ప్రేమి‘కుల’ విషాదాంతం | And of course a 'caste' Tragedy | Sakshi
Sakshi News home page

ప్రేమి‘కుల’ విషాదాంతం

Published Sun, Dec 22 2013 4:37 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

And of course a 'caste' Tragedy

సారంగాపూర్, న్యూస్‌లైన్: పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరని, ఇక తాము కలిసి బతికే అవకాశం లేదని భావించిన ప్రేమికులు కలిసే చనిపోయారు. సారంగాపూర్ మండలం మంగేళ గ్రామానికి చెందిన రొండి రంజిత్(22), అదే గ్రామానికి చెందిన పడిగెల వనజ(19) ఆదిలాబాద్ జిల్లా జన్నారంలో శని వారం ఆత్మహత్య చేసుకున్నారు. రంజిత్ జగి త్యాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా, వనజ పదవ తరగతి చదివి ఇంటిలో బీడీలు చుడుతూ, కుట్టుమిషన్ నేర్చుకుంటోంది.
 
 ఇద్దరి ఇండ్లు ఎదురెదురుగా ఉండడంతో రోజు కలుసుకొని మాట్లాడునేవారు. ఇదే క్రమంలో మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేర్వేరు కావడంతో ఇద్దరివైపు పెళ్లికి నిరాకరించారు. వనజ తల్లితండ్రులు.. మీ అబ్బాయి తరచూ మా అమ్మాయి వైపు చూస్తున్నాడని, మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడని రంజిత్ తల్లితండ్రులతో చాలాసార్లు గొడవకు దిగారు. ఏడాది క్రితం ఈ విషయంలో పంచాయితీ జరిగినప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు పెరిగాయి. రెండు నెలల క్రితం వనజకు పెళ్లి చేసేందుకు నిశ్చయించిన పెద్దలు వరపూజ చేశారు.
 
 మార్చిలో పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక తమ పెళ్లి జరగదని మనస్తాపం చెందిన రంజిత్, వనజ శనివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో వేర్వేరుగా ఆటోల్లో జిల్లా జన్నారం చేరుకున్నారు. క్రిమిసంహారక మందు తాగి బస్టాండ్ ప్రాంతం నుంచి కాలినడకన వస్తూ పాతబస్టాండ్ మార్కెట్ ప్రధాన రహదారి వద్దకు చేరుకోగానే కిందపడిపోయూరు. అక్కడున్నవారు గమనించి 108 సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం లక్సెట్టిపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరూ చనిపోయూరు. సంఘటన స్థలాన్ని ఇన్‌చార్జి ఎస్సై చంద్రమోహన్ పరిశీలించారు. యువకుడి వద్ద లభించిన ఆధార్ కార్డు, సెల్‌ఫోన్‌లో ఉన్న నంబర్ల ఆధారంగా ప్రేమజంటది మంగేళ గ్రామంగా గుర్తించినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో అందరూ అక్కడికి తరలివెళ్లారు. రంజిత్, వనజల కుటుం బాలు ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నాయి. రంజిత్ తండ్రి కొండయ్య, తల్లి లక్ష్మి వ్యవసాయం చేసుకుంటారు. వీరికి రాజేశ్, రంజిత్ ఇద్దరు కుమారులు. ఇద్దరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. వనజ తల్లితండ్రులు బుగ్గవ్వ, చిన్నయ్యలకు వనజ ఒక్కగానొక్క కుమార్తె కాగా, కుమారుడు రాములు ఉన్నాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement