
అమరావతి : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. 70 సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ నేతృత్వంలో గొప్ప వ్యక్తులు ప్రసాదించిన భారత రాజ్యాంగం మనల్ని బలోపేతం చేస్తోందని అన్నారు. రాజ్యాంగ సూత్రాల ప్రామాణికంగా అందరికీ రాజకీయ, సామాజికార్ధిక న్యాయం జరిగేందుకు కట్టుబడాలని ఈ సందర్భంగా మనమంతా ప్రతినబూనాలని వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment