సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నాడు మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 132 కి చేరాయి. నెల్లూరులో గురువారం ఒక్క రోజే 17 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు మొత్తం 20 పాజిటివ్ కేసులు నెల్లూరులో నమోదయ్యాయి. ఇక మిగిలిన జిల్లాల విషయానికి వస్తే పశ్చిమ గోదావరిలో 14, విశాఖపట్నంలో 11, ప్రకాశం జిల్లాలో 17, కర్నూల్‌లో 1, కృష్ణాజిల్లాలో 15, కడపలో 15, గుంటూరులో 20లో నమోదయ్యాయి.
ఇక తూర్పుగోదావరిలో 9, చిత్తూరులో 8, అనంతపురంలో 2 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1800 మందికి కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. 1175 మందికి కరోనా నెగటివ్‌గా నిర్ధారించారు. ఇంకా వీటిలో 493 మంది పరీక్ష ఫలితాలు రావాల్సి ఉన్నాయి. గురువారం వచ్చిన కేసుల్లో కూడా పాజిటివ్ కేసుల్లో ఎక్కువ భాగం ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారేనని తెలుస్తోంది. మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 109 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక భారత్‌లో ఇప్పటి వరకు 1980 మంది కరోనా బారినా పడగా.. 59 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 144 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 9 లక్షలు దాటాయి.
Comments
Please login to add a commentAdd a comment