుతున్నారన్నారు. విభజన తర్వాత టీడీపీ సర్కారు అభివృద్ధిని అన్నివిధాలా అమరావతికే పరిమితం చేసిందని పేర్కొన్నారు. ఎంతటి జబ్బు చేసి నా గతంలో ఆరోగ్యశ్రీ పథకం ఉండటంతో హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుకు వెళ్లి చికిత్సలు చేయించుకొని నయం చేసుకొనేవారని, ఈ సదుపాయాన్ని టీడీపీ సర్కారు తొలగించి సీమవాసుల నడ్డి విరిచిందన్నారు. ఇప్పటికైనా ఏపీ సర్కారు ఆలోచించి ఆరోగ్యశ్రీని పాత పద్ధతిలోనే వర్తింపచేయాలని కోరారు. హైదరాబాద్‌లోని సీమవాసులకు అండదండగా ఉంటామని తెలిపారు. ‘కృషి’లో ఉచిత శిక్షణ విశ్రాంత ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎ. హనుమంతరెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న రాయలసీమ వాసులందరం ఒక్కటై కష్టసుఖా లు పంచుకొంటూ ముందుకు సాగుదామని సూచించారు. విద్యార్థినీవిద్యార్థులకు ‘కృషి’విద్యాసంస్థలో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు దోహదపడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. అనంతరం 2019 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జస్టిస్ బి.శేషశయనారెడ్డి, జస్టిస్ బి.క్రిష్ణమోహన్‌రెడ్డి, గ్రాట్ అధ్యక్షుడు ఎం.ఓబుళరెడ్డి, గ్రాట్ వ్యవస్థాపక ఉపాధ్యక్షురాలు ఎ.శ్యామలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వికేంద్రీకరణతోనే ఏపీ అభివృద్ధి
కడప అగ్రికల్చర్: అభివృద్ధిని ఏదో ఒక ప్రాంతానికే పరిమితం చేస్తే అనర్థాలు వస్తాయని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ‘‘అభివృద్ధి వికేంద్రీకరణ–రాయలసీమలో హైకోర్టు’’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిని ఏపీలోని అన్ని ప్రాంతాలకు సమానంగా పంచినప్పుడు సమస్యలు ఉత్పన్నం కావని తెలిపారు. పెద్ద పెద్ద సంస్థలు, ఆస్పత్రులు, రాజధాని, హైకోర్టు ఇలా అన్నీ హైదరాబాద్‌లో ఉంచడం వల్ల తీవ్రంగా నష్టపోయామన్నారు. నాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కమిటీ రాజధాని కర్నూలులోను, హైకోర్టు గుంటూరులోను, రాయలసీమ జిల్లాల్లో ప్రాజెక్టులను నిర్మించాలని చెప్పిందని గుర్తు చేశారు. విద్యా సంస్థలు, పరిపాలనా కేంద్రాలను పలు ప్రాంతాల్లో నెలకొల్పితేనే అభివృద్ధి సాధ్యమని శ్రీబాగ్ ఒడంబడిక చెబుతోందన్నారు. కానీ నేడు మళ్లీ ఇప్పటి పాలకులు అభివృద్ధిని ఒకేచోట నిక్షిప్తం చేయడం బాధాకరమన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ ఏపీ అంతటా పర్యటించి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పిందని, రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట, రాష్ట్ర పరిపాలన కోసం జోనల్ కార్యాలయాలు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చెప్పారని కేంద్రానికి నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే కేంద్రం ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం చర్యలు చేపట్టకుండా ఏపీ సర్కారుకు బాధ్యతలు అప్పగించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో గానీ, మేధావులతో గానీ చర్చించకుండా ఏకపక్షంగా కొంతమంది వ్యాపార వేత్తలతో కూర్చొని ఒకే చోట అభివృద్ధి కేంద్రీకరిస్తోందని మండిపడ్డారు. ఇలా చేస్తే రాయ లసీమ సమితి తరçఫున మరో విభజన ఉద్యమానికి నాంది పలికినట్లు అవుతుందని ప్రభుత్వాన్ని మొదట్లోనే హెచ్చరించామన్నారు. బీజేపీ నాయకులు ఇటీవల కర్నూలులో ఒక డిక్లరేషన్ విడుదల చేశారని, దాన్ని అమలు చేసేలా చర్యలు చేపడితే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని తెలిపారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఒకేచోట అభివృద్ధిని ఎందుకు కేంద్రీకరణ చేస్తున్నారని ప్రశ్నించి, వివిధ ప్రాంతాల్లో పరిపాలనను, అభివృద్ధిని వికేంద్రీకరించేలా చట్టం చేయాలని డిమాండ్ చేయాలన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ప్రధాని స్థాయిలో హామీ ఇస్తేనే ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి, రాయలసీమ కార్మిక,కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మస్తాన్‌వలి, జనచైతన్య వేదిక ఏపీ అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓటుతో బుద్ధి చెప్పాలి
హైదరాబాద్: చట్టాలను, నిబంధనలను ఉల్లంఘిస్తున్న పాలకులకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ (ఎపీసీఎల్ఏ) ఆధ్వర్యంలో ‘‘మానవ హక్కులు.. సుపరిపాలన’’అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో పాలకులను ప్రశ్నిస్తే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని, పైగా అభివృద్ధి నిరోధకులని ముద్ర వేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం, పాలకుల పనితీరు బాగుంటే ప్రజలు ఎందుకు కోర్టును ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై కోర్టుకు వెళ్లే న్యాయవాదుల పట్ల పాలకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. శాసనసభలు, బహిరంగ సభల్లో కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదన్నారు. మేధావుల ఆలోచనలు విస్మరిస్తున్నారు మేధావులు, నిపుణులు, సామాజిక కార్యకర్తల ఆలోచనలను ప్రభుత్వం లెక్కలోకి తీసుకోవడం లేదని జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేసిన చట్టాలను ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులు ప్రజా సమస్యలపై స్పందించాలని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ పెరిగిందని, ఇది పక్క రాష్ట్రాలకూ పాకిందని అన్నారు. పాలకులకు చట్టం లేదు, రాజ్యాంగం లేదని, ఫిరాయింపులే చట్టంగా భావిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి తీరని నష్టమని విమర్శించారు. భూ నిర్వాసితుల చట్టం, సమాచార హక్కు చట్టాలను సైతం నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని అన్నారు. సమాజంలోని పౌరులందరికీ సమాన హక్కులు లభించినప్పుడే సుపరిపాలన లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎపీసీఎల్ఎ రాష్ట్ర అధ్యక్షుడు పొత్తూరి సురేశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, సామాజిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు. -
బలవంతపు భూసేకరణ తప్పే: జస్టిస్ లక్ష్మణరెడ్డి
-
మందడంలో రౌండ్‌టేబుల్ సమావేశం రసాభాస
గుంటూరు : గుంటూరు జిల్లా తుళ్లురు మండలం మందడంలో శుక్రవారం రౌండ్‌టేబుల్ సమావేశం రసాభాసగా మారింది. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ నేత అనుమోలు హరి అడ్డుకున్నారు. దాంతో రైతులు ఎదురు తిరిగారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వర్గీయులు, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.