constitution day
-
స్వేచ్ఛ, సమానత్వానికి మన రాజ్యాంగం హామీ
సాక్షి, అమరావతి: ‘మన రాజ్యాంగం సార్వబౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, న్యాయ, సమానత్వ, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాలకు హామీ ఇస్తుంది’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. ఇలాంటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలని కోరారు. రాజ్యాంగ వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభం. ఈవీఎంల పని తీరుపై దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.వాటి పని తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు మనం కూడా పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాదు.. ఉన్నట్టుగా కూడా కనిపించాలి.మన దేశ ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు వాక్ స్వాతం్రత్యాన్ని హరించడానికి.. ప్రశ్నించే గొంతును నొక్కేయడానికి కొంత కాలంగా దూకుడుగా ప్రయతి్నస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రాజ్యాంగాన్ని రూపొందించి, ఇదే పవిత్రమైన రోజున ఆమోదించి, మన దేశాన్ని ఏకీకృత, సమానత్వం వైపు నడిపిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తోపాటు దార్శనిక నాయకులకు మనం ఘనంగా నివాళులు అర్పిద్దాం’ అని పేర్కొన్నారు. -
విశ్వబంధు భారత్‌కు.. రాజ్యాంగమే పునాది
న్యూఢిల్లీ: రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ సామాన్య ప్రజల జీవితాలను మెరుగ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కలిసికట్టుగా పని చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వర్గం, శాసననిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థపై ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. పౌరుల ప్రాథమిక విధులను రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించారని చెప్పారు. దేశ ఐక్యత, సమగ్రత, సమాజంలో సామరస్యంతోపాటు మహిళల గౌరవాన్ని కాపాడడం పౌరుల విధి అని చెప్పారు. కార్యనిర్వాహక వర్గం, శాసననిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థతోపాటు ప్రజలు కూడా కలిసి క్రియాశీలకంగా పనిచేస్తే రాజ్యాంగ ఆశయాలకు బలం చేకూరుతుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లలో పార్లమెంట్లో ఎన్నో చట్టాలు తీసుకొచ్చిందని గుర్తుచేశారు. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజల జీవితాలు మెరుగుపడుతున్నాయని, వారి పురోభివృద్ధికి నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో మంగళవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. కార్యక్రమానికి పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు హాజరయ్యారు. మన రాజ్యాంగం ఒక ప్రగతిశీల పత్రం అని రాష్ట్రపతి పేర్కొన్నారు. దూరదృష్టి కలిగిన మన రాజ్యాంగ నిర్మాతలు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఆలోచనలను అందిపుచ్చుకొనే వ్యవస్థను అందించారని కొనియాడారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధికి సంబంధించి రాజ్యాంగం ద్వారా మనం ఎన్నో ఘనతలు సాధించామని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం మాట్లాడారంటే.. విశ్వబంధు భారత్ ‘‘దేశ ఐక్యత, సమగ్రతతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవడం, శాస్త్రీయ దృక్పథం పెంచుకోవడం, ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవడం, అభివృద్ధిలో దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడం పౌరుల ప్రాథమిక విధులు. నూతన పథంలో పయనిస్తే అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి నూతన గుర్తింపును సాధించిపెట్టగలం. అంతర్జాతీయంగా శాంతి భద్రతలను పెంపొందించేలా కీలక పాత్ర పోషించడానికి రాజ్యాంగ నిర్మాతలు భారత్‌కు మార్గనిర్దేశం చేశారు. నేడు మన దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. విశ్వబంధుగా ప్రపంచవ్యాప్తంగా చురుకైన పాత్ర పోషిస్తోంది. భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజ్యాంగమే బలమైన పునాది రాయి. ప్రజల సమ్మిళిత, వ్యక్తిగత గౌరవాన్ని రాజ్యాంగం కాపాడుతోంది. స్వాతంత్య్ర పోరాట ఫలితమే రాజ్యాంగం వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన 75వ గణతంత్ర వేడుకలు నిర్వహించుకోబోతున్నాం. ఇప్పటిదాకా సాగిన మన ప్రయాణాన్ని సమీక్షించుకోవడానికి, భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రయాణానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి వేడుకలు ఎంతగానో తోడ్పడతాయి. మన ఐక్యతను బలోపేతం చేస్తాయి. జాతీయ లక్ష్యాలను సాధించడంలో మనమంతా కలిసకట్టుగా ఉన్నామని తెలియజేశాయి. ఎందరో మహామహులు దాదాపు మూడేళ్లపాటు కృషి చేయడంతో రాజ్యాంగం మన చేతికి వచ్చింది. నిజానికి సుదీర్ఘంగా జరిగిన స్వాతంత్య్ర పోరాట ఫలితమే భారత రాజ్యాంగం. ఈ పోరాట స్ఫూర్తి, ఆశయాలను రాజ్యాంగం ప్రతిబింబిస్తోంది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సమున్నత ఆశయలను రాజ్యాంగ పీఠికలో పొందుపర్చారు. ఇవే దశాబ్దాలుగా భారత్‌ను నిర్వచిస్తున్నాయి. స్వశక్తితో పైకి ఎదిగే, సమాజానికి సేవలందించే, తోటి మానవులకు సాయం అందించే వాతావరణాన్ని రాజ్యాంగ పీఠిక కల్పించింది. 2015 నుంచి సంవిధాన దివస్ జరుపుకుంటున్నాం. దీనివల్ల రాజ్యాంగంపై యువతలో అవగాహన పెరుగుతోంది. మీ ప్రవర్తనలో రాజ్యాంగ విలువలను, ఆశయాలను జోడించాలని ప్రజలందరినీ కోరుతున్నా. పౌరులంతా ప్రాథమిక విధులను నిర్వర్తించాలి. ‘2047 నాటికి వికసిత్ భారత్’ అనే లక్ష్యం దిశగా అంకితభావంతో ముందుకు సాగాలి’’ అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలే అత్యున్నతం: జగదీప్ ధన్‌ఖడ్ రాజకీయ పార్టీలు దేశం కంటే మత విశ్వాసాలకు, స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తే మన స్వాతంత్య్రం రెండోసారి ప్రమాదంలో పడుతుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పినట్లు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ గుర్తుచేశారు. ఆయన పాత పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవంలో ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలకు ప్రభావవంతంగా సేవలందించాలంటే చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు, నిర్మాణాత్మక సంవాదాలు జరగాలని చెప్పారు. మన ప్రజాస్వామ్య దేవాలయాల పవిత్రతను పునరుద్ధరించాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘భారతదేశ ప్రజలమైన మేము’ అని రాజ్యాంగ పీఠికలో ప్రారంభంలోనే పేర్కొన్నారని, ఇందులో లోతైన అర్థం ఉందని, ప్రజలే అత్యున్నతం అని తేల్చి చెప్పారు. ప్రజల గొంతుకగా పార్లమెంట్ పని చేస్తోందని వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనవర్గం, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ అనే మూడు మూలస్తంభాలను రాజ్యాంగం ఏర్పాటు చేసిందని తెలిపారు. రాజ్యాంగ సంస్థలు కలిసి పనిచేస్తే ప్రజాస్వామ్యం మరింత వెలుగులీనుతుందని సూచించారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక విధులను ప్రజలంతా నిర్వర్తించాలని కోరారు. దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వికసిత్ భారత్ అనే లక్ష్య సాధనకు గతంలో కంటే ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జగదీప్ ధన్‌ఖడ్ వెల్లడించారు. రాజ్యాంగం ఒక ఉ్రత్పేరకం: ఓం బిర్లా చట్టసభల్లో నిర్మాణాత్మక, గౌరవప్రదమైన చర్చలు జరగాలని రాజ్యాంగ సభ సూచించినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఇదే సంప్రదాయాన్ని చట్టసభల సభ్యులు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. రాజ్యాంగ దినోత్సవంలో ఓం బిర్లా ప్రసంగించారు. మన స్వాతంత్య్ర పోరాట వీరుల త్యాగం, అంకితభావం, దార్శనికతకు రాజ్యాంగం ఒక ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. సామాజిక మార్పునకు, ఆర్థిక ప్రగతికి రాజ్యాంగమే ఒక ఉ్రత్పేరకం అని చెప్పారు. సాధారణ ప్రజల స్థితిగతుల్లో ఎన్నో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని, ప్రజాస్వామ్యం పట్ల వారి విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసిందని వివరించారు. చట్టసభల్లో చక్కటి చర్చల ద్వారా రాజ్యాంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఎంపీలకు ఓం బిర్లా పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువల పట్ల మన తిరుగులేని అంకితభావం అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను మరింత పెంచుతుందని ఉద్ఘాటించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి నిర్వహించాలని ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ సూచించారు. -
జాతికి కరదీపిక మన రాజ్యాంగం: మోదీ
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగాన్ని జాతికి దారి చూపే కరదీపికగా ప్రధాని నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. కీలకమైన పరివర్తన దశలో మన రాజ్యాంగం దేశానికి అన్ని విషయాల్లోనూ దారి చూపుతూ చుక్కానిలా వ్యవహరిస్తోందన్నారు. ‘‘మన రాజ్యాంగం కేవలం నిబంధనల పుస్తకం కాదు. అదో సజీవ స్రవంతి. కోట్లాది మంది భారతీయుల అవసరాలు, ఆశలను తీర్చడంలోనే గాక వారి ఆకాంక్షలు, అంచనాలను అందుకోవడంలో ఏనాడూ విఫలం కాలేదు. చివరికి ఎమర్జెన్సీ వంటి అతి పెద్ద సవాలును కూడా తట్టుకుని సమున్నతంగా నిలిచింది’’ అంటూ కొనియాడారు. మంగళవారం సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ దిన వేడుకల్లో ప్రధాని ప్రసంగించారు. దేశమే ముందన్న భావన పౌరులందరిలో నిండుగా ఉండాలని హితవు పలికారు.ఆ భావనే మన రాజ్యాంగాన్ని మరిన్ని శతాబ్దాల పాటు సజీవంగా ఉంచుతుందని అభిప్రాయపడ్డారు. స్వీయ అవసరాల కంటే దేశ ప్రయోజనాలను మిన్నగా భావించే కొద్దిమంది నిజాయతీపరులు దేశానికి చాలని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ తొలి భేటీలో బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని గుర్తు చేశారు. ‘‘కాలానుగుణంగా వచ్చే మార్పులను రాజ్యాంగం తనలో ఇముడ్చుకునేలా దాని నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.స్వతంత్ర భారత ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, పౌరుల అవసరాలు, సవాళ్లు కాలంతో పాటు ఎంతగానో మారతాయని వారికి బాగా తెలుసు’’ అని అన్నారు. జమ్మూ కశ్మీర్లో తొలిసారి రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలవుతుండటం ఆనందకరమన్నారు. ‘‘పౌరుల్లో మానవీయ విలువలను పాదుగొల్పాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. అందుకే రాజ్యాంగపు తొలి హస్తలిఖిత ప్రతిలో రాముడు, సీత, గురు నానక్, బుద్ధుడు, మహావీరుడు తదితరుల చిత్రాలను చేర్చారు’’ అని గుర్తు చేశారు.ఎన్నడూ పరిధి దాటలేదు: మోదీరాజ్యాంగ పరిధులను తానెన్నడూ దాటలేదని ప్రధాని మోదీ అన్నారు. ప్రధానిగా ఎప్పుడూ రాజ్యాంగం నిర్దేశించిన సరిహద్దులకు లోబడి పని చేసేందుకే ప్రయతి్నంచానని స్పష్టం చేశారు. ‘‘ఇతర వ్యవస్థల్లో చొరబాట్లకూ నేనెన్నడూ ప్రయత్నించలేదు. నా దృక్కోణాన్ని, అభిప్రాయాలను కూడా పరిధులకు లోబడే వెల్లడించేందుకే శాయశక్తులా ప్రయతి్నంచా. ఈ వేదికపై ఇంతమాత్రం చెబితే చాలనుకుంటా. వివరించి చెప్పాల్సిన అవసరం లేదనే ఆశిస్తున్నా’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.మోదీకి ముందు మాట్లాడిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ ప్రభుత్వాల పనితీరుపై విమర్శలు గుప్పించారు. ‘‘తామే సర్వోన్నతులమనే భావనతో అవి అప్పుడప్పుడు అతి చేస్తున్నాయి. చట్టాలను వ్యక్తిగత, రాజకీయ అజెండాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి’’ అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపైనే పై విధంగా మోదీ స్పందించారని భావిస్తున్నారు.నడిపించే శక్తి రాజ్యాంగం: సీజేఐ‘‘ప్రభుత్వ వ్యవస్థలన్నీ తమకు దఖలుపడ్డ రాజ్యాంగపరమైన బాధ్యతలను గౌరవించాలి. వాటికి లోబడే నడుచుకోవాలి’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. ఎన్నికల ప్రక్రియ తాలూకు పర్యవసానాలతో న్యాయవ్యవస్థ ప్రభావితం కాకుండా ఉండేందుకు దానికి స్వతంత్ర ప్రతిపత్తి వంటి రక్షణలను రాజ్యాంగం కలి్పంచిందని గుర్తు చేశారు. అయితే, ‘‘ఏ వ్యవస్థా దానికదే స్వతంత్ర విభాగం కాదు. అవన్నీ పరస్పరం ఆధారితాలే. కనుక దేశ శ్రేయస్సే లక్ష్యంగా పరస్పర సమతుల్యతతో సమైక్యంగా సాగాలి’’ అని హితవు పలికారు.‘‘భారత్‌ను ప్రగతిశీల దేశంగా తీర్చిదిద్దడంలో రాజ్యాంగం అతి కీలక పాత్ర పోషించింది. ఫలితంగా దేశ విభజన, నిరక్షరాస్యత, పేదరికం తదితర పెను సవాళ్లను అధిగమించగలిగాం. అత్యంత చైతన్యవంతమైన ప్రజాస్వామ్యంగా, అంతర్జాతీయంగా బలమైన శక్తిగా భారత్ నిలిచింది. వీటన్నింటి వెనకాల అడుగడుగునా రాజ్యాంగపు వెన్నుదన్ను ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. -
‘ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు’
కర్నూలు జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో అంబేద్కర్ రాజ్యాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూట్లు పొడిచారని మండిపడ్డారు కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి,.కేవలం చంద్రబాబు తన రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే రాష్ట్రంలో అమలు చేస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిందని, ఇంటి వద్దకే సంక్షేమ పాలనతో పాటు సంక్షేమ పథకాలు అందించిన సంగతిని ఎస్వీ మోహన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ రోజు సంక్షేమ పథకాలు లేవు, రాజ్యాంగానికి విరుద్ధంగా పాలనను చంద్రబాబు సాగిస్తున్నారంటూ విమర్శించారు.‘సోషల్ మీడియా పోస్టులకు లైక్ కొట్టిన వారిపై నాన్ బెయిల్‌బెల్ కేసులు’ఏపీలో నిరంకుశ, దుర్మార్గ పాలన సాగుతోందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా తునిలో ఘనంగా 75వ భారత జ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో గత ఆరు నెలలుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా పాలన జరుగుతోంది. ప్రత్యర్థులను అణిచివేసే ధోరణి చాలా నిరంకుశంగా జరుగుతోంది. తునిలో 17 మందిపై అక్రమ కేసులు పెట్టారు. సోషల మీడియాలో పోస్ట్‌ను లైక్ చేసిన వారిపై నాన్ బెయిల్‌బెల్ కేసులు పెట్టారు. పసుపు చొక్కా లేసుకుని ఉద్యోగాలు చేయొద్దని పోలీసులను కోరుతున్నాను. గత పదేండ్ల కాలంలో వైఎస్సార్సీపీ ఒక పర్సంటేజ్సోషల్ మీడియా పోస్టులు పెడితే, టీడీపీ, జనసేన 99 శాతం అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారు. తునిలో మామ-అల్లుళ్ల పాలన కొనసాగుతోంది. అల్లుడు గల్లా పెట్టె దగ్గర కూర్చుంటే.. మామ యనమల అమాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. -
రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్
-
రాజ్యాంగ ఆమోద దినోత్సవం.. వైఎస్ జగన్ ట్వీట్
తాడేపల్లి: రాజ్యాంగానికి ఆమోదముద్ర పడ్డ చరిత్రాత్మక ఘట్టానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.‘మన రాజ్యాంగం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుంది. అలాంటి ప్రాముఖ్యత కల్గిన రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలి.ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్నది. వీటి పనితీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్ వైపు ఎందుకు వెళ్లకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాదు.. ఉన్నట్టుగా కూడా కనబడాలి. అందరి ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్ర్యం కొంతకాలంగా అణచివేయబడుతోంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సహా రాజ్యాంగాన్ని రూపొందించిన మన దార్శనిక నాయకులు సమానత్వం వైపు నడిపించారు’ అని వైఎస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. Our Sovereign, Socialist , Secular, Democratic Republic guarantees us Justice, Equality, Liberty, and Fraternity. As we celebrate the 75th Constitution Day, let us reflect on its significance and reaffirm our unwavering commitment to its guiding principles.The cornerstone of…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 26, 2024 -
రాజ్యాంగ వజ్రోత్సవాలు
న్యూఢిల్లీ: రాజ్యాంగానికి ఆమోదముద్ర పడ్డ చరిత్రాత్మక సందర్భానికి మంగళవారంతో 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. దాంతో మంగళవారం నుంచి ఏడాది పొడవునా రాజ్యాంగ దిన వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగ ప్రాశస్త్యానికి ప్రచారం కల్పించడం, దానిపట్ల పౌరుల్లో అవగాహనను మరింతగా పెంచడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు రూపొందించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో రాజ్యాంగ ప్రవేశిక సామూహిక పఠనం వంటివి జరగనున్నాయి. రాజ్యాంగ నిర్మాతల కృషిని పార్లమెంటు మరోసారి నెమరువేసుకోనుంది. వారికి ఘనంగా నివాళులు అర్పించనుంది. ఇందుకోసం ఉభయ సభలు మంగళవారం ప్రత్యేకంగా సమావేశం అవుతున్నాయి. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ తొలిసారి భేటీ అయిన పార్లమెంటు పాత భవనంలోని చారిత్రక సెంట్రల్ హాలే ఇందుకు వేదిక కానుండటం విశేషం. ఇందుకోసం సెంట్రల్ హాల్ సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తమ భావాలను పంచుకుంటారు. రాష్ట్రపతి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఉభయ సభల ఎంపీలంతా పాల్గొంటారు. రాజ్యాంగ దిన వజ్రోత్సవాలను పురస్కరించుకుని కాన్స్టిట్యూషన్75డాట్‌కామ్ పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా కేంద్రం రూపొందించింది. ఆ చరిత్రాత్మక దినాన... 1946 డిసెంబర్ 9న పార్లమెంటు పాత భవనం సెంట్రల్ హాల్లో రాజ్యాంగ పరిషత్ తొలి భేటీ జరిగిన క్షణాలను లోక్‌సభ భావోద్వేగపూరితంగా స్మరించుకుంది. ‘‘చెప్పదగ్గ స్వాతంత్య్ర సమరానికి సారథ్యం వహించిన మహామహులైన నేతలు ఆ రోజున ఇదే హాల్లో అర్ధచంద్రాకృతిలో వరుసలు తీరి ఆసీనులయ్యారు. ముందు వరుసలో జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, ఆచార్య జేబీ కృపాలనీ, అబుల్ కలాం ఆజాద్ తదితరులు కూర్చున్నారు. బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్ష స్థానాన్ని అలంకరించారు’’ అంటూ లోక్‌సభ వెబ్సైట్ నాటి స్మృతులను మరోసారి గుర్తు చేసుకుంది.మోదీ ప్రసంగించరు: రిజిజు ఉభయ సభల సంయుక్త భేటీలో ప్రధాని మోదీ ప్రసంగించబోరని రిజిజు స్పష్టం చేశారు. ఈ భేటీలో ఉభయ సభల విపక్ష నేతలకు కూడా ప్రసంగించే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు తెలిపారు. ‘‘రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్ మాత్రమే మాట్లాడతారు. విపక్ష నేతలిద్దరికీ వేదికపై స్థానముంటుంది. ఇదో చరిత్రాత్మక సందర్భం. దీన్ని వివాదాస్పదంగా మార్చే ప్రయత్నం చేయొద్దు’’ అని విపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. -
దేశమంతటా నేటి నుంచి రాజ్యాంగ వజ్రోత్సవాలు
స్వాతంత్య్ర దినోత్సవం అందరికీ తెలుసు. మరి రాజ్యాంగ దినోత్సవం అంటే ఏమిటి? గణతంత్ర దినం మనందరికీ తెలుసు కదా. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నాటినుంచీ భారత్ గణతంత్ర దేశంగా మారింది. అందుకే ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటున్నాం. ఆ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేడ్కర్ సారథ్యంలోని రచనా (డ్రాఫ్టింగ్) కమిటీ దాదాపు మూడేళ్ల పాటు అవిశ్రాంతంగా శ్రమించి రూపొందించింది. భారత రాజ్యాంగ పరిషత్ దాన్ని కూలంకషంగా పరిశీలించి 1949 నవంబర్ 26న ఆమోదించింది. అదే రాజ్యాంగ దినోత్సవం. గతంలో దీన్ని నేషనల్ లా డే గా జరుపుకునేవాళ్లం. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015లో నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటినుంచీ ఏటా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్)గా జరుపుకుంటున్నాం. పౌరుల్లో రాజ్యాంగ విలువల పట్ల అవగాహనను పెంచడంతో పాటు రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించేలా ఆ రోజున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. రాజ్యాంగాన్ని ఆమోదించిన చరిత్రాత్మక సందర్భానికి బుధవారంతో 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇదీ నేపథ్యం... భారత్‌కు స్వాతంత్య్రం రావడం ఖాయమని 1945 కల్లా తేలిపోయింది. దాంతో స్వతంత్ర భారతావనికి పాలనతో పాటు అన్ని అంశాల్లోనూ చుక్కానిలా దిశానిర్దేశం చేసే రాజ్యాంగం అవసరమైంది. దాని నిర్మాణం కోసం కేబినెట్ మిషన్ ప్లాన్‌లో భాగంగా 1946 డిసెంబర్లో 389 మంది ఉద్ధండులతో రాజ్యాంగ పరిషత్ (అసెంబ్లీ) ఏర్పాటైంది. దీనిలో సభ్యులుగా ఎవరుండాలో నిర్ణయించేందుకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. అలా రాజ్యాంగ రచనకు ఉద్దేశించిన సంస్థ పుట్టుకలోనే ప్రజాస్వామిక విలువలు దాగుండటం విశేషం! అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర ప్రముఖులు ఇందులో సభ్యులు. దేశ విభజన అనంతరం రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్యను 299కి కుదించారు. 1946 డిసెంబర్ 9న బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ తొలిసారిగా సమావేశమైంది. రాజ్యాంగ రచనకు డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి అంబేడ్కర్ చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలనూ కూలంకషంగా పరిశీలించిన మీదట మన రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ కమిటీ రూపమిచ్చింది. ఇందుకు రెండేళ్ల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ఆ వ్యవధిలో డ్రాఫ్టింగ్ కమిటీ 11సార్లు సమావేశమై ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ 395 ఆర్టికళ్లు, 8 షెడ్యూళ్లతో ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగానికి తుది రూపునిచ్చింది. డ్రాఫ్టింగ్ కమిటీ సమర్పించిన రాజ్యాంగ ప్రతిని అతి కొద్ది మార్పుచేర్పులతో రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26న ఆమోదించింది.రాజ్యాంగమంటే కేవలం రాత ప్రతి కాదు. ఒక జాతి జీవన విధానం. దేశమంతటికీ నిరంతర చైతన్యస్ఫూర్తి– బాబాసాహెబ్ అంబేడ్కర్– సాక్షి, నేషనల్ డెస్క్ -
దేశ ప్రజల గుండె చప్పుడు రాజ్యాంగం
భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26ను ‘రాజ్యాంగ దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. అయితే పాలన అందించే రాజకీయ పక్షాల్లో కొన్ని రాజ్యాంగ మూలాలూ, లక్ష్యాలనూ మరచి వ్యవహరించడమే బాధాకరం. టీ అమ్మిన సాధారణ పేద బాలుడు పెరిగి పెద్దవాడై ప్రధాని పదవిని పొందాడన్నా, ఒక భర్త చనిపోయిన స్త్రీ దేశ ప్రధాని అయ్యిందన్నా, అంటరానితనాన్ని ఎదుర్కొన్న జాతులు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నాయన్నా... ఒకటేమిటి ఈ దేశంలో అంతో ఇంతో మానవ విలువలూ, ప్రజా స్వామ్యం మనగలుగుతున్నాయంటే దానికి కారణం మన రాజ్యాంగమే. భారత రాజ్యాంగం ఒక విప్లవాత్మకమైన లిఖిత గ్రంథం. ప్రత్యామ్నాయ భావజాలంతో కూడిన దేశ అభివృద్ధికి సంబంధించిన పత్రం. దాన్ని రాయడానికి ఎందరు ఎన్ని విధాలుగా త్యాగం చేశారో మాటల్లో చెప్పడం కష్టమే. ముఖ్యంగా బాబా సాహెబ్ అంబేడ్కర్ పూర్తి సమయాన్ని, మేధస్సును రాజ్యాంగ రచనపై కేంద్రీకరించి తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టారు.395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు (ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు), 22 భాగాలతో ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా అవతరించింది మన రాజ్యాంగం. 11 సార్లు సమావేశమైన రాజ్యాంగ సభ 165 రోజుల పాటు సాగింది. 114 రోజులు ముసాయిదా రాజ్యాంగం గురించి చర్చ జరిగింది. 1946 డిసెంబర్ 9న మొట్టమొదటి సమావేశం జరిగితే 1947 ఆగస్టు 29న రాజ్యాంగ రచన సభ డ్రాఫ్టింగ్ కమిటీని ఎన్నుకుంది. 7,635 ఆర్టికల్స్ సవరణలను సభ ముందు ఉంచగా 2,473 సవరణలను ఆమోదించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ మన రాజ్యాగాన్ని ఆమోదించింది. మారుతున్న దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే వెసులుబాటు కల్పించడం విశేషం. ప్రస్తుతం సెప్టెంబర్ 2023 వరకు 106 సవరణలు జరిగాయి. అయితే రాజకీయపార్టీలు, నాయకుల పనితీరు రాజ్యాంగం ఆశించిన విధంగా కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉండటమే బాధాకరం. బహుళ జాతులూ, సంస్కృతులూ, మతాలూ, కులాలూ ఉన్న దేశంలో ‘ఒకే దేశం– ఒకే జాతి’ అనే ధోరణిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రాల హక్కులను కాలరాసి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తోంది. రైతు వ్యతిరేక చట్టాలు, పౌరహక్కులను కాలరాసే చట్టాలు, మైనారిటీ వ్యతిరేక చట్టాల రూప కల్పనకు పాటుపడుతూ రాజ్యాంగ మూల సూత్రా లకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనే విమర్శ ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది.భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న దన్నది వాస్తవం. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఇటీవలి ప్రజా స్వామ్యవాదుల ప్రధాన ఆందోళన. నిజంగా అదే జరిగితే దేశం సౌభ్రాతృత్వం కోల్పోయి... స్వాతంత్య్రం ప్రమాదంలో పడుతుంది. ‘నేను ఎంతో కష్టపడి సాధించిన ఈ హక్కుల గిడారును చేతనైతే ముందుకు తీసుకుని వెళ్ళండి లేదా అక్కడే వదిలి వేయండి.అంతేకానీ వెనక్కి మాత్రం లాగవద్దు’ అన్న బాబా సాహెబ్ మాటలు గుర్తెరిగి ప్రతి భారతీయుడూ బాధ్యత గల పౌరునిగా రాజ్యాంగాన్ని యథాతథంగా అంగీకరించాలి. తదనుగుణంగా వ్యవహరించాలి. భారతదేశం ఊపిరి, గౌరవం, ఉనికి రాజ్యాంగంలో నిక్షిప్తమై... దేశ ప్రజల గుండె చప్పుడై ఉంది. కావున యావత్ భారత ప్రజల పవిత్ర గ్రంథమైన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడమే ప్రాథమిక బాధ్య తగా ఉండాలి.– డా‘‘ బోరుగడ్డ సుబ్బయ్య; అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ ‘ 94927 04401(నేడు 75వ రాజ్యాంగ దినోత్సవం) -
నేటి నుంచే పార్లమెంట్ సమరం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు జరిగే ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో అత్యంత ముఖ్యమైన వక్ఫ్ సవరణ బిల్లును జాబితాలో చేర్చారు. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును మాత్రం పక్కనపెట్టారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగనున్న శీతాకాల సమావేశాలకు అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ఈసారి సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పార్లమెంట్లో సమావేశాల్లో ముందుగా ఇటీవల మరణించిన ఎంపీలకు సంతాపం తెలియజేశారు. తర్వాత కార్యకలాపాలు మొదలవుతాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై జగదాంబికా పాల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను ఈవారం సమావేశాల చివరి రోజున పార్లమెంట్‌కు సమర్పించాల్సి ఉంది. దానిని పార్లమెంట్ పరిగణనలోకి తీసుకుని ఆమోదించే అవకాశాలున్నాయి. 26న పాత పార్లమెంట్ భవనంలోప్రత్యేక కార్యక్రమం భారతæ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 26న పార్లమెంట్ ఉభయ సభలు కొనసాగవు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత పార్లమెంట్ భవనం సంవిధాన్ సదన్‌లోని చారిత్రక సెంట్రల్ హాల్లో ఉభయ సభల ఎంపీలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ «ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు హాజరవుతారు. ఈ సందర్భంగా స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌తోపాటు సంస్కృతం, మైథిలీ బాషలతో కూడిన భారత రాజ్యాంగ ప్రతులను విడుదల చేస్తారు. ‘అదానీ, మణిపూర్’పై చర్చించాలి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డాతోపాటు 30 పారీ్టల నేతలు పాల్గొన్నారు. అదానీపై గ్రూప్‌పై ఆరోపణలు, మణిపూర్ సంక్షోభం, వాయుకాలుష్యం, రైలు ప్రమాదాలపై విస్తృతంగా చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భేటీ అనంతరం రిజిజు మీడియాతో మాట్లాడారు. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉభయ సభలు సజావుగా సాగేందుకు విపక్షాలన్నీ సహకరించాలని కోరారు. -
కోర్టులను ఆశ్రయించడానికి సంకోచం వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు గత ఏడు దశాబ్దాలుగా ప్రజా న్యాయస్థానంగా వ్యవహరిస్తోందని భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. ఎంతో విశ్వాసంతో వచి్చన వేలాది మంది పౌరులు సుప్రీంకోర్టు ద్వారా న్యాయం పొందారని పేర్కొన్నారు. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించడానికి భయపడాల్సిన పని లేదని ప్రజలకు సూచించారు. నిస్సంకోచంగా కోర్టులకు రావొచ్చని చెప్పారు. ఆదివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో సీజేఐ మాట్లాడారు. వ్యవస్థీకృత ప్రజాస్వామ్య సంస్థలు, ప్రక్రియల ద్వారా రాజకీయ విభేదాలను పరిష్కరించుకోవడానికి రాజ్యాంగం మనకు వీలు కల్పిస్తుందని వివరించారు. ఎన్నో రకాల సమస్యల పరిష్కారానికి న్యాయస్థానాల వ్యవస్థ ఉపయోగపడుతుందని వెల్లడించారు. దేశంలోని ప్రతి కోర్టులో ప్రతి కేసు రాజ్యాంగబద్ధమైన పాలనకు పొడిగింపేనని అన్నారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నామని ఉద్ఘాటింటారు. కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు సైతం ప్రారంభించామని తెలిపారు. దేశ పౌరుల ఆకాంక్షలను నెరవేర్చడానికి తమ వంతు కృషి చేస్తున్నామని సీజేఐ స్పష్టం చేశారు. న్యాయం పొందడానికి కోర్టులను చివరి మజిలీగా భావించాలన్నారు. 2023 నవంబర్ 25 నాటికి సుప్రీంకోర్టు 36,068 తీర్పులను ఆంగ్ల భాషలో వెలువరించిందని చెప్పారు. ఈ తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువాదించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని సవరించుకొనే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే సామర్థ్యం రాజ్యాంగానికి ఉందని తెలియజేశారు. ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసు ఏర్పాటు చేయాలి: రాష్ట్రపతి నైపుణ్యం కలిగిన యువతను న్యాయ వ్యవస్థలోకి తీసుకురావడానికి, వారి ప్రతిభకు సాన పెట్టడానికి అఖిల భారత జ్యుడీషియల్ సరీ్వసు ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ముర్ము సూచించారు. ఆదివారం సుప్రీంకోర్టులో రాజ్యాంగ దినోత్సవంలో ఆమె ప్రసంగించారు. న్యాయం పొందే విషయంలో పౌరులకు ఖర్చు, భాష అనే అవరోధాలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇలాంటి పరిమితులను తొలగించాలన్నారు. న్యాయాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని, ప్రజలే కేంద్రంగా న్యాయ వ్వవస్థను తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. యువత న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించడానికి మరిన్ని అవకాశాలివ్వాలన్నారు. పార్లమెంట్ అభేద్యమైనది: ఉపరాష్ట్రపతి ప్రజాస్వామ్యానికి ఆత్మ పార్లమెంట్ అని ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్ చెప్పారు. ఆదివారం ఢిల్లీలో రాజ్యాంగ దినోత్సవంలో మాట్లాడారు. పార్లమెంట్ ఔన్నత్యాన్ని కార్యనిర్వాహక వ్యవస్థ గానీ, న్యాయ వ్యవస్థ గానీ తగ్గించలేవని పేర్కొన్నారు. పార్లమెంట్ అభేద్యమైనదని స్పష్టం చేశారు. పార్లమెంట్ అధికారాల్లో జోక్యం రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, న్యాయవాదులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. ఏడడుగుల ఈ అంబేడ్కర్ విగ్రహాన్ని శిల్పి నరేష్ కుమావత్ రూపొందించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదివారం సుప్రీంకోర్టు ఆవరణలో మొక్కలు నాటుతున్న రాష్ట్రపతి ముర్ము, సీజేఐ జస్టిస్ చంద్రచూడ్. చిత్రంలో కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ -
సుప్రీం కోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
ఢిల్లీ: సుప్రీం కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్నిరాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహాన్ని సుప్రీంకోర్టులో ఏర్పాటు చేయాలన్న అంబేద్కర్ మూమెంట్‌కు చెందిన కొందరు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు సీజేఐ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఆర్గూయింగ్ కౌన్సిల్ అసోషియేషన్(ఎస్‌సీఏసీఏ) కూడా సుప్రీం కోర్టులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని సీజేఐకి విజ్ఞప్తి చేసింది. 1949 నవంబర్ 26న కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ తీర్మానం చేసింది. అనంతరం రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీ రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇదీచదవండి..దేశంలోని పలు రాష్ట్రాలకు వర్షసూచన -
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?
నేడు దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతియేటా రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26 న జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ అధికారికంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగ విలువల పట్ల పౌరులలో గౌరవ భావాన్ని పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం అనేది ప్రారంభమైంది. సామాజిక న్యాయం, సాధికారతను గుర్తుచేసుకుంటూ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం పిలుపునిచ్చింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి మొత్తం రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. రాజ్యాంగ రచన 1949 నవంబర్ 26న పూర్తయింది. మన దేశ రాజ్యాంగం మొత్తం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అనేక దేశాల నియమాలను చేర్చారు. అమెరికా, ఐర్లాండ్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల రాజ్యాంగాల సహాయం తీసుకున్నారు. ఈ దేశాల రాజ్యాంగాల నుండి, పౌరుల విధులు, ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ పాత్ర, ఎన్నికల ప్రక్రియ వంటి ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: దేశంలోని పలు రాష్ట్రాలకు వర్షసూచన -
కర్ణాటకలో ఘనంగా రాజ్యాంగ పీఠిక పఠనం
బెంగళూరు: అంతర్జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను చదివే కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి ఏకకాలంలో లక్షలాది మంది పాల్గొన్నారు. బెంగళూరు విధానసౌధ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తోపాటు ఇతర అతిథులు రాజ్యాంగ పీఠికను కన్నడ భాషలో స్వయంగా పఠించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో నిత్యం ఉదయం ప్రార్థన సమయంలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరిగా చదవాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జూన్‌లో ఉత్వర్వులు జారీ చేసింది. -
First Constitution Day: తొలి రాజ్యాంగ దినోత్సవ అరుదైన ఫొటోలు
-
Constitution Day: ప్రజల చెంతకు కోర్టులు: సీజేఐ
వ్యాజ్యప్రక్రియను మరింత సులభతరం చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం చాలా ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘‘అపార వైవిధ్యానికి నిలయమైన భారత్ వంటి అతి పెద్ద దేశంలో న్యాయమందించే వ్యవస్థ ప్రతి పౌరునికీ అందుబాటులో ఉండేలా చూడటమే అతి పెద్ద సవాలు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టడంతో పాటు అధునాతన టెక్నాలజీని మరింతగా వాడుకోవాలి. న్యాయం కోసం ప్రజలు కోర్టు మెట్లెక్కడం కాదు, కోర్టులే వారి చెంతకు చేరే రోజు రావాలి. ఈ దిశగా టెక్నాలజీని న్యాయవ్యవస్థ మరింతగా అందిపుచ్చుకుంటోంది. తద్వారా పనితీరును మరింతగా మెరుగు పరుచుకునేలా కోర్టులను తీర్చిదిద్దుతున్నాం’’ అని వివరించారు. ప్రధాని ప్రారంభించిన ఇ–సైట్లే అందుకు నిదర్శనమన్నారు. ‘‘ఉదాహరణకు నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్‌లోని సమాచారం వర్చువల్ జస్టిస్ క్లాక్ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. జస్ట్‌ఈజ్ మొబైల్ యాప్ 2.0 ద్వారా జిల్లా జడ్జిలు తమ కోర్టుల్లో పెండింగ్ కేసులు తదితరాలన్నింటినీ నిరంతరం మొబైల్లో పర్యవేక్షించగలరు’’ అని చెప్పారు. హైబ్రిడ్ విధానం ద్వారా సుప్రీంకోర్టు విచారణలో లాయర్లు దేశంలో ఎక్కడినుంచైనా పాల్గొంటున్నారని గుర్తు చేశారు. జడ్జిలపై గురుతర బాధ్యత ప్రజలందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వాలు అందేలా చూడాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత జిల్లా జడ్జి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాకా అందరిపైనా ఉందని సీజేఐ అన్నారు. ‘‘ఇది జరగాలంటే న్యాయమూర్తులమంతా మన పనితీరును, మనలో పాతుకుపోయిన దురభిప్రాయాలు, తప్పుడు భావజాలాలను ఎప్పటికప్పుడు ఆత్మశోధన చేసుకుంటుండాలి. భిన్న నేపథ్యాల వ్యక్తుల జీవితానుభవాలకు సంబంధించిన భిన్న దృక్కోణాలను అర్థం చేసుకోనిదే మన పాత్రను సమర్థంగా నిర్వహించలేం’’ అన్నారు. జిల్లా న్యాయ వ్యవస్థది కీలకపాత్ర న్యాయం కోసం ప్రజలు తొలుత ఆశ్రయించేది జిల్లా న్యాయవ్యవస్థనేనని సీజేఐ గుర్తు చేశారు. ‘‘అందుకే ఆ వ్యవస్థను బలోపేతం చేయడం, అవసరమైన అన్నిరకాల సాయమూ అందించడం అత్యవసరం. ఉన్నత న్యాయవ్యవస్థకు మితిమీరిన విధేయత చూపే భావజాలం నుంచి జిల్లా న్యాయవ్యవస్థను బయటికి తేవడం చాలా అవసరం’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘భిన్న రంగాల వ్యక్తుల తాలూకు అనుభవాన్ని ఒడిసిపట్టి న్యాయవ్యవస్థలో భాగంగా మార్చడం చాలా ముఖ్యం. ఇందుకోసం న్యాయ వృత్తిలో అణగారిన వర్గాలు, మహిళల ప్రాతినిధ్యం మరింత పెరిగేలా చూడటం చాలా అవసరం’’ అని సూచించారు. -
Constitution Day: ప్రాథమిక విధులే ప్రాథమ్యం
న్యూఢిల్లీ: ప్రాథమిక విధుల నిర్వహణే పౌరుల ప్రథమ ప్రాథమ్యంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అప్పుడే దేశం ఉన్నత శిఖరాలకు చేరుతుందన్నారు. వాటిని పూర్తి అంకితభావంతో, చిత్తశుద్ధితో పాటించాలని పిలుపునిచ్చారు. నాడు గాంధీ మహాత్ముడు కూడా ఈ మేరకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం సుప్రీంకోర్టులో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్న భారత్‌వైపే ప్రపంచమంతా చూస్తోందన్నారు. వచ్చే ఏడాది జీ 20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనుండటాన్ని ప్రపంచ శ్రేయస్సులో మన పాత్రను అందరి ముందుంచేందుకు అతి గొప్ప అవకాశంగా అభివర్ణించారు. ‘‘ప్రపంచం దృష్టిలో దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు మనమంతా కలసికట్టుగా కృషి చేయాలి. ఇది మనందరి బాధ్యత. కేంద్రం అనుసరిస్తున్న ప్రజానుకూల విధానాలు పేదలను, మహిళలను సాధికారత దిశగా నడుపుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రాచీనకాలం నుంచి వస్తున్న విలువలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యానికి మాతృకగా భారత్ అలరారుతోంది. ఈ గుర్తింపును మరింత బలోపేతం చేయాలి’’ అని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రానంతరపు కాలంలో జాతి సాంస్కృతిక, నైతిక భావోద్వేగాలన్నింటినీ మన రాజ్యాంగం అద్భుతంగా అందిపుచ్చుకుందని కొనియాడారు. స్వతంత్ర దేశంగా భారత్ ఎలా మనుగడ సాగిస్తుందోనన్న తొలినాటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ భిన్నత్వమే అతి గొప్ప సంపదగా అద్భుత ప్రగతి సాధిస్తూ సాగుతోందన్నారు. ‘‘వందేళ్ల స్వతంత్ర ప్రస్థానం దిశగా భారత్ వడివడిగా సాగుతోంది. ఇప్పటిదాకా నడిచింది అమృత కాలమైతే రాబోయే పాతికేళ్లను కర్తవ్య కాలంగా నిర్దేశించుకుందాం. ప్రాథమిక విధులను పరిపూర్ణంగా పాటిద్దాం. రాజ్యాంగంతో పాటు అన్ని వ్యవస్థల భవిష్యత్తూ దేశ యువతపైనే ఆధారపడి ఉంది. రాజ్యాంగంపై వారిలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరముంది. అప్పుడే సమానత్వం, సాధికారత వంటి ఉన్నత లక్ష్యాలను వారు మరింతగా అర్థం చేసుకుని ఆచరిస్తారు’’ అని చెప్పారు. రాజ్యాంగ పరిషత్తులో మహిళా సభ్యుల పాత్రకు తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘అందులో 15 మంది మహిళలుండేవారు. వారిలో ఒకరైన దాక్షాయణీ వేలాయుధన్ అణగారిన వర్గాల నుంచి వచ్చిన మహిళామణి’’ అని గుర్తు చేశారు. దళితులు, కార్మికులకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలు రాజ్యాంగంలో చోటుచేసుకునేలా ఆమె కృషి చేశారన్నారు. 26/11 మృతులకు నివాళి 2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్ర దాడికి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వాటిలో అసువులు బాసిన వారిని మోదీ గుర్తు చేసుకున్నారు. వారికి ఘనంగా నివాళులర్పించారు. ఇ–కోర్టు ప్రాజెక్టులో భాగంగా తీసుకొచ్చిన వర్చువల్ జస్టిస్ క్లాక్, జస్ట్‌ఈజ్ మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్ట్, ఎస్3వాస్ వంటి సైట్లు తదితరాలను ప్రారంభించారు. వీటిద్వారా కక్షిదారులు, లాయర్లు, న్యాయవ్యవస్థతో సంబంధమున్న వారికి టెక్నాలజీ ఆధారిత సేవలందించేందుకు వీలు కలగనుంది. వేడుకల్లో కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాయుధం రాజ్యాంగం
అధికార దుర్వినియోగం జరిగినప్పుడు, ప్రభుత్వాల ఇనుప పాదాల కింద నలిగిపోయే వారి రక్షణకు దైవమిచ్చిన ప్రజా ఆయుధం మన రాజ్యాంగమే. నిరుపేదలు, అణగారిన వర్గాలు, నిస్సహాయులకు ఇది రక్షణగా ఉంది. రాజ్యాంగంలోని మహోన్నత ఆశయాలకు ప్రతిరూపమైన, ఆకాశమంతటి మహా మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్‌కు అంజలి ఘటిస్తూ 2023 ఏప్రిల్‌లో విజయవాడలో మహా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నాం. అంబేద్కర్ భావజాలాన్ని, మన రాజ్యాంగ స్ఫూర్తిని మనసా, వాచా, కర్మణా గౌరవించే ప్రభుత్వంగా ఈ మూడున్నరేళ్ల పాలనలో ముందడుగు వేశాం. రాజధాని కోసం సేకరించిన భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని వాదించిన దుర్మార్గం భారతదేశంలో మొలకెత్తుతుందని బహుశా రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజు ఊహించి ఉండకపోవచ్చు. ఇలాంటి వాదాలు, వాదనలతో కూడా మనం యుద్ధం చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్నింటా పెద్ద పీట వేస్తున్నాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విభిన్న వర్గాలకు చెందిన భారతీయులను ఒక్కటిగా ఉంచే గొప్ప గ్రంథం భారత రాజ్యాంగమని, నిస్సహాయులకు దైవమిచ్చిన ప్రజాయుధం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని నూరు శాతం పాటించి అమలు చేస్తున్నది మన ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో కలిసి పాల్గొన్న సీఎం జగన్.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ చిత్ర పటానికి నివాళులు అర్పించి, రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. అనంతరం మాట్లాడుతూ.. మన రాజ్యాంగం ఎంతో గొప్పదన్నారు. 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 3 వేల కులాలు, ఉప కులాలతో కలిపి 25 వేల కులాలు, ఏడు ప్రధాన మతాలు, 121 భాషలు, యాసలతో కలిపి 19,500 భాషలు మాట్లాడే మన దేశానికి వేర్వేరు చరిత్రలు, భిన్న భౌగోళిక స్వభావాలున్నాయని చెప్పారు. మన రాజ్యాంగం.. ప్రభుత్వాలకు, దేశంలోని 140 కోట్లకు పైగా ఉన్న ప్రజలకు క్రమశిక్షణ నేర్పే రూల్బుక్గా కొనసాగుతోందన్నారు. మనకు దిశానిర్దేశం చేసే గైడ్, ఫిలాసఫర్, టీచర్‌గా దారి చూపుతోందని వివరించారు. దాదాపు 80 దేశాల రాజ్యాంగాల అధ్యయనం తర్వాత తయారైన ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వాల మాగ్నాకార్టా మన రాజ్యాంగమని తెలిపారు. ప్రపంచ మానవ చరిత్రలో, ప్రజాస్వామ్య చరిత్రలో, సమానత్వ చరిత్రలో, సామ్యవాద చరిత్రలో, సంఘ సంస్కరణల చరిత్రలో అత్యంత గొప్పదైన ఒక చారిత్రక గ్రంథం అని అభివర్ణించారు. దీనిని 1949 నవంబర్ 26న మన కోసం మనం సమర్పించుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 72 ఏళ్లుగా మన సంఘ సంస్కర్త ► పుస్తకం ముట్టుకోవడానికి వీలులేని సమాజంలో జన్మించి, ఎన్నో డిగ్రీలు, విదేశీ డిగ్రీలు సైతం సంపాదించుకుని.. ఈ దేశం మారడానికి, నిలబడడానికి, ప్రపంచంతో సైతం పోటీ పడేందుకు, ప్రగతిపథంలో పరుగెత్తడానికి కావాల్సిన ఆలోచనలతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇంత గొప్పదైన రాజ్యాంగాన్ని రచించారు. ► 72 ఏళ్లుగా మన సామాజిక వర్గాల చరిత్రను తిరగరాసింది.. రాస్తూనే ఉంది. ఈ పుస్తకం మన ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, మహిళా చరిత్ర గతిని మార్చింది.. మారుస్తూనే ఉంటుంది. మన భావాలను, భావజాలాల్ని మార్చింది.. మారుస్తూనే ఉంటుంది. 72 ఏళ్లుగా మన రాజ్యాంగమే మన సంఘ సంస్కర్త. మన మధ్య ఎన్ని భిన్నత్వాలు ఉన్నా, ఈ వజ్రోత్సవ దేశ స్వాతంత్య్రాన్ని నిలబెట్టింది. ఇక మీదట కూడా నిలబెడుతూనే ఉంటుంది. గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన ► రాజ్యాంగంలో చెప్పిన గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన చేసి, దేశంలోనే తొలిసారిగా గ్రామ సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థను అమలు చేస్తున్న ప్రభుత్వం బహుశా మనదే. ప్రభుత్వ బడుల్లో పేదలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకునే అవకాశం కల్పించాం. ► ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల పట్ల పాటిస్తున్న నయా అంటరానితనం మీద సీబీఎస్ఈ ఇంగ్లిష్ మీడియంతో మొదలు, బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్, డిజిటల్ క్లాస్‌రూముల వరకు విద్యా రంగంలో సంస్కరణల ద్వారా దండయాత్ర చేస్తున్న ప్రభుత్వం మనది. ► నామినేటెడ్ పదవులు, పనులలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి, అమలు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి ప్రభుత్వం కూడా మనదే. మహిళా సాధికారతకు నిజమైన అర్థం ► జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, అక్కచెల్లెమ్మల పేరిట 30 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, 21 లక్షల ఇళ్ల నిర్మాణం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ తదితర అనేక విధాలుగా ముందడుగులు వేసిన మహిళా ప్రభుత్వం కూడా మనదే. ► వాహనమిత్ర, రైతు భరోసా, పెన్షన్ కానుక, ఆసరా, సున్నా వడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, విద్యా దీవెన, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, విద్యా కానుక, గోరుముద్ద, బడులలోనూ, ఆస్పత్రుల్లోనూ నాడు–నేడు.. పథకాలు అమలుచేస్తున్నాం. తద్వారా పేదలు పేదరికం నుంచి బయట పడేందుకు చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నం చేస్తున్నాం. కార్పొరేషన్ల చైర్మన్లుగానూ వారే అధికం ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 58% పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. బీసీలకు 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు, ఎస్టీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్నూ నియమించాం. ఈ 35 నెలల్లో సామాజిక న్యాయంలో మనందరి ప్రభుత్వం మనసుపెట్టి తీసుకువచ్చిన మార్పులివి. రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా పాటిస్తున్న ప్రభుత్వం మనది. ► మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, తానేటి వనిత, సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ కె.సురేష్‌రెడ్డి, జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్ బి.శ్యాంసుందర్, జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ డి.వెంకటరమణ, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామ్మూర్తి, కమిషన్ సభ్యులు దండే సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం: గవర్నర్ సమాజంలో సామరస్యతను నెలకొల్పేందుకు రాజ్యాంగ నిర్మాతల కృషిని ప్రజలు ఎప్పటికీ మరువలేరని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. వేదకాలం నుంచి ప్రజాస్వామ్య భావన ప్రబలంగా ఉందని చాటిచెప్పేందుకు ఈ ఏడాది రాజ్యాంగ దినోత్సవాన్ని ‘భారత్: ప్రజాస్వామ్యానికి తల్లి’ అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేద కాలం నుంచి భారతీయులు సమానత్వ స్ఫూర్తితో ఉంటున్నారని, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటూ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విజయవంతమైన ప్రజాస్వామ్య దేశంగా ఉందన్నారు. ధర్మం, నైతికత, వేదాల నుంచి ఉద్భవించిన మన దేశం భారతీయ సమాజానికి గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదించిందని చెప్పారు. పౌరుల హక్కులను పరిరక్షించడం ద్వారా రాజ్యాంగం వారికి అధికారం ఇస్తోందని, పౌరులు తమ విధులకు కట్టుబడి రాజ్యాంగానికి సాధికారత కల్పించారన్నారు. ఎమర్జెన్సీ కాలం నాటి చీకటి రోజుల్లోనూ రాజ్యాంగం ప్రజల ప్రాథమిక హక్కులు, వాక్ స్వాతంత్య్ర హక్కును కాపాడిందని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రపంచ వేదికపై భారతదేశం శక్తివంతమైన క్రియాశీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇది యుద్ధాల యుగం కాదని కౌన్సెలింగ్ ద్వారా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ప్రధాని చొరవ చూపించారన్నారు. మన పాలనలో రూ.3,18,037 కోట్ల పంపిణీ ► మన 35 నెలల పాలనలో డీబీటీ ద్వారా అంటే నేరుగా బటన్ నొక్కి, ప్రజల బ్యాంక్ అకౌంట్లలోకి వెళ్లే గొప్ప వ్యవస్థను తీసుకువచ్చాం. లంచాలకు, వివక్షకు తావు లేకుండా నేరుగా ప్రజలకు అందించిన మొత్తం ఇప్పటి వరకు రూ.1,76,517 కోట్లు. గత 35 నెలల్లో డీబీటీ, నాన్ డీబీటీల ద్వారా రూ.3,18,037 కోట్లు అందించాం. ► ఇందులో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీ వర్గాలకు అందినది 79 శాతం. సామాజిక న్యాయానికి ఎంతగా కట్టుబడి ఉన్నామో ఈ అంకెలే సాక్ష్యం. నా మంత్రివర్గ సహచరులనే తీసుకుంటే మొత్తం మంత్రిమండలిలో దాదాపు 70 శాతం ఈ సామాజిక వర్గాలవారే. రెండు మంత్రివర్గాలలోనూ ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులిస్తే అందులో నలుగురు.. అంటే 80 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించాం. ► శాసనసభ స్పీకర్‌గా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని, శాసనమండలి చైర్మన్‌గా ఒక ఎస్సీని నియమించాం. శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన నా అక్కను ఆ స్థానంలో కూర్చోబెట్టాం. సామాజిక న్యాయ చరిత్రలో ఇదొక సరికొత్త అధ్యాయం. ► ఈ మూడేళ్లలో రాజ్యసభకు 8 మందిని పంపితే అందులో నలుగురు బీసీలే. శాసన మండలికి అధికార పార్టీ నుంచి 32 మందిని పంపిస్తే అందులో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో 9 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కేటాయించిన ప్రభుత్వం మనది. మున్సిపల్ కార్పొరేషన్లలో 86 శాతం, మున్సిపాల్టీలలో 69 శాతం, మండల ప్రజా పరిషత్ చైర్మన్లలో 67 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకే కేటాయించాం. -
అంబేద్కర్ స్పూర్తిని అందరం కొనసాగించాలి: బిశ్వభూషణ్ హరిచందన్
-
రాజ్యాంగం అణగారిక వర్గాలకు అండగా నిలిచింది: సీఎం జగన్
-
విజయవాడలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి వైఎస్సార్సీపీ నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, జూపూడి ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. చదవండి: Special Trains: శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. -
ఢిల్లీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
-
క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి గవర్నర్, సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన రాజ్యాంగం రూపొందించారన్నారు. ‘‘భారత రాజ్యాంగం ఎంతో గొప్పది. అందరికీ క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం. అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. అనేక కులాలు, మతాలతో మిళితమైనది మన దేశం. 72 ఏళ్లుగా ఈ రాజ్యాంగం సామాజిక వర్గాల చరిత్రను తిరగరాసింది’’ అని సీఎం జగన్ అన్నారు. ‘‘రాజ్యాంగం అణగారిన వర్గాలకు అండగా నిలిచింది. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌కు అంజలి ఘటిస్తున్నాం. 2023 ఏప్రిలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం. గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన చేసిన ప్రభుత్వం మనది. గ్రామ సచివాలయ వ్యవస్థతో మార్పులు తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఏపీ. నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనార్టీలకు 50 శాతం ఇస్తున్న ప్రభుత్వం మనదే. అక్కాచెల్లెమ్మల పేర్లతోనే ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. అభివృద్ధి, అనేక సంక్షేమ పథకాలతో తారతమ్యాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. మంత్రి మండలిలో 70 శాతం బీసీలు, ఎస్సీలు,ఎస్టీలు, మైనార్టీలే. స్పీకర్‌గా బీసీని, మండలి ఛైర్మన్‌గా ఎస్సీని, మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మైనారిటీ వ్యక్తిని నియమించాం’’ అని సీఎం అన్నారు. చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Constitution Day: ఏ రాజ్యాంగమూ పరిపూర్ణం కాదు
న్యూఢిల్లీ: రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థలో కొలీజియంతో సహా ఏ రాజ్యాంగమూ పరిపూర్ణం, లోపరహితం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రస్తుత ఉన్న వ్యవస్థ నుంచే కనిపెట్టాలని తెలిపారు. రాజ్యాంగానికి లోబడి పని చేయాలన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగాన్ని అమలుపర్చే న్యాయమూర్తులను విశ్వసనీయమైన సైనికులుగా అభివర్ణించారు. ప్రజాసేవ పట్ల అంకితభావం, అనురక్తి ఉన్నవాళ్లు న్యాయ వ్యవస్థలో చేరాలని సీజేఐ సూచించారు. న్యాయవాద వృత్తిలో వలస పాలన కాలం నాటి ఆచారాలను వదిలించుకోవాల్సిన అసవరం ఉందని అభిప్రాయపడ్డారు. లాయర్లకు కఠినంగా అమల్లో ఉన్న డ్రెస్ కోడ్‌ను పునఃపరిశీలించాలన్నారు. మన జీవన విధానం, మన వాతావరణానికి తగ్గట్టుగా డ్రెస్ కోడ్ ఉండాలని సూచించారు. -
Constitution: పౌరులకు పట్టం కట్టిన పత్రం
నేడు భారత రాజ్యాంగ దినోత్సవం. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మన రాజ్యాంగం సంపూర్ణ ఆమోదం పొందింది. అందువల్లనే ఏడు దశాబ్దాల తర్వాత కూడా అది ఒక పవిత్రమైన డాక్యుమెంటులా నిలిచి ఉంది. రాజ్యాంగాన్ని ఎంత చక్కగా, వివరంగా రాసుకున్నప్పటికీ... సంస్థలు, ప్రజలతో అది సంకేతాత్మక బంధాన్ని నెలకొల్పుకోవడంలో విఫలమైతే అలాంటి రాజ్యాంగానికి అర్థమే లేదని మన రాజ్యాంగ నిర్మాతలు చక్కగా గుర్తించారు. అందుకే తరం తర్వాత తరంలో రాజ్యాంగానికి ఆమోదనీయత పెరుగుతూనే వస్తోంది. అలాగే భారత రాజ్యాంగంతో మనసా వాచా అవిచ్ఛిన్న బంధాన్ని నెలకొల్పుకున్న దేశ సామాన్య పౌరుడికి కూడా మనం సెల్యూట్ చేయాల్సిన సమయమిది. వలస పాలనలో దాదాపు 200 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మగ్గిన తర్వాత భారత దేశం 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వతంత్రదేశంగా మారింది. జాతి ఎంతో కష్టపడి సాధించిన ఈ స్వాతంత్య్రం, దీర్ఘకాలం కొనసాగిన పోరాట ఫలితమే. తమ ప్రాణాలను అర్పించిన లేదా తీవ్రమైన నిర్బంధాన్ని చవిచూసిన వేలాదిమంది మన దేశవాసులతో పాటు ఈ పురాతనమైన, ఘనమైన గడ్డమీది సాధారణ పౌరులు కూడా కన్న కలల ఫలితమే ఈ స్వాతంత్య్రం. వలస పాలనకు పూర్వ సహస్రాబ్దంలో అంతర్జాతీయ ఆర్థిక, సాంస్కృతిక శక్తి కేంద్రంగా భారతదేశం గుర్తింపు పొందుతూ వచ్చింది. కానీ, స్వాతంత్య్రం పొందిన నాటికి దారిద్య్ర భారతాన్ని వారసత్వంగా పొందాము. దీంతో భారత నవయువ రిపబ్లిక్‌తో దీర్ఘకాల ప్రయోగంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకించి నిరక్షరాస్యత అలుముకున్న, దారిద్య్రం పేరుకున్న, ఆధునిక ప్రజాతంత్ర వ్యవస్థలు, సంస్థలు లేని మన జాతికి సార్వత్రిక వయోజన హక్కును కల్పించే విషయంలో, ప్రజాస్వామిక ఆదర్శ పాలనను చేపట్టడానికి సంబంధించిన ఆకాంక్షను వ్యక్తపరిచే విషయంలో పలు సందేహాలు అలుముకున్నాయి. అయితే రెండు వేల సంవత్సరాల క్రమంలో ఏర్పడుతూ వచ్చిన మన ప్రజాస్వామిక విలువలను లోతుగా అర్థం చేసుకున్న రాజ్యాంగ నిర్మాతలు... విధ్వంసం తప్పదని జోస్యం చెబుతున్న సంశయ వాదులను చూసి భయపడకుండా గట్టిగా నిలబడ్డారు. రాజ్యాంగ సభ సభ్యులు, మన గ్రామ గణతంత్రాలలో రూపు దిద్దుకుని ఉన్న సాంప్రదాయిక భాగస్వామ్య పాలనా రూపాలను లోతుగా అర్థం చేసుకున్నారు. అయితే అన్నిటికంటే మించి మన రాజ్యాంగ రూపకర్తలకు మార్గనిర్దేశం చేసిన ముఖ్యమైన విషయాన్ని చెప్పుకొని తీరాలి. సగటు భారతీయ పౌరుల ప్రజాస్వామిక సున్నితత్వంపై వారు సంపూర్ణ విశ్వాసం ఉంచారు. ఇది లేకుంటే భారత్ తనను తాను ఒక ప్రజాస్వామ్య మాతగా న్యాయబద్ధంగానే ప్రకటించుకోలేకపోయేది. ఆధునిక చరిత్రలో ‘అమృత్ కాల్’లోకి జాతి ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసేలా మన మార్గాన్ని ప్రకాశవంతం చేసేందుకు మన రాజ్యాంగ పునాదిని రూపొందించిన ఆదర్శాలు, మూల సూత్రాలు నేటికీ బలంగా కొనసాగుతున్నాయి. డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించిన రాజ్యాంగ సభ, బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ అధ్యక్షత వహించిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చేసిన నిర్విరామ ప్రయత్నాల వల్లే భారత రాజ్యాంగం మనకు వరప్రసాదమైంది. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన మన రాజ్యాంగం సంపూర్ణ ఆమోదం పొందింది. అందువల్లనే ఏడు దశాబ్దాల తర్వాత కూడా అది ఒక పవిత్రమైన డాక్యుమెంటులా నిలిచి ఉంది. ప్రత్యేకించి రాజ్యాంగాల జీవితకాలం తరచుగా తక్కువగా ఉంటున్న, కొత్తగా విముక్తి పొంది అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో భారత రాజ్యాంగం సాధించిన విజయం సామాన్యమైంది కాదు. భారత రాజ్యాంగం మనసా వాచా ఎల్లప్పుడూ పౌరులందరి ఆత్మగౌరవం, సంక్షేమం కోసం నిలబడింది. దేశంలో రాజ్యాంగ ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంలో ప్రభుత్వ అంగా లన్నీ దశాబ్దాలుగా దోహదం చేస్తూ వచ్చాయి. దీని కారణంగానే మన దేశం ఆకలి, నిరక్షరాస్యత, దారిద్య్రం, వెనుకబాటుతనం వంటి వాటిని నిర్మూలించి, సమగ్ర అభివృద్ధి, జవాబుదారీతనం, పారదర్శ కత వైపు అలుపు లేని ప్రయాణం సాగించడానికి వీలుపడింది. ఈ క్రమంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని, రాజకీయ సుస్థిరతను దేశం సాధించగలుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్వావలంబనను, సమానతను, దేశ పౌరులందరికీ నాణ్యమైన జీవితాన్ని కల్పించే కృషిని ప్రోత్సహిస్తున్న ఆధునిక సంక్షేమ రాజ్యంగా మారడానికి మన ప్రయాణాన్ని భారత రాజ్యాంగం సులభతరం చేసింది. రాజ్యాంగం అంటే ప్రకరణాలు, నిబంధనల సమాహారం మాత్రమే కాదు. భారత రాజ్యాంగపు అత్యంత ప్రధాన అంశం ఏమిటంటే, అది శిలాజం కాదు, ఒక సజీవ పత్రం. దీంట్లో మన జాతి ప్రాథమిక విలువలకు, నాగరికతకు ఆశ్రయమిచ్చే అనుల్లంఘనీయ మైన కేంద్రకం ఉంటుంది. అదే సమయంలో వేగంగా మారిపోతున్న ప్రపంచంలో ప్రజా ప్రయోజనాల డిమాండ్లకు ప్రతిస్పందించేలా ఎప్పటికప్పుడు మార్చుకోగల సరళమైన నిర్మాణాన్ని కూడా ఇది బల పరుస్తుంది. ఈ సరళత వల్లే పార్లమెంటు ఎప్పటికప్పుడు ప్రజా కేంద్ర కమైన రాజ్యాంగ సవరణలను చేయగలుగుతోంది. 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పూర్తి చేసుకున్న మనం ఒక జాతిగా ఇంత వరకు సాగించిన ప్రయాణం పట్ల, విభిన్న రంగాల్లో మనం సాధించిన విజయాల పట్ల గర్వపడవచ్చు. ‘అమృత్ కాల్’లోకి మనం ప్రవేశిస్తూ, స్వావలంబనతో కూడిన, బలమైన ఐక్యమైన మహా జాతిగా వచ్చే 25 సంవత్సరాల్లో మారాలనే మన స్వప్న సాకారం కోసం మనల్ని మనం పునరంకితం చేసుకుంటున్నాము కాబట్టి మన ప్రజల్లో, మన రాజ్యాం గంలో మన విశ్వాసాన్ని మరోసారి ప్రకటించుకునే తరుణం ఇదే. ‘అమృత్ కాల్’లో భాగమైన ‘పంచ ప్రాణ్’ అంటే అర్థం, వచ్చే పాతికేళ్లలో అభివృద్ధి చెందిన భారత్ గురించి మనం చేసుకున్న తీర్మానం మాత్రమే. వలసవాద ఆలోచనా తీరునుంచి బయట పడటం, మన వారసత్పం పట్ల గర్వపడటం, ఐక్యతను, సంఘీ భావాన్ని బలోపేతం చేసుకోవడం, పౌరుల్లో కర్తవ్య పరాయణత్వాన్ని పోషించడం వంటి లక్ష్యాలు... 1949 నవంబర్ 26న మనం చట్ట రూపంలోకి మార్చుకుని ఆమోదించిన రాజ్యాంగ ఆదర్శాలను గుర్తిం చడంలో నిస్సందేహంగా తోడ్పడతాయి. 1931లోనే మహాత్మా గాంధీ రాశారు: ‘‘నైతిక బానిసత్వం నుంచి, ఆధారపడటం నుంచి భారత్‌ను విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను పరితపిస్తాను. అత్యంత నిరు పేదలు సైతం ఇది నా దేశం అని భావించే భారత్ కోసం నేను కృషి చేస్తాను. అగ్రకులం, తక్కువ కులం అనే తేడా లేని భారత్ కోసం నేను శ్రమిస్తాను. అన్ని సామాజిక బృందాలు సామరస్యంతో కలిసి జీవించే భారత్ కోసం నేను కృషి చేస్తాను. అలాంటి భారతదేశంలో అంటరాని తనం అనే శాపానికి తావు ఉండకూడదు. దోపిడీకి గురికావడం కానీ, దోపిడీ చేయడం కానీ లేని ప్రపంచంలో శాంతియుతంగా ఉండగలం. ఇదే నా స్వప్నాల్లో ఉంటున్న భారతదేశం.’’ సామాన్యుడిని కేంద్రస్థానంలో ఉంచగల రాజకీయ సౌర్వభౌమా ధికారం కలిగిన రాజ్యాంగం కోసం స్వాతంత్య్ర సమరం కాలంలోని రాజకీయ నేతలు ప్రయత్నించారు. సామాన్యుడి సంక్షేమం, ఆత్మ గౌరవానికి రాజ్యాంగంలో కీలక స్థానం ఉంటోంది. ‘పంచ ప్రాణ్’ను తీసుకుని, దాని సాకారం కోసం మనస్ఫూర్తిగా పనిచేయగలగాలి. అప్పుడే మన ప్రజాస్వామిక నైతిక విలువలు సంపూర్ణ వికసనాన్ని చూస్తాయి. అసంఖ్యాక స్వాతంత్య్ర సమరయోధుల స్వప్నాలను, త్యాగాలను గుర్తిస్తాయి. అప్పుడు మాత్రమే రెండు సహస్రాబ్దాలుగా మనం న్యాయబద్ధంగానే సాధించుకుని ఉన్న అగ్రగామి ప్రపంచ దేశంగా భారతదేశాన్ని తిరిగి నెలకొల్పగలుగుతాము. రాజ్యాంగం ప్రజలకు అధికారం కట్టబెడుతున్నట్లే, ప్రజలు కూడా రాజ్యాంగానికి అధికారం కట్టబెడతారు. రాజ్యాంగాన్ని ఎంత చక్కగా, వివరంగా రాసుకున్నప్పటికీ, సంస్థలు, ప్రజలతో అది సంకేతాత్మకంగా బంధాన్ని నెలకొల్పుకోవడంలో విఫలమైతే అలాంటి రాజ్యాంగానికి అర్థమే లేదని మన రాజ్యాంగ నిర్మాతలు చక్కగా గుర్తించారు. రాజ్యాంగ సభలోని ఒక గొప్ప వ్యక్తి ముందుచూపు, మేధాతత్వం, చాతుర్యం అనేవి రాజ్యాంగానికి రూపురేఖలు దిద్ద డంలో తోడ్పడ్డాయి. తరం తర్వాత తరంలో రాజ్యాంగానికి ఆమోద నీయత పెరుగుతూనే వస్తోంది. అలాగే భారత రాజ్యాంగంతో మనసా వాచా అవిచ్ఛిన్న బంధాన్ని నెలకొల్పుకున్న దేశ సామాన్య పౌరుడికి కూడా మనం సెల్యూట్ చేయాల్సిన సమయమిది. గత ఏడు దశాబ్దాల మన ప్రయాణంలోని ప్రతి సంక్లిష్టమైన మలుపులోనూ సామాన్య పౌరులే రాజ్యాంగ ఉన్నతాదర్శాల పట్ల తమ విశ్వాసాన్ని, నిబద్ధతను పునరుద్ధరించుకుంటా వస్తున్నారు. ఓం బిర్లా, వ్యాసకర్త, లోక్‌సభ స్పీకర్ (నేడు భారత రాజ్యాంగ దినోత్సవం) -
బాబాసాహెబ్ కలల సాకారంలో...
అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆర్టికల్ 370 మన రాజ్యాంగంలో భాగమైంది. మోదీ బలమైన సంకల్పం ఫలితంగా ఆర్టికల్ 370 రద్దు సాధ్యమై, ఇవాళ భారతదేశంతో జమ్ము–కశ్మీర్ ఏకీకరణ స్వప్నం సాకారమైంది. మోదీ చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు, విధానాలన్నింటి లోనూ అంబేడ్కర్ ప్రభావం సుస్పష్టం. మోదీ అనేకమంది నాయకుల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, అంబేడ్కర్ ముద్ర ఆయన పాలనా శైలిలో సర్వత్రా కనిపిస్తుంది. ‘భారతీయతే మన నిజమైన గుర్తింపు. బలమైన దేశ నిర్మాణం కోసం మనమంతా కుల, మత, జాతి భేదాలను పక్కకునెట్టి ముందడుగు వేయాలి’ అన్న మన భారతరత్న అంబేడ్కర్‌కు మోదీ నిజమైన వారసుడన్నది నా అభిప్రాయం. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మన సమాజ భాగ స్వాములైన బడుగు, బలహీన వర్గాల వారి ఆశలు, ఆకాంక్షలకు రెక్కలు తొడిగిన రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్‌ను స్మరించుకోవాల్సిన అవసరం ఎంత యినా ఉంది. స్వాతంత్య్రం తర్వాత దేశ ప్రగతికి వివిధ ప్రభుత్వాలు తమ వంతు కృషి చేసినప్పటీకీ అంబేడ్కర్ కన్న కలల్లో ఏళ్ల తరబడి నెరవేరని ఎన్నో స్వప్నాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం సాకారం చేసింది. ఈ రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి పుట్టినరోజు. ఆయనతో నాది చాలా సుదీర్ఘ, చిరస్మరణీయ అనుబంధం. సంస్థలో ఒకరిగా, ముఖ్యమంత్రిగా, ఇవాళ ప్రధానమంత్రిగా ఆయన పనిచేయడం నేను చూస్తూ వచ్చాను. దళితులు, ఆదివాసీలు, మహిళల సాధికారతలో ఆయన ప్రదర్శించిన శ్రద్ధాసక్తులు నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆ మేరకు బాబాసాహెబ్‌కు నిజమైన శిష్యుడిగా భారతదేశాన్ని సమసమాజంగా రూపుదిద్దడానికి మోదీ ముమ్మర కృషి చేస్తున్నారు. మోదీ చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు, విధానాలు తదితరాలన్నింటిలోనూ అంబే డ్కర్ ప్రభావం సుస్పష్టం. ఒక సంస్థలో సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా, నేడు ప్రధానమంత్రిగానూ మోదీ సదా బాబాసాహెబ్ బాటలోనే నడుస్తున్నారు. తదనుగుణంగా దేశానికేగాక ప్రపంచం మొత్తానికీ చిరకాలం గుర్తుండిపోయే బహుమతిని ‘పంచతీర్థం’ రూపంలో మోదీ అందించారు. బాబాసాహెబ్ జయంతిని ‘సమతా దినోత్సవం’గా నిర్వహించాలని నిర్ణయించడమేగాక నవంబర్ 26ను భారత ‘రాజ్యాంగ దినోత్సవం’గానూ మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ చూపిన ఈ చొరవతో ఐక్యరాజ్య సమితి కూడా బాబాసాహెబ్ 125వ జయంతి వేడుకను నిర్వహించింది. అంబేడ్కర్ కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ నెరవేరని– ఆర్టికల్ 370 రద్దు, స్వయం సమృద్ధ భారతం స్వప్నాలను మోదీ ప్రభుత్వం పటిష్ఠ చర్యలతో సాకారం చేయగలిగింది. కాగా, ఆనాడు అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆర్టికల్ 370 మన రాజ్యాంగంలో భాగమైంది. దీంతో భారతదేశంలో జమ్ము–కశ్మీర్ విలీనానికి అడ్డుకట్ట పడింది. అయితే, మోదీ బలమైన సంకల్పం, దీక్ష ఫలితంగా ఆర్టికల్ 370 రద్దు సాధ్యమై, ఇవాళ భారతదేశంతో జమ్ము–కశ్మీర్ ఏకీకరణ స్వప్నం సాకారమైంది. అదేవిధంగా శక్తిమంతమైన స్వయం సమృద్ధ భారతదేశ నిర్మాణం దిశగా ప్రధానమంత్రి మోదీ ఉద్యమ సంక ల్పంతో శ్రమిస్తున్నారు. ‘స్వయం సమృద్ధం’ కావడం ద్వారానే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించగలదని అంబేడ్కర్ గట్టిగా విశ్వసించారు. కానీ, భారతదేశాన్ని స్వావలంబన మార్గంలో నడి పించడంలో మునుపటి ప్రభుత్వాలకు సంకల్పం, చిత్తశుద్ధి లోపిం చాయి. కానీ, మోదీ ఈ పరిస్థితిని చక్కదిద్ది, భారత ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించడం ద్వారా ప్రపంచానికి మన శక్తిని చాటారు. కాబట్టే మన బలమేమిటో ప్రపంచం ఇవాళ గుర్తించింది. రాష్ట్రపతి హోదాలో నేను పలు సామాజిక సమస్యలు, పాలనా వ్యవహారాలపై ప్రధానితో సంభాషించినప్పుడల్లా వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన అవినీతి గురించి ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేసేవారు. ఈ జాడ్యం కారణంగా ఎక్కువగా నష్టపోతున్నది పేదలేనని చెప్పేవారు. ఈ నేపథ్యంలో గడచిన ఎనిమిదేళ్లుగా మోదీ అవినీతిపై అలుపెరుగని నిర్ణయాత్మక పోరాటం చేస్తున్నారు. తదనుగుణంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలన్నీ నిరుపేద లందరికీ అందేలా ఆయన చేసిన కృషిని మనమంతా ప్రత్యక్షంగా చూశాం. పర్యవసానంగా ఇవాళ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ సాఫీగా సాగిపోతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాలన్నీ నిరుపేదలపై కరుణను ప్రతిబింబించేవి కావడం గమనార్హం. మన ప్రజాస్వామ్య వ్యవస్థను అనువంశిక రాజకీయాలు నియంత్రించడం మోదీకి తీవ్ర ఆందోళన కలిగించిన మరో అంశం. ఈ అనువంశిక రాజకీయాలు చిత్తశుద్ధితో, శ్రమించి పనిచేసే రాజ కీయ కార్యకర్తల హక్కులను ఏ విధంగా లాగివేసుకుంటాయనే అంశంపై ఆయన సదా గళం విప్పుతూనే వచ్చారు. మోదీ ఎల్లప్పుడూ అర్హత ప్రాతిపదికగానే నాయకులను, కార్యకర్తలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అనువంశిక రాజకీయాలపై మోదీ చేసిన యుద్ధం ఇప్పటికే తన ప్రభావం చూపుతోంది. ఈ మేరకు మన ప్రజాస్వా మ్యాన్ని పటిష్ఠం, మరింత శక్తిమంతం చేసేది ప్రతిభ ఆధారిత రాజకీయాలే తప్ప అనువంశిక రాజకీయాలు కావన్నది స్పష్టమైంది. మోదీ పాలన శైలికి మరో నిలువెత్తు నిదర్శనం ‘పద్మ’ పురస్కరాలు. ఒకనాడు సంపన్న, పలుకుబడిగల వర్గాలకు ‘విశేష పరి గణన’ ఇచ్చేవిగా భావించబడిన ఈ పురస్కారం నేడు ‘సామా న్యుడి’తో తన అనుబంధాన్ని పునరుద్ధరించుకుంది. ఈ మేరకు ఇవాళ ‘జన సామాన్యం’తో మమేకమైన వారికి అంకితం చేయబడ్డాయి. అత్యంత వెనుకబడిన రంగాలలో అభివృద్ధి, తదనుగుణంగా అట్టడుగు వర్గాల జీవితాల్లో కొత్త అధ్యాయం లిఖించే విధంగా ప్రభుత్వం చేపట్టిన రెండు కీలక చర్యల గురించి ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలిచాను. ఇందులో ఒకటి ‘ఆకాంక్షాత్మక జిల్లాల కార్య క్రమం’ కాగా, రెండోది ‘ఆదర్శ గ్రామాల పథకం’. మోదీ విశిష్ట ఆలోచన శైలికి ఇదే నిదర్శనం. వేలెత్తి చూపలేని పటిష్ట ప్రణాళికలు, లోపరహితంగా వాటిని అమలు చేయడం వల్ల నిరుపేదల జీవితాల్లో సుస్పష్టమైన మార్పులు వచ్చాయి. అనేక సాంఘిక సంక్షేమ పథకాలే ఇందుకు తిరుగులేని ఉదాహరణలు. వీటిలో ప్రపంచంలోనే అత్యంత భారీ ఉచిత రేషన్ పథకమైన ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ అత్యంత విశిష్టమైనది. భారతీయులు కరోనా మహ మ్మారిపై సాహసోపేత పోరాటం సలుపుతున్న నేపథ్యంలో ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా 80 కోట్ల మందికిపైగా ప్రజలు ప్రయోజనం పొందారు. మహమ్మారి వైరస్‌పై భారత్ పోరాటాన్ని ప్రధాని మోదీ ఏ విధంగా ముందుండి నడిపారో నేను ప్రత్యక్షంగా చూశాను. మన శాస్త్రవేత్తలు, వైద్యులు ఒకటికి రెండు ‘దేశీయ’ (మేడ్ ఇన్ ఇండియా) టీకాలను రూపొందించడంలో ఆయనిచ్చిన చేయూత, మద్దతు నిరుపమానం. దీంతో మనందరికీ భద్రత లభించడమేగాక అనేక ఇతర దేశాల ప్రజానీకం సంక్షేమానికీ మనమంతా తోడ్పడినట్ల యింది. మరోవైపు మహమ్మారి గరిష్ఠ స్థాయిలో విజృంభించే నాటికి 100 కోట్ల మంది భారతీయులకు టీకాలు వేసే బృహత్తర కార్యాచర ణను కూడా ప్రధానమంత్రి చేపట్టారు. తద్వారా ప్రపంచంలోనే అత్యంత భారీ, వేగవంతమైన టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి, విజయవంతం చేశారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలను కోవిడ్ ఊపిరాడకుండా చేసిన సమయంలో ప్రధాని మన ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమేగాక విస్తరించారు. సమయ స్ఫూర్తితో కూడిన విధానపరమైన కార్యక్రమాల ద్వారా ఆర్థిక వృద్ధి స్తంభించకుండా ఎంతో జాగ్రత్త వహించారు. మోదీ గత ఎనిమిదేళ్ల పాలన అత్యద్భుతం. మోదీ అనేకమంది నాయకుల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, అంబేడ్కర్ ముద్ర ఆయన పాలన శైలిలో సర్వత్రా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘భారతీయతే మన నిజమైన గుర్తింపు. బలమైన దేశ నిర్మాణం కోసం మనమంతా కుల, మత, జాతి భేదాలను పక్కకునెట్టి ముందడుగు వేయాలి’ అన్న మన భారతరత్న అంబేడ్కర్‌కు మోదీ నిజమైన వారసుడన్నది నా అభి ప్రాయం. అంబేడ్కర్ అడుగుజాడల్లో మన ప్రధాని ‘దేశమే ప్రథమం’ అనే నినాదాన్ని తారకమంత్రంగా స్వీకరించారు. మరోవైపు సుపరి పాలన, సామాజిక సమన్వయం, క్రమశిక్షణలనే విశిష్ట లక్షణాలతో ఆయన ప్రభుత్వం దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోంది. (నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు) రామ్‌నాథ్ కోవింద్ (భారత మాజీ రాష్ట్రపతి) -
విచక్షణతో వ్యాఖ్యలు చెయ్యాలి
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో జడ్జీలు వ్యాఖ్యలు చేసేటప్పుడు విచక్షణతో చేయాలని రాష్ట్రపతి కోవింద్ హితవు పలికారు. జడ్జీలు తమ వ్యాఖ్యలకి తప్పుడు భాష్యాలు కల్పించే అవకాశం ఇవ్వకూడదన్నారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ విక్షచణారహితంగా వ్యాఖ్యలు చేస్తే వాటిని సరిగా అర్థం చేసుకోలేరని అన్నారు. అంతిమంగా న్యాయవ్యవస్థ సక్రమంగా నడవదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగదినోత్సవాల ముగింపు సమావేశంలో శనివారం కోవింద్ మాట్లాడారు. భారతీయ సంప్రదాయంలో న్యాయమూర్తులకు ఒక హోదా ఉందని, స్థితప్రజ్ఞతకు, నైతికతకు మారుపేరుగా వారు ఉంటారని కొనియాడారు. ‘మన దేశంలో తీర్పులిచ్చిన సమయంలో ఎంతో వివేకాన్ని ప్రదర్శిస్తూ వ్యాఖ్యలు చేసే న్యాయమూర్తులు ఎందరో ఉన్నారు. వారు చేసే వ్యాఖ్యలు భవిష్యత్ తరాలకు బాటలు వేసేలా ఉన్నాయి. అత్యున్నత ప్రమాణాలకే న్యాయవ్యవస్థ కట్టుబడి ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’’ అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యానికి న్యాయం మూలాధారం లాంటిది. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు సామరస్యపూర్వక ధోరణిలో కలిసి ముందుకు సాగినపుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. రాజ్యాంగంలో ప్రతి వ్యవస్థకూ దాని పరిధిని నిర్దేశించారు. దానికి లోబడే ఈ వ్యవస్థలు పనిచేస్తాయి’ అని కోవింద్ అన్నారు. ఆ చట్టాలతో న్యాయవ్యవస్థపై భారం: సీజేఐ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ శాసనవ్యవస్థ తాను చేసే చట్టాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అంచనా వేయకుండా, అధ్యయనాలు నిర్వహించకుండా వాటిని ఆమోదించడం వల్ల ఒక్కోసారి అతి పెద్ద సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. దాని వల్ల కేసుల సంఖ్య పెరిగిపోయి న్యాయవ్యవస్థపై పెనుభారం పడుతోందన్నారు. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల్ని పెంచనంతవరకు పెండింగ్ కేసులు తగ్గుముఖం పట్టవని అన్నారు. పార్లమెంటు లేదంటే రాష్ట్రాల అసెంబ్లీలు చేసిన చట్టాలను, న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను అమలు చేయడం కష్టసాధ్యమనే పరిస్థితులు ఎప్పటికీ ఏర్పడకూడదని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. -
కుటుంబ పార్టీలతో పెద్ద ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: కుటుంబ పార్టీలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇలాంటి రాజకీయ పార్టీలే పెద్ద ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పార్టీపై ఒకే కుటుంబానికి చెందిన తరతరాల నేతలు పెత్తనం చెలాయించడం మంచి పరిణామం కాదన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాల్లో మోదీ ప్రసంగించారు. ‘కుటుంబం కోసం పార్టీ, కుటుంబంతో పార్టీ ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏమీ లేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ఒక ప్రభుత్వానికి, ఒక రాజకీయ పార్టీకి, ఒక ప్రధానికి సంబంధించినది కాదని అన్నారు. ఇది అంబేడ్కర్ గౌరవానికి, మన రాజ్యాంగ ప్రతిష్టకు సంబంధించిన వేడుక అని ఉద్ఘాటించారు. కుటుంబ పార్టీల కారణంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారిదాకా దేశం ఒక రకమైన సంక్షోభం వైపు పయనిస్తోందని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రజలకు ఆందోళన కలిగించే అంశమన్నారు. కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది సొంత ప్రతిభ, ప్రజల ఆశీర్వాదాలతో ఒక పార్టీలో చేరి రాణిస్తే అది వంశపారంపర్య పార్టీ కాబోదన్నారు. కానీ, పార్టీపై ఒకే కుటుంబం తరతరాలుగా స్వారీ చేయడం ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తుందన్నారు. ముంబైలో 26/11 ఉగ్రదాడుల్లో మృతిచెందిన వారికి ప్రధాని నివాళులర్పించారు. అవినీతిపరులను కీర్తిస్తారా? భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొందరు వ్యక్తులు దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మోదీ ధ్వజమెత్తారు. వలసవాద మనస్తత్వం కలిగిన శక్తులు దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు. సుప్రీం బార్ అసోసియేషన్ నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మాట్లాడారు. ఇవి పార్లమెంట్ వేడుకలు: ఓం బిర్లా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు పార్లమెంట్‌కు చెందినవని, ప్రభుత్వానివి కాదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ప్రతిపక్షాలు పాల్గొంటే బాగుండేదని అన్నారు. ఉభయ సభల్లో జరిగిన చర్చల డిజిటల్ వెర్షన్, రాజ్యాంగం కాలిగ్రాఫ్డ్ కాపీ డిజిటల్ వెర్షన్, అన్ని సవరణలతో కూడిన రాజ్యాంగ ప్రతిని రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, స్పీకర్ బిర్లా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి, టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్, టీఆర్ఎస్ ఎంపీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాజ్యాంగ బలంతోనే దేశాభివృద్ధి: రాష్ట్రపతి కోవింద్ రాజ్యాంగ బలంతోనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి మా ట్లాడారు. ఏ పార్టీకి చెందిన సభ్యులైనా పార్లమెంట్ గౌరవాన్ని కాపాడేలా ప్రవర్తించాలని చెప్పారు. గ్రామ పంచాయతీ, విధాన సభ, పార్లమెంట్‌కు ఎంపికయ్యే ప్రజాప్రతినిధులకు ఒకే రకమైన ప్రాధాన్యం ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని కోరారు. 15 పార్టీలు గైర్హాజరు రాజ్యాంగ దినోత్సవానికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, సీపీఎం, సీపీఐ తదితర 15 ప్రతిపక్షాలు గైర్హాజరయ్యాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తున్నందున ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని తెలిపాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతోపాటు బిజూజనతాదళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, బహుజన సమాజ్ పార్టీ, టీడీపీ పాల్గొన్నాయి. ఆదర్శాల ప్రకటనే రాజ్యాంగం: వెంకయ్య సంభాషణలు, చర్చల ద్వారా చట్టసభలు దేశానికి మార్గనిర్దేశం చేయాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సూచించారు. రాజ్యాంగం అనేది విలువలు, ఆలోచనలు, ఆదర్శాల ప్రకటన అని అన్నారు. సోదరభావం స్ఫూర్తితో అం దరికీ న్యాయం, స్వేచ్ఛ కల్పించిందని తెలిపా రు. జాతీయ ఐక్యత కోసం ప్రయత్నించిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి, నిబంధనలకు ప్రజా ప్రతినిధులందరూ కట్టుబడి ఉండాలన్నారు. బీజేపీది నిరంకుశ ధోరణి: కాంగ్రెస్ దేశ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం అగౌరవపరుస్తోందని నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అందుకే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన రాజ్యాంగ దినం కార్యక్రమాల్లో తాము పాల్గొన లేదని కాంగ్రెస్ తెలిపింది. ఆ పార్టీ ప్రతినిధి ఆనంద్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం అవమానిస్తోందని, రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని అన్నారు. పార్లమెంట్ పరిశీలనతో నిమిత్తం లేకుండానే చేసే చట్టాలు వల్ల సమాజంలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రేరేపిత దాడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడుకోవాలి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రేరేపిత, లక్ష్యంగా చేసుకొని సాగించే దాడుల నుంచి న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలని న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఓ పెద్ద కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు సభ్యులని చెప్పారు. న్యాయవాదులు అబద్ధాలకు వ్యతిరేకంగా, నిజం వైపు నిలవాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఎన్వీ రమణ మాట్లాడారు. ‘‘న్యాయవాదులు తప్పనిసరిగా న్యాయమూర్తులకు, వ్యవస్థకు సహకరించాలి. మనమంతా ఓ పెద్ద కుటుంబంలో సభ్యులం. న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలి. రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములైనవారిని ఎవరూ మరిచిపోరు’’ అని పేర్కొన్నారు. న్యాయవాదులకు సామాజిక బాధ్యత ఉండాలని, సమాజానికి మార్గదర్శకులుగా వ్యవహరించాలని సూచించారు. -
అమరావతి : అసెంబ్లీ కమిటీ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
-
అసెంబ్లీ కమిటీ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
సాక్షి, అమరావతి: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, శాసన సభాపతి తమ్మినేని సీతారాం పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్,ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్, ఎస్బి.అంజాద్ బాషా, పాముల పుష్పశ్రీ వాణి, మంత్రులు పినిపే విశ్వరూప్,మేకతోటి సుచరిత, తానేటి వనిత, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పల రాజు, వెలంపల్లి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస వేణు గోపాల కృష్ణ,పేర్ని వెంకట్రామయ్య, బుగ్గన రాజేంద్ర నాధ్, కురసాల కన్నబాబు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చదవండి: Tirupati Water Tank Incident: తిరుపతిలో వింత ఘటన.. చూసేందుకు ఎగబడుతున్న జనం -
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
న్యూఢిల్లీ: పార్లమెంటు సెంట్రల్ హాల్లో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాయకత్వం వహించారు. వేడుకలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశిష్ట సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రతిపక్షాలు బహిష్కరించాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఆ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. చదవండి: మొదటిసారి ప్రయోగాత్మకంగా.. తగ్గేదే లేదంటున్న కర్ణాటక మహిళా పోలీసులు -
‘కేవైసీ’ తెలుసుకోవాల్సింది ఎవరు?
ఆకర్షణీయమైన నినాదాలతో ప్రజ లను వశపర్చుకొనే తంత్రం తెలిసిన ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ‘కేవైసీ’ అనే ఓ క్యాచీ స్లోగన్ వది లారు. అంటే నో యువర్ కాన్స్టి ట్యూషన్. ఇప్పటివరకూ కేవైసీకి నో యువర్ కస్టమర్ (నీ వినియోగ దారుని గురించి తెలుసుకో) అనే అర్థం ఉంది. మోదీ నో యువర్ కాన్ స్టిట్యూషన్ (నీ రాజ్యాంగాన్ని తెలుసుకో) అనే అర్థాన్నిచ్చి, భారత రాజ్యాంగ అమలుపై మరోసారి చర్చ జరిగేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 26, 2020న గుజరాత్‌లోని కెవాడియాలో జరిగిన 80వ అఖిల భారత సభాపతుల ముగింపు సమావేశంలో మోదీ దీన్ని ప్రస్తావించడం విశేషం. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే రాజ్యాంగంలో, చట్టాల్లో ఉన్న భాషను సరళతరం చేయాలని మోదీ చేసిన సూచన సముచితమైనది. రాజ్యాంగం ప్రతులు ప్రజలందరి దగ్గర ఉండాలి. ముఖ్యంగా, ప్రజాప్రతినిధుల వద్ద తప్పని సరిగా ఉండాలి. రాజ్యాంగం ఏం చెప్పిందో తెలిసినంత మాత్రాన ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందుతాయా? గత 7 దశాబ్దాల అనుభవాలను చూసినట్లయితే అన్ని అక్ర మాలు రాజ్యాంగం నీడలోనే జరిగాయి. రాజ్యాంగం అమ లులో ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో తెలుసుకొని వాటిని సరిదిద్దితేనే అన్ని వ్యవస్థలు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తాయి. అంబేడ్కర్ ‘ఈ రాజ్యాంగం ఎంత మంచిదైనా కావొచ్చు. దీనిని అమలు జరిపేవారు మంచివారైతే ఇది మంచిదవుతుంది. చెడ్డవారైతే ఇది చెడ్డదవుతుంది’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. నిజానికి, 5 ఏళ్ల క్రితమే 2016 నవంబర్ 26ను రాజ్యాంగదినంగా ప్రకటించి, నవంబర్ 26, 27 తేదీలలో రెండు రోజులపాటు ‘రాజ్యాంగానికి నిబద్ధులం’ అనే పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. కాంగ్రెస్ పాలనలో అనేక రాజ్యాంగ వ్యవ స్థలు గాడి తప్పాయి. కాంగ్రెస్‌కు భిన్నంగా మోదీ నేతృ త్వంలో అన్ని వ్యవస్థలు రాజ్యాంగ సూత్రాలకు లోబడి పని చేస్తాయని ఆశించడం జరిగింది. గవర్నర్ల వ్యవస్థ, స్పీకర్ వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం, ఎన్నికల కమిషన్, న్యాయ వ్యవస్థ... అన్నీ రాజ్యాంగ నిబంధనలకు లోబడి పని చేయ డానికి తగిన సంస్కరణలను ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతుం దని ఆశించారు. గత ఆరేళ్ల అనుభవాలు చూసినట్లయితే రాజ్యాంగాన్ని ఓ దిక్సూచిలా చేసుకొన్నట్లు కనపడదు. అందుకు పలు ఉదాహరణలు కనిపిస్తాయి. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు గతంలో కంటే మెరుగుపడిన దాఖలాలు లేవు సరికదా పలు అంశాలపై కేంద్ర, రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు పీఠముడి పడేస్థాయికి చేరాయి. పశ్చిమ బెంగా ల్లో గవర్నర్ వ్యవహారశైలి వివాదంగా మారింది. ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పార్టీ ఫిరాయింపుల అంశంపై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించడం దురదృ ష్టకరం. 1985లో 52వ రాజ్యాంగ సవరణ, ఆ తర్వాత 2003లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణల తర్వాత కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం అపహాస్యం పాలవడానికి కారణం సభాపతి (స్పీకర్/చైర్మన్) తన నిర్ణయాన్ని వెలువ రించడానికి నిర్ణీత కాలపరిమితి లేకపోవడం. ఇది ఫిరాయిం పుదారులకు వరంగా పరిణమించింది. 2014–19 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశంలోకి ఫిరాయించారు. అందులో నలు గురు రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రులయ్యారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ఈ ప్రక్రియను సరిదిద్దడా నికి మోదీ ప్రభుత్వం ఇప్పటికీ ప్రయత్నం చేయడం లేదు. 190వ ‘లా కమిషన్’ సిఫార్సులను అమలు చేయడం లేదా మరోసారి చట్టసవరణ చేయడం ద్వారా ఫిరాయింపుల జాడ్యాన్ని అరికట్టవచ్చు. అటువంటి చొరవ ఎన్డీఏ ప్రభు త్వంలో కనపడటం లేదు. పార్లమెంటులో చేసే చట్టాలను పటిష్టవంతంగా అమలు చేయడం కేంద్రానికున్న రాజ్యాంగ బాధ్యతల్లో ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పార్లమెంట్ ఆమోదించిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2014’లోని పలు అంశాలను ఇప్పటికీ కేంద్రం అమలు చేయడం లేదు. స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధంగా అందించా ల్సిన విధులు, నిధులు బదలాయించడంలో గత యూపీఏ అనుసరించిన మార్గంలోనే ఎన్డీఏ కూడా పయనిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అటకెక్కిన మహిళా రిజర్వే షన్ల బిల్లు చట్టరూపం దాల్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం చొరవ చూపడం లేదు. వైద్యరంగంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ప్రైవేటు వైద్యరంగం పాల్పడిన దాష్టీకాలనుండి గుణపాఠాలు నేర్చు కోవాలి. విద్య, వైద్య రంగాలను ప్రైవేటు కబంధ హస్తాల నుండి విముక్తం చేసి వాటిని సార్వజనీనం చేయాలి. ప్రజల విశ్వసనీయతను కోల్పోతున్న వ్యవస్థల్లో ఒకటైన ‘భారత ఎన్నికల కమిషన్’ను మరింత సమర్థవంతంగా, పారదర్శ కంగా రూపొందించి ఎవరు అక్రమాలకు పాల్పడినా ఉపేక్షిం చదన్న భయాన్ని రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు కలిగేలా సంస్కరణలు చేపడతారని ఆశించినప్పటికీ, ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. న్యాయవ్యవస్థ ప్రజలకు సమ న్యాయాన్ని, సత్వర న్యాయాన్ని అందించడానికి అవసర మైన సహాయ సహకారాలు ప్రభుత్వపరంగా అందగలగాలి. దేశంలో దాదాపు 3,500కుపైగా వెనుకబడిన కులాలు ఉండగా అందులో 3,400 కులాలు ఇంతవరకు పార్లమెం టులోగానీ, అసెంబ్లీలోగానీ అడుగు పెట్టలేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 100కుపైగా ఉన్న వెనుక బడిన కులాలవారికి దాదాపు 70కుపైగా ప్రత్యేక కార్పొ రేషన్లు ఏర్పరచి రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రోత్సాహం కల్పించడం దేశంలోనే ఓ విప్లవాత్మక ముందడుగు. అయితే, జనాభాలో 50 శాతంగా ఉన్న ఓబీసీ వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం గణనీయంగా నిధులు పెంచాల్సిన అవ సరం ఉంది. ఓబీసీ వర్గాలకు కేంద్రంలో ప్రత్యేకించి మంత్రి త్వశాఖను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉన్నప్పటికీ దానిని అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఎన్డీఏ ప్రభుత్వంలో కనపడటం లేదు. రాజ్యాంగానికి నిబద్ధులం అని చాటుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆకలి, అనారోగ్యం, పేదరికం నిర్మూలన, దోపిడీ, వివక్షల నుండి రక్షణ తదితర సామాజిక లక్ష్యాల సాధనలో ఏ మేరకు విజయం సాధించారన్నదే కొలమానం. రాజ్యాంగం అంటే చట్టపరమైన పత్రాలే కాదు, అదొక సామాజిక పత్రం అన్న అంబేడ్కర్ మాటల్ని చిత్త శుద్ధితో అమలు చేసి ఫలితాలు చూపించాలి. అప్పుడే రాజ్యాంగానికి కట్టుబడినట్లు భావించగలం. వ్యాసకర్త: సి. రామచంద్రయ్య మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
అందరికీ న్యాయం.. డబ్బే అడ్డంకి: కోవింద్
న్యూఢిల్లీ: అందరికీ న్యాయాన్ని అందించడంలో ప్రధాన అడ్డంకి డబ్బేనని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. సుప్రీంకోర్టు నిర్వహించిన 71 వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి సమయంలో కూడా అందరికీ న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థ, బార్‌కౌన్సిల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కృషి చేశాయన్నారు. ఉన్నత న్యాయస్థానం తమ తీర్పులను వివిధ ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేవడం అభినందించదగిన విషయమని చెప్పారు. ఉన్నత ప్రమాణాలూ, ఆదర్శాలూ, కీలక తీర్పులతో న్యాయవ్యవస్థ బలోపేతం అయ్యిందని, సుప్రీంకోర్టు ప్రతిష్ట పెరిగిందని అన్నారు. పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానతను సాధించడం గురించి రాజ్యాంగ పీఠికలో రాసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమణ్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు దుష్యంత్ దావేలు కూడా ఉపన్యసించారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పాల్గొన్నారు. -
అంబేద్కర్‌కి నివాళులర్పించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఏపీ సీఎస్ నీలం సాహ్ని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో బాబాసాహెబ్ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం శ్రీ వైయస్.జగన్.#BRAmbedkar pic.twitter.com/hw3zpKBkWy — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 26, 2020 విజయవాడ ప్రెస్ క్లబ్లో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో 71వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పూలమూల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతంరెడ్డి, మాదిగ కార్పోరేషన్ చైర్మెన్ కొమ్మూరి కనకారావు, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూధనరావు, దళిత సంఘ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు కాలే పుల్లారావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో దళితులు అణగదొక్కబడ్డారని, చంద్రబాబు దళితులను చిన్నచూపు చూశారని మండిపడ్డారు. అంబెద్కర్ ఆశయాలను నెరవేర్చే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని, రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన సాగుతోందని గుర్తు చేశారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జగన్‌కు తాము ఎల్లప్పడూ అండగా ఉంటామని కాలే పుల్లారావు తెలిపారు. -
రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాలకు న్యాయం
సాక్షి, తాడేపల్లి: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ కృషి కారణంగానే భారత్ పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రజలకు సంక్రమించిన అనేక హక్కులు రాజ్యాంగ ఫలితమే అని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, హోం మంత్రి మేకతోటి సుచరిత, విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆర్ అండ్ బి మంత్రి శంకర నారాయణ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, జెల్లీ కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ రావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు నారుమల్లి పద్మజ, నారాయణ మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.(చదవండి: గురుపూరబ్ ఉత్సవాలకు రండి) ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ చిత్తశుద్ధితో బాధ్యతలు నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వాలు రాజ్యాంగానికి ఎలా తూట్లు పొడిచాయో మనం చూశాం. చివరికి ప్రతిపక్ష పార్టీ వారికి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లారు. కొన్ని వ్యవస్థలు, కొంత మంది వ్యక్తులు రాజ్యాంగాన్ని వేరే విధంగా వినియోగించుకుంటున్నాయి’’ అని గత టీడీపీ ప్రభుత్వ తీరును వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నాం: ఆదిమూలపు అంబేడ్కర్ భావజాలంతో రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోంది. రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. అమరావతిలో జరిగిన అవకతవకలు చూశాం.. ఇప్పుడు న్యాయం జరిగిందని భావిస్తున్నాం. అవినీతిని కూకటి వేళ్ళతో పెకిలించాలని ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని అడ్డుకోవాలని చూడటం సరికాదు.- ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి ఇతర రాష్ట్రాలకు ఆదర్శం: హోం మంత్రి అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో అంటరానితనం పెద్ద రుగ్మత. దాన్ని నిర్మూలించడానికి అంబేడ్కర్ కృషి చేశారు. ఆయన కృషివ ల్లే నేడు మనకు మంచి రాజ్యాంగం అందుబాటులో ఉంది. రాజ్యాంగ స్ఫూర్తితో సీఎం జగన్ ముందుడుగు వేసి, అన్ని వర్గాలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. అదే విధంగా 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మహిళకు స్థానం కల్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు అందాలని అనేక సంక్షేమ పథకాలతో ఈ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇతర రాష్ట్రాలకు మన ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది.- హోం మంత్రి మేకతోటి సుచరిత అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి: మంత్రి శంకర నారాయణ సమ సమాజ స్థాపన కోసం అంబేడ్కర్ చేసిన కృషి ఎనలేనిది. ఆయన స్పూర్తితో అణగారిన వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా పాలన: వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాథమిక హక్కులను గత ప్రభుత్వం కాలరాసింది. దళితులకు, అణగారిన వర్గాలకు అందించాల్సిన పథకాలు గతంలో అందించలేదు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు. -
భారత ఏకీకరణకు అంబేడ్కర్ పునాది
స్వతంత్ర భారత ఏకీకరణ కర్తగా చరిత్రకెక్కిన సర్దార్ పటేల్ కంటే చాలా కాలం క్రితమే అంటే 1931లోనే అంబేడ్కర్.. దేశమంతటా విస్తరించి ఉన్న సంస్థానాలు విలీనం కావడం ద్వారా భారత ఏకీకరణ అనివార్యమని చెప్పి ఉన్నారు. భారత్‌ను వదిలి వెళుతున్నందున దేశంపై తన సార్వభౌమాధికారం ఇక చెల్లదని, తమ తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో సంస్థానాలు చేరవచ్చు లేక స్వతంత్రంగా ఉండవచ్చు అంటూ 1946వో బ్రిటిష్ కేబినెట్ మిషన్ చేసిన ప్రకటన డొల్లతనాన్ని న్యాయకోవిదుడిగా అంబేడ్కర్ విప్పి చెప్పారు. కొత్తగా అధికారంలోకి వస్తున్న ప్రభుత్వానికి అంతకు ముందటి ప్రభుత్వం చలాయించిన కొన్ని హక్కులు వారసత్వంగా సంక్రమిస్తాయంటూ వారసత్వానికి సంబంధించిన అంతర్జాతీయ చట్టం చెబుతోందని అంబేడ్కర్ పేర్కొన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విదేశీ ప్రభుత్వాలుగా సంస్థానాల ఉనికిని భారత్ గుర్తించదని అంబేడ్కర్ తేల్చిచెప్పారు. సంపూర్ణ ఏకీకరణ పూర్తి చేసుకున్న స్థిరమైన జాతిగా భారత్‌ను ముందుకు నడిపించారు. వైవిధ్యపూరితమైన భారతదేశం కోసం హక్కుల ప్రాతిపదికన రాజ్యాంగ రూపకర్తగా సుపరిచితులైన బీఆర్ అంబేడ్కర్ భారత ఏకీకరణలో కూడా అద్వితీయ పాత్ర నిర్వహిం చారు. భారత్ తొలి హోంమంత్రిగా, స్వతంత్ర భారత్‌ని ఏకీకరణ చేసిన వాడిగా కీర్తిపొందిన సర్దార్ పటేల్ కంటే చాలా కాలం క్రితమే అంటే 1931లోనే అంబేడ్కర్.. చెల్లాచెదురుగా విస్తరించి ఉన్న సంస్థానాలు భారత్‌లో విలీనమైపోవడం ద్వారా భారత్ ఏకీకరణ అనివార్యమని చెప్పి ఉన్నారు. భారత యూనియన్‌లో చేరబోమని, కొత్తగా ఏర్పడిన ఐక్యరాజ్య సమితికి అప్పీల్ చేస్తామన్న హైదరాబాద్ నిజాం, ట్రావెన్కోర్ సంస్థానాల తలంపును 1947 జూన్‌లో న్యాయపరంగానే చెల్లకుండా చేసిన ఘనత కూడా అంబేడ్కర్‌దే. భారత ప్రభుత్వం 1935 చట్టం నిర్దేశకత్వంలో నిర్వహించిన మూడు రౌండ్ టేబుల్ సదస్సులకూ హాజరైన అతికొద్దిమంది వ్యక్తుల్లో అంబేడ్కర్ ఒకరు. గాంధీ రెండో రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. 1930లలో లండన్‌లో జరిగిన ఈ సదస్సులలో దురదృష్టవశాత్తూ సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూలకు ప్రతినిధులుగా పాత్ర లేకపోయింది. వారు హాజరై ఉంటే లండన్ సదస్సుల్లో అంబేడ్కర్ న్యాయ సూక్ష్మత, పటిమను వారు ప్రత్యక్షం గా చూడగలిగేవారు. సంస్థానాల ఉనికిని తోసిపుచ్చిన అంబేడ్కర్ ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో భాగంగానే ఫెడరల్/స్ట్రక్చర్ కమిటీలో చాంబర్ ఆప్ ప్రిన్సెస్‌కు ప్రాతినిధ్యం వహించిన బికనీర్ మహారాజుతో 1931 సెప్టెంబర్ 16న అంబేడ్కర్ ఘర్షించారు. 1935 తర్వాత బ్రిటిష్ ఇండియా పార్లమెంటులో ప్రాతినిధ్యం కోసం సంస్థానాధిపతులు చేసిన ప్రయత్నాన్ని అంబేడ్కర్ ఈ సమావేశంలోనే తోసిపుచ్చారు. బ్రిటిష్ ఇండియాలో ఒక జిల్లా సగటున నాలుగు వేల చదరపు మైళ్ల విస్తీర్ణం, 8 లక్షల జనాభాతో కూడి ఉండగా, దేశంలోని 562 సంస్థానాల్లో 454 సంస్థానాలు వెయ్యికంటే తక్కువ చదరపు మైళ్ల విస్తీర్ణం, లక్షకంటే తక్కువ జనాభాను మాత్రమే కలిగి ఉన్నాయని, వీటిలో 374 సంస్థానాలు లక్షరూపాయలకంటే తక్కువ వార్షికాదాయాన్ని కలిగి ఉన్నాయని అంబేడ్కర్ పేర్కొన్నారు. వీటిలో కొన్ని సంస్థానాలు ఎంత చిన్నవంటే వాటికి దక్కిన గౌరవం పట్ల ఎవరూ కనీస సానుభూతి కూడా చూపేవారు కాదు. 15 సంస్థానాలయితే ఒక చదరపు మైలు కంటే తక్కువ విస్తీర్ణంలో ఉండేవి. 27 సంస్థానాలు సరిగ్గా చదరపు మైలు విస్తీర్ణంలో ఉండేవి. 14 సంస్థానాలు ఒక్క సూరత్ జిల్లాలోనే ఉండేవి. వీటి వార్షికాదాయం సంవత్సరానికి 3 వేల రూపాయలకు పైబడి ఉండేది. వీటిలో మూడు రాష్ట్రాల్లో ఒక్కో దాని జనాభా నూరుకంటే తక్కువే. అయిదు సంస్థానాలకైతే వార్షికాదాయం వంద రూపాయలలోపే ఉండేదని అంబేడ్కర్ వివరించారు. సంస్థానాన్ని ప్రత్యేకంగా, స్వతంత్రంగా ఉంచడం ద్వారా ఆ సంస్థానాధిపతిని రాజాధిరాజుగా సంబోధిస్తూ నిత్యం సంతోషపెట్టడానికి ప్రయత్నించడం వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగమూ లేదని అంబేడ్కర్ ఆ సమావేశంలో తేల్చి చెప్పారు. సంస్థానాల పరిస్థితి ఇలా ఉండగా, స్వావలంబన లేకుండా, కుహనా దర్పంతో, గర్వంతో జీవిస్తున్న ఇలాంటి సంస్థానాధిపతులకు భారత యూనియన్‌లో చేరడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. కానీ రెండే రెండు సంస్థానాలు మాత్రం 1947 ఆగస్టు 17న స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. తాను భారత్‌ను వదిలి వెళుతున్నందున సార్వభౌమాధికారం అనేది ఇక చెల్లదని, తమ తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో సంస్థానాలు చేరవచ్చు లేక స్వతంత్రంగా ఉండవచ్చు అంటూ 1946లో బ్రిటిష్ కేబినెట్ మిషన్ చేసిన ప్రకటనతో ఈ గందరగోళం ఏర్పడింది. ఇదే విషయాన్ని 1947 జూన్ 3న మౌంట్‌బాటన్ మళ్లీ చెప్పారు. సార్వభౌమాధికారంపై న్యాయపరమైన స్పష్టత బ్రిటిష్ ప్రభుత్వ వైఖరిని అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. 1947 జూన్ 17న ఒక ప్రకటన చేస్తూ సంస్థానాలకు స్వాతంత్య్రాన్ని అనుమతించిన బ్రిటిష్ పాలకులపై అంబేడ్కర్ విరుచుకుపడ్డారు. అంబేడ్కర్ ప్రకటన నాటి పత్రికల్లో విస్తృతంగా ప్రచురితమైంది. సార్వభౌమాధికార సిద్ధాంతం ద్వారానే బ్రిటిష్ పాలకులు స్థానిక రాజ్యాలను నియంత్రించేవారు. సంస్థానాలపై సార్వభౌమాధికారం చలామణి అవుతూ వచ్చేది. అంబేడ్కర్ దీనిపైనే వాదిస్తూ, 1947 జూన్ 17 నాటికి భారత ప్రభుత్వం బ్రిటిష్ అధినివేశ ప్రతిపత్తికిందే ఉంటూ వస్తోందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, ఐర్లండ్ దేశాల్లాగే 1950 జనవరి 26 వరకు భారతదేశం బ్రిటిష్ వారి అధినివేశ ప్రతిపత్తి కిందే ఉండేది. భారత ప్రభుత్వం (నెహ్రూ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం) స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉన్నందున దానికి స్థిరమైన విశేష అధికారంతో చక్రవర్తికి సూచించగల ప్రత్యేక హక్కు ఉందని, ఆ సూచనను బ్రిటిష్ చక్రవర్తి తిరస్కరించలేరని అంబేడ్కర్ రాజ్యాంగ చట్టాన్ని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సార్వభౌమాధికారాన్ని వదులుకుంటూ బ్రిటిష్ ప్రభుత్వం సంస్థానాలకు స్వాతంత్య్రాన్ని మంజూరు చేయడం పట్ల అంబేడ్కర్ తప్పు పట్టారు. చక్రవర్తి తన ప్రత్యేకాధికార హక్కులను వదులుకోవడం లేక మరొకరికి అప్పగించడం చేయలేరని, చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని మరొకరికి (భారత ప్రభుత్వానికి) అప్పగించలేనట్లయితే, దాన్ని చక్రవర్తి వదులుకోలేరని కూడా అంబేడ్కర్ వాదించారు. ఈ ప్రాతిపదికన కేబినెట్ మిషన్, మౌంట్ బాటన్ ప్రకటనలు రద్దు చేయదగినవని అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. కొత్తగా అధికారంలోకి వస్తున్న ప్రభుత్వానికి అంతకు ముందటి ప్రభుత్వం చలాయించిన కొన్ని హక్కులు వారసత్వంగా సంక్రమిస్తాయని వారసత్వానికి సంబంధించిన అంతర్జాతీయ చట్టం చెబుతోందని అంబేడ్కర్ పేర్కొన్నారు. సార్వభౌమాధికారం నుంచి భారతీయ సంస్థానాలు తమను తాము విముక్తి చెందించుకోగల ఏకైక మార్గం ఏదంటే, సౌర్వభౌమాధికారాన్ని, రాజ్యాధికారాన్ని విలీనం చేయడమేనని అంబేడ్కర్ స్పష్టం చేశారు. స్వతంత్ర భారతదేశం సంస్థానాల స్వతంత్రతను గుర్తించదని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విదేశీ ప్రభుత్వాలుగా వాటి ఉనికిని భారత్ గుర్తించదని అంబేడ్కర్ హెచ్చరించారు. సంస్థానాల వక్రమార్గంపై అంబేడ్కర్ తీవ్ర హెచ్చరిక ఐక్యరాజ్యసమితి గుర్తింపును, రక్షణను పొందుతామని సంస్థానాలు ఆశించడం అంటే పిచ్చివాళ్ల స్వర్గంలో నివసించినట్లే కాగలదని అంబేడ్కర్ హెచ్చరించారు. సంస్థానాలపై తన అధికారాన్ని భారత్ చాటుకోవడాన్ని పక్కనపెట్టి ఐక్యరాజ్యసమితి సంస్థానాలను గుర్తిస్తుందా అని అంబేడ్కర్ సందేహం వ్యక్తపరిచారు. తమ పరిధిలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పర్చకుంటే విదేశీ దాడి నుంచి లేక అంతర్గత తిరుగుబాటు నుంచి భారతీయ సంస్థాన ప్రభుత్వాలకు ఐక్యరాజ్యసమితి ఎన్నటికీ సహకారం అందించదని, కాబట్టి వక్రమార్గం పడుతున్న భారతీయ సంస్థానాలు.. ఐక్యరాజ్యసమతి జోక్యం చేసుకుంటుదని ఆశలు పెట్టుకోలేవని అంబేడ్కర్ స్పష్టం చేశారు. సంస్థానాలకు మినహాయింపునిస్తూ 1946లో కేబినెట్ మిషన్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మౌనం పాటించిన సమయంలో అంబేడ్కర్ అందించిన న్యాయపరమైన స్పష్టత సంస్థానాలకు తలుపులు మూసివేసి భారత సంపూర్ణ ఏకీకరణకు దారి కల్పించింది. ఈ క్రమంలోనే ఊగిసలాటకు గురవుతూ వచ్చిన ట్రావెన్కోర్, జోధ్‌పూర్, బికనీర్, జైసల్మీర్, రాంపూర్, భోపాల్ సంస్థానాలు భారత్‌లో విలీనం కాగా, జునాగఢ్ సంస్థానం మాత్రం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లింది. 1947 జూన్ 17న తాను ప్రకటన చేసిన కొన్ని వారాల తర్వాత అంబేడ్కర్ భారత న్యాయశాఖ మంత్రిగా నెహ్రూ ప్రభుత్వంలో చేరడమే కాకుండా సంపూర్ణ ఏకీకరణ పూర్తి చేసుకున్న స్థిరమైన జాతిగా భారత్‌ను ముందుకు నడిపించారు. హైదరాబాద్ ఏకీకరణ ఆపరేషన్ని పోలీస్ యాక్షన్ అని పిలవాలని, దాన్ని భారత సైనిక చర్యగా పిలవవద్దని నెహ్రూకు సలహా ఇచ్చిన ఘనత కూడా అంబేడ్కర్‌కే దక్కుతుంది. తన రాజ్యాంగ పదవి ఆధారంగా, హైదరాబాద్‌ని భారత్‌లో విలీనం చేయడం ప్రభుత్వాధికారానికి సంబంధించిన అంతర్గత వ్యవహారమని గుర్తించబట్టే అంబేడ్కర్ హైదరాబాద్ విలీన చర్యను పోలీస్ యాక్షన్‌గానే పేర్కొన్నారు. వ్యాసకర్త: రాజశేఖర్ ఉండ్రు ,సీనియర్ ఐఏఎస్ అధికారి, రచయిత -
మన సంవిధానాన్ని రక్షించుకుందామా?
70 ఏళ్ల కిందట మన రాజ్యాంగానికి తుదిరూపు ఇచ్చిన రోజు నవంబర్ 26, 1949. ‘‘వి ద పీపుల్..’ మనం రూపొం దించుకుని మనకే సమర్పించుకున్న ఒక పరిపాలనా నియమావళి. మనకు ప్రాథమిక హక్కులు వచ్చిన రోజు. 70 ఏళ్ల తరువాత మనం ఆ సంవిధానం సక్రమంగా అమలు చేసుకుంటున్నామా లేక నియమాలన్నీ ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నామా అనేది జనం తేల్చుకోవాల్సి ఉంది. రెండు నెలల తరువాత ఆ సంవిధానం అమలు కావడం ప్రారంభమైన గణతంత్ర దినోత్సవం జనవరి 26. మన దేశం మరిచిపోలేని రోజు. కాని అనుకున్నంత గొప్పగా మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లలేదు. పోలీసులకు నేర పరిశోధన చేసేందుకు కావలసిన అధికారాలన్నీ ఉన్నాయి. నేరస్తుడనుకుంటే, నేరం చేసిన సంఘటనకు సంబంధించిన వివరాలు తెలిసి కూడా చెప్పలేదనుకుంటే అరెస్టు చేయవచ్చు. బంధించవచ్చు. కాని అమాయకుడిని అన్యాయం అరెస్టు చేస్తే? అతడిని ఎందుకుబంధించారో కారణాలు లేకపోతే ఎందుకు అరెస్టుచేసారో చెప్పకపోతే అది సమాచారం సమస్యా లేక, జీవన స్వేచ్ఛ ఉల్లంఘనా? లేక జీవితానికి సంబంధించిన విషయమా? జీవించే హక్కు ఉందని గ్యారంటీ ఇచ్చానని చెప్పుకునే సంవిధానం ఏమైపోయినట్టు? రాజ్యాంగ అధికరణం 21 ఉన్నట్టా లేనట్టా? జోగిం దర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యు.పి (1994) 4 ఎస్సిసి 260 కేసులో అరెస్టు చేయడమంటే సరైన సంతృప్తికరమైన సమంజసమైన కారణాలు, సమర్థ నీయమైన పరిస్థితులు ఉంటేనే అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు వివరించింది. మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువవుతున్నాయనే విమర్శల నేపథ్యంలో అనుసరించవలసిన నియమాలను సుప్రీంకోర్టు వివరించింది. అరెస్టు లేదా ఇంటరాగేట్ చేసే విధినిర్వహించే పోలీసు అధికారి అతని పేరును హోదాను గుర్తింపచేసే బిళ్లను ధరించాలి. ఒక రిజిస్టర్ లో ఆ అరెస్టుకు సంబంధించిన వివరాలను, అరెస్టు కాబడుతున్న వ్యక్తి వివరాలు నమోదుచేయాలి. అరెస్టు అయిన వ్యక్తి వివరాల మెమోతయారు చేయాలి. ఆ మెమోకు బందీ కుటుంబ సభ్యుడు గానీ ఆ ప్రాంతంలోని గౌరవనీయమైన వ్యక్తి గానీ సాక్షిగా సంతకం చేయాలి. ఆ మెమోపైన బందీ సంతకం ఉండాలి. దానిపైన అరెస్టయిన సమయం తేదీ కూడా ఉండాలి. ఇవన్నీ సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు. ఈ తీర్పులో ఉన్న అసలైన హక్కు సమాచార హక్కు. సమాచారం లేకపోతే బతికే హక్కు ఉండదు. వ్యక్తిగత స్వేచ్ఛ బతకదు. అరెస్టు చట్టబద్ధంగా ఉండాలని, చట్టబద్ధం కాని అరెస్టుచేస్తే పరిహారం ఉండాలని ఆర్టికిల్ 21 సారాంశం. ఈ తీర్పులోని అంశాలను నియమాలుగా మార్చి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను సవరించారు. అంటే తీర్పు అంశాలన్నీ సమాచార హక్కును ఇచ్చే చట్టబద్దమైన అంశాలుగా మారాయన్నమాట. సం విధానం వచ్చిన నవంబర్ 26 ఎంత గొప్పదో, గుర్తుంచుకోతగిందో అంత గొప్ప రోజు 12 అక్టోబర్ 2005. ఎందుకంటే ఆరోజు సమాచార హక్కు అమలులోకి వచ్చిన రోజు. సమాచారం అధికారుల కబంధ హస్తాలనుంచి బయటకు వచ్చేందుకు ఈ చట్టం ఉపయోగపడింది. కాని ఈ హక్కుకు 14వ సంవత్సరంలో గండం వచ్చిపడింది. అదే 2019 సవరణ. 12 అక్టోబర్‌ను గుర్తుంచుకొని దినోత్సవాలు చేసుకునే ప్రజలకు మరో పన్నెండు రోజుల తరువాత దారుణంగా గుర్తుంచుకునే చెడురోజును ఈ ప్రభుత్వం కానుకగా ఇచ్చింది. అదే అక్టోబర్ 24. ఈ రోజున సమాచార హక్కు చట్టాన్ని సవరించి నీరు కార్చి, కమిషన్లను కింది స్థాయి ఉద్యోగులుగా మార్చే నియమాలు అమలు లోకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం జనహితమైన మంచి హక్కును ఈ విధంగా నీరు కార్చి సంవిధానానికి అన్యాయం చేసింది. ఇంకా ఈ దెబ్బనుంచి కోలుకోకముందే సుప్రీంకోర్టు సమాచార హక్కు గురించి ప్రతికూలంగా గుర్తుంచుకునే మరో రోజును సృష్టించింది. అదే సమాచార హక్కును మరింత నిస్సారంగా మార్చి, హక్కు పరిధిని కుదించి, పరిమితులు పరిధులను అపరిమితంగా పెంచే తీర్పును ఇచ్చిన రోజు. మన సంవిధానాన్ని మనం రక్షించుకుందామా? వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ ఈ-మెయిల్: madabhushi.sridhar@gmail.com -
అశోక్ ఖేమ్కా మళ్లీ ట్రాన్స్ఫర్ అయ్యారు...
న్యూఢిల్లీ: హరియాణా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ముఖ్య కార్యదర్శి అశోక్ ఖేమ్కా మళ్లీ ట్రాన్స్ఫర్ అయ్యారు. అదేంటి ట్రాన్స్ఫర్ అయితే అందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఆయన ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయింది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అశోక్ తన 28 ఏళ్ల సర్వీసు కాలంలో ఏకంగా 53 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. హరియాణా ప్రభుత్వం తాజాగా ఆయన్ను ఆర్కైవ్స్ విభాగానికి ట్రాన్స్ఫర్ చేసింది. ఆఖరి సారిగా క్రీడలు, యువజన వ్యవహారాల విభాగంలో 15 నెలలపాటు పనిచేశాక ఆయన మార్చిలో ట్రాన్స్ఫర్ అయ్యారు. ‘మళ్లీ ట్రాన్స్ఫర్ అయ్యాను. రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్న మరుసటి రోజే సుప్రీంకోర్టు ఆదేశాలు, నియమాలు మరోసారి ఉల్లంఘనకు గురయ్యాయి. సర్వీసులో ఆఖరు దశకు చేరుకున్నాను. నిజాయితీకి దక్కిన గౌరవం ఇది’అని బుధవారం అశోక్ ట్వీట్‌చేశారు. -
అసెంబ్లీ సాక్షిగా సీఎం వర్సెస్ గవర్నర్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధాంకర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. మమత సర్కార్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందంటూ గవర్నర్ ధాంకర్ విమర్శలు గుప్పిస్తుండగా.. గవర్నరే సమాంతర ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారని మమత దీటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో 70వ వార్షికోత్సవం సందర్భంగా బెంగాల్ అసెంబ్లీలో జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య ఘర్షణకు వేదికగా నిలిచింది. రాష్ట్ర అసెంబ్లీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి తనను చివరి నిమిషంలో ఆహ్వానించడంతో గుర్రుగా ఉన్న గవర్నర్ ధాంకర్ బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వచ్చిన ఆయనకు సాదర స్వాగతం పలికేందుకు సీఎం మమత, స్పీకర్ బిమన్ బెనర్జీ వెళ్లారు. అయితే, మమతను మర్యాదపూర్వకంగా పలుకరించకుండా.. స్వాగతం పలికేందుకు వచ్చిన ఆమె పట్టించుకోకుండా గవర్నర్ ముందుకుసాగారు. గవర్నర్ అనూహ్యంగా తనను విస్మరించి ముందుకుసాగడంతో మమత నిర్ఘాంతపోయారు. అయినా సహనం కోల్పోకుండా ఒక అడుగు వెనుకకు వేశారు. గుంభనంగా ముందుకుసాగిన గవర్నర్ స్పీకర్‌తో కలిసి అసెంబ్లీలోకి వెళ్లారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చివరి నిమిషంలో తనకు ఆహ్వానం పంపడంపై గవర్నర్ అసంతృప్తి వెళ్లగక్కారు. అంతేకాకుండా తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని రెండుసార్లు ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా కశ్మీర్లో ఉగ్రవాదానికి, వేర్పాటువాదానికి వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ఇక, గవర్నర్ తన ప్రసంగంలో కేంద్ర, రాష్ట్రాల అధికారాలు, సమాఖ్య విధానం తదితర అంశాలను ప్రస్తావిస్తూ.. చివర్లో మమత సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజ్యాంగ అధిపతి పదవిని రాజీపడేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగం విన్న ప్రతిపక్షాలు బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధింబోతున్నారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంతో ఈ ఘర్షణ ముగిసిపోలేదు. ఆయన అసెంబ్లీని వీడి వెళుతుండగా.. టీఎంసీ ఎమ్మెల్యేలు జై బంగ్లా, జై హింద్ అంటూ నినాదాలు చేశారు. మమతతో మాట్లాడకుండానే గవర్నర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, తాను వెళుతుండగా టీఎంసీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంపై గవర్నర్ తీవ్ర ఆగ్రహానికి లోనైనట్టు తెలుస్తోంది. దీనిపై తన కారులో కూర్చున్న స్పీకర్‌ను ఆయన గట్టిగా హెచ్చరించినట్టు సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తన మారకపోతే తానే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు సమాచారం. ఇక, మమత కూడా గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెళ్లిన తర్వాత అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. ‘ఆయనలాగే ఎవరూ ప్రవర్తించరు. ప్రధాని మోదీ కూడా మేం కనిపిస్తే పలుకరిస్తారు. కానీ గవర్నర్ ప్రవర్తన చూడండి. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారన్న సంగతి తెలుసు. ఆయనను ఏ ఉద్దేశంతో రాష్ట్రానికి పంపించారో కూడా తెలుసు’ అంటూ మమత తప్పుబట్టారు. -
అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా జగన్ పాలన
సాక్షి, రాజమహేంద్రవరం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఆయన మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని రివర్ బే హోటల్లోని మినీకాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమోదించి నేటికి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా ముందుగా ఆయనకు మంత్రి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడుకు రాజ్యాంగానికి తూట్లు పొడిచారని, ఆయనకు రాజ్యాంగ స్ఫూర్తిపై మాట్లాడే నైతికత లేదన్నారు. గడిచిన ఆర్నెల్లలో 1.40 లక్షల ఉద్యోగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. అందులో కనీసం పదిశాతం ఉద్యోగాలనైనా తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఇవ్వలేదన్నారు. అమెరికాలో పుట్టి ఉంటే బాగుండును, దళితులుగా ఎవ్వరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని రాజ్యాంగం గురించి మాట్లాడతారని ప్రశ్నించారు. పుట్టిన రోజుకు, వర్ధంతికి తేడా తెలియన లోకేష్ ఇంట్లో కూర్చుని రాజ్యాంగం గురించి ట్వీట్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా పెరిగితే ఒక్క మన రాష్ట్రంలోనే పెరిగినట్టు గగ్గోలు పెట్టడం చంద్రబాబుకి, లోకేష్‌కే చెల్లిందన్నారు. ‘లోకేష్‌ను సూటిగా అడుగుతున్నా.. మీ హెరిటేజ్‌లో ఉల్లి రేటు ఎంత ఉందో చెబుతావా? ఎంతకు కొని వినియోగదారులకు ఎంతకి అమ్ముతున్నారో చెప్పగలవా?’ అన్నారు. ఉల్లి ధరలు పెరిగితే వాటిని ప్రజలకు అందించటానికి రైతు బజార్లులో కేజీ రూ. 25 విక్రయించడం కనబడటం లేదా అని అడిగారు. అమరావతిలో రాజధానిని నిర్మించినట్టు, దానిని మేము పాడు చేస్తున్నట్టు మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. అసలు అమరావతిలో రాజధాని ఎక్కడ ఉందని, అక్కడ ఉన్నదంతా గ్రాఫిక్స్ కదా అని వ్యాఖ్యానించారు. అమరావతిలో నాలుగు బిల్డింగ్స్ కట్టి 7 వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు. మద్యంపై ఒక స్టాండ్ లేకుండా చంద్రబాబు అండ్ కో మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం సిటీ, రూరల్ కో ఆర్డినేటర్లు శ్రిఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ రావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు పాపారాయుడు, మిందే నాగేంద్ర పాల్గొన్నారు. -
‘రాజ్యాంగానికి అనుగుణంగా అందరికీ న్యాయం’
అమరావతి : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. 70 సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ నేతృత్వంలో గొప్ప వ్యక్తులు ప్రసాదించిన భారత రాజ్యాంగం మనల్ని బలోపేతం చేస్తోందని అన్నారు. రాజ్యాంగ సూత్రాల ప్రామాణికంగా అందరికీ రాజకీయ, సామాజికార్ధిక న్యాయం జరిగేందుకు కట్టుబడాలని ఈ సందర్భంగా మనమంతా ప్రతినబూనాలని వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. -
కోట్ల మంది కలిసి ఉండడానికి కారణం అదే : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని 130 కోట్ల మంది కలిసి మెలిసి ఉండడానికి రాజ్యాంగమే కారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మంగళవారం 70వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను కొనియాడారు. రాజ్యాంగం మనకు వెలుగునిచ్చే దీపిక, ఎందరో వీరుల త్యాగానికి ప్రతీక అని చెప్పారు. రాజ్యాంగం ప్రమాదంలో పడినప్పుడు ప్రజలే రక్షించారని, ఇక ముందు కూడా రక్షించుకుంటారని వ్యాఖ్యానించారు. సేవాభావం కన్నా కర్తవ్యం గొప్పదని ప్రబోధించారు. 70 ఏళ్ల క్రితం రాజ్యాంగ నిర్మాణంలో ప్రత్యక్ష, పరోక్ష పాత్రధారులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు ఇదే రోజు ముంబైలో ఉగ్రదాడులు జరగడం బాధాకరమని, మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రభుత్వ పెద్దలు పాల్గొన్నారు. కాగా, మహారాష్ట్రలో బీజేపీ వైఖరికి నిరసనగా కాంగ్రెస్, శివసేన పార్టీలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. పార్లమెంట్ వెలుపల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యాంగాన్ని చదవి, తన నిరసనను తెలియజేశారు. -
తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలి: గవర్నర్
సాక్షి, హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన సందర్భంగా ప్రతి ఏటా నవంబర్ 26న ఈ వేడుకలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ హై కోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్. మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతోపాటు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం గాంధీ, అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గవర్నర్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతీ పౌరుడికి మన రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను గుర్తు చేసుకుంటూ.. ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాజ్యాంగం కల్పిస్తున్న చట్టాల గురించి నేటి యువతకు పూర్తి అవగాహన లేదని, ప్రతి ఒక్కరూ తమ హక్కులు, విధుల గురించి తప్పని సరిగా తెలుసుకోవాలని సూచించారు. దేశ, రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని.. ఎన్నాళ్లు బతుకున్నామో కాదు.. ఎలా బతుకుతున్నామన్నదే ముఖ్యమన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాజ్‌భవన్‌లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నందుకు గవర్నర్‌కు అభినందనలు తెలిపారు. భారత్‌ది డైనమిక్ రాజ్యాంగమని, అనేక మార్పులు, చేర్పులకు లోనైందని ప్రస్తావించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందన్నారు. రాజ్యాంగం 7 దశాబ్దలుగా పరిపుష్టంగా కొనసాగుతోందని, రాజ్యాంగ స్ఫూర్తితో మన కర్తవ్యాన్ని నిర్వహించుకుందాం. భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. -
రాజ్‌భవన్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
సాక్షి, అమరావతి : భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి నేటికి 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జ్యోతి ప్రజ్వలన చేసి రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ విశ్వభూషన్ , మంత్రులు అబ్కేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ మాట్లాడుతూ.. రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కల్పించిందని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. దేశ సమగ్రత దెబ్బతీసే విధమైన చర్యలను ఉపేక్షించకూడదన్నారు. హక్కులకు భంగం కలిగితే ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చునని సూచించారు. ‘న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థలు ప్రజలకు రక్షణా ఉంటాయి. సమస్యలు ఎన్నిఉన్నా.. పౌరులు తమ హక్కులను పరిరక్షించడమే కాకుండా వారి బాధ్యతలను నిర్వర్తించాలి. స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ చేసి అహింసా పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి’ అని గవర్నర్ అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ.. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శమని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ప్రాధమిక హక్కులు ఉండాలని ఆకాంక్షించారు. బడుగు, బలహీన వర్గాలకు మెరుగైన విద్యను అందించడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపడం బాధ్యతగా భావించాలని కోరారు. అందుకే ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమం ద్వారా అమ్మలకు చేయూతను ఇస్తుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించి అంటరానితనం రూపుమాపేందుకు కృషి చేశారని ప్రశంసించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టో తయారు చేశారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నవరత్నాలు ద్వారా అన్ని వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. అవినీతి లేని ఆంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చేయడమే సీఎం జగన్ లక్ష్యమని, ఆ దిశగా పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. -
రాజ్యాంగం.. ఓ కరదీపిక
సాక్షి, ఖమ్మం : సుదీర్ఘకాలం పరాయి పాలనలో మనదేశం ఉన్నది. ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర భారతంగా అవతరించింది. ఆ తర్వాత ప్రతి స్వతంత్ర దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి. రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక వంటిది. ఈ దీపస్తంభపు వెలుగుల్లో సర్వసత్తాక సార్వభౌమాధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలి. అందుకనే రాజ్యాంగానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానముంది. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశానికంటే ముందే అనేక దేశాలు రాజ్యాంగాలను రచించాయి. భారత రాజ్యాంగ రచన ఒక సంక్లిష్టం. దీనికి కారణం దేశంలో అనేక మతాలు, తెగలు, ఆదివాసీలు, దళితులు, అణగారిన, పీడనకు గురైన వర్గాలు ఉన్నారు. వీరి ఆకంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ రచన ఒక సవాల్ లాంటిది.ఈ నేపథ్యంలో భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ సారధిగా కమిటీ ఏర్పాటైంది. రాజ్యాంగ రూపకర్తఅంబేడ్కర్ భిన్నత్వ సమ్మిళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారు. కమిటీలోని ఆరుగురు సభ్యులు మేథోమధనం నిర్వహించి కోటి రూపాయల ఖర్చుతో ప్రపంచంలోనే పెద్దదైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. 1947 నవంబర్ 26న అప్పటి అసెంబ్లీ దీనిని ఆమోదించింది. కులాలు, విభిన్న మతాలు, రకరకాల ఆచార వ్యవహారాలు సంఘటిత భారతావనికి స్వపరిపాలనా రూపకల్పన రాజ్యాంగ బద్ధం చేశారు. అంబేడ్కర్ చైర్మన్‌గా ఉన్న కమిటీలో పండిత్ గోవింద్ వల్లభ్‌పంత్, కె.ఎం.మున్నీ, అల్లాడి కృష్ణస్వామిఅయ్యర్, ఎన్.గోపాలస్వామి, అయ్యంగార్, బీఎల్.మిట్టర్, ఎండీ సాదుల్లా, డీపీ.ఖైతావ్ సభ్యులుగా ఉండగా.. ఖైతావ్ మరణం అనంతరం టీటీ కృష్ణమాచారి పర్యవేక్షణలో రెండు సంవత్సరాల 11నెలల 11 రోజులు కష్టపడి తయారు చేసిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతిపాదించి ప్రవేశపెట్టారు. 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవం.. కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ప్రతి ఏటా నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో ఈ రోజు రాజ్యాంగం గురించి తెలిసిన అనుభవజ్ఞులచే ఉపన్యాసాలు, వ్యాసరచన తదితర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ రాజ్యాంగం ఏర్పడిన 66 ఏళ్ల తర్వాత తొలిసారిగా రాజ్యాంగం ఆమోదిత దినోత్సవాన్ని 2015, నవంబర్ 26న జరుపుకుంది. రాజ్యాంగం పీఠిక ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారాలి. అదే మన లక్ష్యం. మన రాజ్యాంగాన్ని మరింతగా తెలుసుకునేలా ఈ రోజు మనకు స్ఫూర్తినివ్వాలి. -
రాజ్యాంగం పవిత్ర గ్రంథం: రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాజ్యాంగం ఇచ్చే సలహాలు, సూచనలను పెడచెవిన పెడితే.. తీవ్ర భిన్నాభిప్రాయానికి, గందరగోళానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజయ్ గొగోయ్ హెచ్చరించారు. రాజ్యాంగాన్ని పాటించడం దేశ ప్రయోజనాలకు మంచిదన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ‘కాన్‌స్టిట్యూషన్‌డే సెలబ్రేషన్స్’లో సోమవారం ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర భారతదేశ ఆధునిక పవిత్ర గ్రంధం అని రాజ్యాంగాన్ని రాష్ట్రపతి అభివర్ణించారు. వ్యక్తిగత, ప్రజా జీవితాల్లో రాజ్యాంగ ప్రవచిత అంశాలను విధిగా పాటించాలన్నారు. రాజ్యాంగం బోధించే విలువలకు కట్టుబడి ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. -
రాజ్యాంగమే రక్ష
దేశ చరిత్రలో నవంబర్ 26 చాలా ముఖ్యమైన తేదీ. అరవై ఎనిమిది సంవత్సరాల కిందట స్వతంత్ర భారతానికి రాజ్యాంగం రూపుదిద్దుకొని రాజ్యాంగసభ ఆమోదం పొందిన రోజు. సంవిధాన్ దివస్. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబయ్ నగరంపైన దాడి చేసి 166 మందిని హత్య చేసి, సుమారు 300 మందిని గాయపరచిన దుర్దినం కూడా ఇదే కావడం విశేషం. లష్కరే తొయ్యబా, జమాత్–ఉద్–దవా అధినేత హఫీజ్ మహమ్మద్ సయీద్ నేతృత్వంలో పాకిస్తాన్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు సముద్రమార్గంలో ముంబయ్ తీరానికి చేరుకొని దేశ ఆర్థిక రాజధానిపైన పైశాచికంగా దాడి చేసి అమాయకులను చంపివేసిన ఘటన జరిగి సరిగ్గా పదేళ్ళు. దేశ పరిపాలనకు దిక్సూచిగా సంవిధానం రచించుకొని, దాని ప్రాతిపదికగా దేశ సమైక్యతనూ, సమగ్రతనూ పరిరక్షించుకోవాలని సంకల్పం చెప్పుకున్న రోజే పాకిస్తాన్ ముష్కరులు దేశ ఆర్థిక రాజధానిపైన ఉగ్రపంజా విసరడం, విధ్వంసం సృష్టించడం దేశ ప్రజలను నిర్ఘాంతపరిచింది. ముంబయ్ దాడి నుంచి మనం ఎటువంటి గుణపాఠాలు నేర్చుకున్నామో సమీక్షించుకోవలసిన సందర్భం ఇది. అదే విధంగా రాజ్యాంగపాలన ఎంత సమర్థంగా సాగుతున్నదో పరిశీలించుకొని రాజ్యాంగస్పూర్తితో పరిపాలన నిరాఘాటంగా, జనామోదంగా సాగే విధంగా భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరించవలసిన సమయం కూడా ఇదే. నిజానికి మన దేశ భద్రతకూ, సమగ్రతకూ అవినాభావ సంబంధం ఉన్నది. సమగ్రత సమైక్యతపైన ఆధారపడి ఉంటుంది. ముంబయ్‌పైన ఉగ్రదాడి జరిగిన తర్వాత మరోదాడి అంత స్థాయిలో జరగలేదు. కానీ పాకిస్తాన్ భూభాగంలో శిక్షణ పొందిన ఉగ్రవాదులు కశ్మీర్లో రక్తపాతం సృష్టిస్తూనే ఉన్నారు. భద్రతావ్యవస్థను బలోపేతం చేసుకోవడం పరమావధి. ఏడున్నర వేల కిలోమీటర్ల పొడవున్న కోస్తాతీరంలో భద్రత పెంపొందించడానికి చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చిన దాఖలా లేదు. కోస్తాను అనుకొని ఉన్న ఏడు రాష్ట్రాల, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకీ, దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థకీ, కోస్టల్గార్డ్కీ, నావికాదళానికీ మధ్య సమన్వయం ఇప్పటికీ లేదని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ముంబయ్‌పైన దాడి చేయించిన సూత్రధారులకు పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్నదనేది వాస్తవం. హఫీజ్‌ను ఉగ్రవాదిగా పరిగణించాలని ఇండియాతోపాటు అమెరికా, తదితర దేశాలు తీర్మానిస్తే చైనా అందుకు అడ్డుతగిలి పాకిస్తాన్‌ను గుడ్డిగా సమర్థిస్తున్నది. ముంబయ్‌పైన దాడి చేయడానికి పథకం రచించినవారిని పట్టిచ్చినవారికి భారీ బహుమతి ఇస్తానంటూ అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. బ్యాంకులను నట్టేట ముంచిన ఆర్థిక నేరస్తుల అరాచకాలను లండన్ కోర్టులో నిరూపించడానికి ప్రయత్నిస్తున్నట్టే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న విషయాన్ని చైనాకు వివరించడానికీ, అంతర్జాతీయ వేదికలపైన చర్చనీయాంశం చేయడానికి విశేషమైన కృషి జరగవలసిన అవసరం ఉన్నది. కశ్మీర్లో శాంతి పునరుద్ధరణ అత్యవసరం. దౌత్య యంత్రాంగాన్ని పటిష్టం చేయవలసిన అగత్యం ఉంది. దేశంలో పెరుగుతున్న ఆరాచక వాతావరణం ఆందోళన కలిగిస్తున్నది. రాజ్యాంగస్పూర్తిని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్య ప్రియులందరూ ప్రయత్నించాలి. రాజ్యాంగస్పూర్తికి విఘాతం కలిగించే ధోరణులను అరికట్టడానికి సర్వశక్తులూ వినియోగించాలి. మతం, కులం, ప్రాంతం, భాష పేరుతో సమాజంలో చీలికలు తెచ్చే దుర్మార్గపుటాలోచనలను ప్రతిఘటించాలి. ‘ధర్మసభ’ పేరుతో సోమవారంనాడు అయోధ్యలో సుమారు 50 వేల మంది గుమికూడటం, అక్కడ ఆయుధబలగాలను మోహరించడం, 1992లో బాబ్రీమసీదు విధ్వంసం తర్వాత జరిగినట్టు హింసాకాండ జరుగుతుందనే భయంతో ముస్లిం కుటుంబాలు కొన్ని అయోధ్య ప్రాంతం నుంచి పారిపోయి ఎక్కడో తలదాచుకోవడం ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు. మందిర వివాదంలో న్యాయవ్యవస్థపైన వ్యాఖ్యలు చేయడం కూడా సమర్థనీయం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి ఎవరు పూనుకున్నప్పటికీ అది క్షమార్హం కాని నేరమే. ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టే నాలుగు స్తంభాలూ బీటలు వారాయి. ప్రజాస్వామ్య వ్యవస్థను ఉపయోగించుకొని ఉన్నత పదవులు పొందినవారే అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు. తాము స్వయంగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్నీ, దేశాన్నీ రక్షిస్తామంటూ బయలు దేరిన బూటకపు ప్రజాస్వామ్యవాదుల నిజస్వరూపం బయటపెట్టడమూ అవసరమే. ఇతర పార్టీల టిక్కెట్లపైన ఎన్నికలలో గెలిచినవారిని కొనుగోలు చేసి పార్టీ ఫిరాయింపుల చట్టాన్న కుళ్ళపొడిచినవారిని తప్పుపట్టని, శిక్షించని వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకం కావడంలో ఆశ్చర్యం ఏమున్నది? ఎన్నికల సమయంలో మర్యాదలు మట్టికరుస్తున్నాయి. రాజ్యాంగ విలువలను పునరుద్ధరించేందుకు ప్రజలు కంకణబద్ధులు కావాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లితే విచ్ఛిన్నకరశక్తులు వీరంగం వేస్తాయి. అధికారంలో ఉన్నవారే రాజ్యాంగస్పూర్తిని తు.చ. తప్పకుండా పాటించాలి. రాజ్యాంగ సంస్థలనూ, ప్రక్రియలనూ గౌరవించడం ద్వారా శాంతిసుస్థిరతలకు దోహదం చేయాలి. అధికారాలు మాత్రమే కాకుండా బాధ్యతలు గుర్తెరిగి ప్రజలందరూ వ్యవహరిస్తేనే 130 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం ప్రశాంతంగా ఉంటుంది. అనేక మతాలూ, కులాలూ, సంస్కృతులూ, భాషలూ, ప్రాంతాలూ కలిగి భిన్నత్వంలో ఏకత్వం సిద్ధాంతంపైన మనుగడ సాగిస్తున్న దేశాన్ని రాజ్యాంగం మాత్రమే సమైక్యంగా ఉంచగలదు. రాజ్యాంగమే రక్ష. రాజ్యాంగాన్ని పవిత్రగ్రంథంగా భావించి శిరసావహించాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజిత్ గొగోయ్ చెప్పినట్టు రాజ్యాంగం అర్భకులకు రక్షణ కల్పించే కవచం. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్నూ, ఆయన సామాజిక–రాజకీయ దృక్పథాన్నీ అర్థం చేసుకొని ప్రచారం చేస్తామనీ, రాజ్యాంగస్పృహను పెంపొందిస్తామని దేశ ప్రజలు ప్రతిజ్ఞ చేయవలసిన సందర్భం ఇది. -
బాబా సాహెబ్ అంబేద్కర్‌ను స్మరించిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్‌ను స్మరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. దేశంలో ప్రజాస్వామిక విలువలకు పునాది వేస్తూ.. రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు అంబేద్కర్ అని ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేద్దామంటూ ప్రతిజ్ఞ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. -
లింగమనేని నిర్మాతగా.. పవన్ యాక్షన్
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అందిస్తుంటే.. లింగమనేని నిర్మాతగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ యాక్టింగ్ చేస్తున్నారని వైఎస్సార్ సీపీ విశాఖ నగర అధ్యక్షులు మళ్ల విజయప్రసాద్ విమర్శించారు. టీడీపీ వ్యతిరేక ఓట్లు వైఎస్సార్ సీపీకి రాకుండా ఉండేందుకే పవన్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం రాజ్యాంగ ఆవిష్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ ఐదు కిలోమీటర్లు నడిస్తే అపసోపాలు పడతారని అన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం మూడు వేల కిలోమీటర్లకుపైగా నడిచారని తెలిపారు. పవన్ ఇల్లు నిర్మించిన స్థలం లింగమనేనిది కాదా అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక భవనాల పేరిట కోట్ల రూపాయలు వృథా చేస్తున్న పవన్ నోరు మెదపరని మండిపడ్డారు. బాక్సైట్ కోసం మాట్లాడే అర్హత పవన్ లేదన్నారు. నాడు గిరిజనులు నష్టపోతారని వైఎస్సార్ బాక్సైట్ తవ్వకాలు నిలిపివేస్తే.. ఇప్పుడు వైఎస్ జగన్ చింతపల్లిలో సభ పెట్టి గిరిజనులకు బాసటగా నిలిచారని అన్నారు. జననేతపై అసత్య ఆరోపణలు చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు ఎంవీవీ సత్యనారాయణ, రమణ మూర్తి, శ్రీనివాస్ వంశీకృష్ణ, నాగిరెడ్డి, అధికార ప్రతినిధులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, జాన్ వెస్లీ, మహిళ విభాగం ప్రతినిధి షీలా వెంకట లక్ష్మీ, నాయకులు కొండా రాజీవ్, శ్యామ్ కుమార్‌రెడ్డి, బోని శివరామకృష్ణ, పక్కి దివాకర్‌లు పాల్గొన్నారు. -
అంబేద్కర్‌కు వైఎస్సార్సీపీ నివాళులు
హైదరాబాద్ : వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ దినోత్సవంపై ప్రసంగించిన నేతలు అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మేరుగ నాగార్జున, భూమన కరుణాకర్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, చల్లా మధు, పుత్తా ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగంలో ఏముంది.. అసలేం జరుగుతోంది?
'భారతీయులందరి శ్వాస'గా అభివర్ణించే రాజ్యాంగం ఏం చెబుతోంది. ఎన్నో హక్కులతో పాటు భావప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, సమాజంలో గౌరవప్రదంగా బతికే హక్కును కల్పిస్తోందని నాటి రాజ్యాంగ పరిషత్ సభ్యులైన జవహర్లాల్ నెహ్రూ, బీఆర్ అంబేద్కర్, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్ తదితరులు నిర్వచనం ఇచ్చారు. కులం, మతం, లింగ, పుట్టుక వివక్షతతో సంబంధం లేకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని విశ్వసిస్తూ అన్నివర్గాల ప్రజల సమష్టి మనోభావాలను గౌరవించాలని, సమానత్వం, న్యాయం, స్వాతంత్య్రం ప్రాతిపదిక భారతీయత అనే భావాన్ని పరిరక్షించేందుకు ప్రజల కోసం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కృషిచేయాలని రాజ్యాంగం చెబుతోంది. బీఆర్ అంబేద్కర్ 125 జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తొలిసారిగా గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాజ్యాంగ లక్ష్యాలు, ఆదర్శాలను అమలు చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మోదీ దేశ ప్రజలకు ట్విట్టర్ సందేశం ఇచ్చారు. అసలు ఇప్పుడేం జరుగుతోంది? నీతులు వల్లిస్తున్న ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి, నియమావళికి కట్టుబడి పనిచేస్తోందా? కొన్ని నెలలుగా దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ఉండటమే దీనికి సమాధానం. 2014 మే నుంచి 2015 మే వరకు మైనారిటీలకు వ్యతిరేకంగా దేశంలో 600 హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిలో ముస్లింలకు వ్యతిరేకంగా 406, క్రైస్తవులకు వ్యతిరేకంగా మిగతావి జరిగాయి. దాద్రి, ఉధంపూర్, ఉచెకాన్ మోయిబా తాంగ్కాంగ్ (మణిపూర్) సంఘటనలు వాటిలో మరీ తీవ్రమైనవి. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఓ మనిషి ప్రాణం తీసిన సందర్భాలూ ఉన్నాయి. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం చెలరేగుతున్న విషయం తెల్సిందే. ఈ అసహనం దళితులకు వ్యతిరేకంగా దాడులకు కూడా దారితీసింది. 2014లో దళితులకు వ్యతిరేకంగా 47,064 సంఘటనలు నమోదయ్యాయి. గత ఏదాడితో పోలిస్తే దళితులపై దాడులు 19 శాతం పెరిగాయి. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంఘ పరివారం ఈ దాడులకు పాల్పడిందన్న ఫిర్యాదులు ఉన్నాయి. రాజ్యాంగ విధుల ప్రకారం ఇలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా నివారించడం, జరిగిన కేసుల్లో దోషులకు శిక్ష పడేలా కఠినంగా వ్యవహరించడం అధికారంలో ఉన్న కేంద్రం బాధ్యత. శాంతిభద్రత పట్ల ప్రజలకు విశ్వాసం కలిగించడం కూడా ప్రభుత్వ ధర్మం. అయితే ఇప్పటి ప్రభుత్వం మౌనం వహిస్తూ బాధ్యతలను విస్మరిస్తోందన్నది విపక్షాల విమర్శ. సమాజంలోని కొన్ని శక్తులు రాజ్యాంగాన్ని విశ్వసించకపోవచ్చు. రాజ్యాంగ నియమ నిబంధనల పట్ల వారికి ఇసుమంత గౌరవం కూడా లేకపోవచ్చు. సాక్షాత్తు నరేంద్ర మోదీ తన గురువుగా చెప్పుకొనే ఎమ్మెస్ గోవాల్కర్ రాజ్యాంగ ప్రతిని తగులబెట్టమని ఓ సందర్భంలో పిలుపునిచ్చారు. దీనికి బదులు 'మనుస్మృతి'ని భారత రాజ్యాంగంగా చేస్తే అంగీకరించేవాడినని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ప్రభుత్వాలకు మాత్రం రాజ్యాంగాన్ని తు.చ. తప్పక పాటించాల్సిన బాధ్యత ఉంది. సర్వమత సమానత్వానికి కృషిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. 'గురూజీ: ఏక్ స్వయం సేవక్' అనే పేరిట ఎమ్మెస్ గోవల్కర్ జీవితంపై 2010లో పుస్తకం రాసిన నరేంద్ర మోదీలో రాజ్యాంగ స్ఫూర్తి ఏ మేరకు ఉందో కాలమే చెప్పాలి! -
గుంటూరులో 26న రాజ్యాంగ పరిరక్షణ దినం
-
26న రాజ్యాంగ ఆమోద దినోత్సవం