ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన మార్కులను సాధించారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన మార్కులను సాధించారు. ఎంపీసీలో టాపర్‌గా కస్పా వేణుమాధవి(989) నిలిచింది. స్థానిక దమ్మలవీధిలో నివాసం ఉంటున్న వేణుమాధవి శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చదివింది. ఎం.ఆంజనేయ రాకేష్, చింతాడ మోణిక సింధులు 988 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. బస్వ హర్షవర్ధన్, ఆర్.ఎల్.ఎల్.వి.భారతి ఎం, జి.నరేష్‌కుమార్, ముద్దాడ యామినిలు 987 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు.
కె.గౌతమ్‌నాయుడు, ఎ.సంతోష, ఎస్.తుషారిక తేజస్విలు 986 మార్కులతో నాల్గవస్ధానంలో నిలిచారు. వీరంతా శ్రీకాకుళంలోని శ్రీచైతన్య నారాయణ జూనియర్ కళాశాల్లో చదువుతున్నవారు. బైపీసీ విభాగంలో టాపర్‌గా వి.దీపికప్రియ 987 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. శ్రీకాకుళం శ్రీచైతన్యకే చెందిన కరణం మౌనీష్, దుంగ ప్రదీప్‌కుమార్‌లు 986 మార్కులతో రెండోస్థానంలో నిలిచారు.
అట్టాడ కాత్యాయిని 985 మార్కులతో తృతీయ స్ధానం, కె.మానస సౌజన్య 984 మార్కులతో నాల్గవస్థానంలో నిలిచారు. శ్రీకాకుళం ప్రభుత్వ కళాశాలలో భరద్వాజ్ 967 మార్కులు, సాయితేజ 952 మార్కులతో రాణించారు. హెచ్‌ఈసీలో ఎం.ప్రవీణ్‌కుమార్ 898 మార్కులతో రాణించాడు. ఒకేషనల్ కోర్సులో శ్రీకాకుళం బాలుర కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో కె.రాజ్‌కుమార్ 951 మార్కులతో టాపర్‌గా నిలిచాడు.