రాజ్యాంగ ఆమోద దినోత్సవం.. వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ | YSRCP Chief YS Jagan Tweets On 75th Constitution Day Of India | Sakshi
Sakshi News home page

ప్రాముఖ్యత కల్గిన రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలి: వైఎస్‌ జగన్‌

Published Tue, Nov 26 2024 9:40 AM | Last Updated on Tue, Nov 26 2024 10:15 AM

YSRCP Chief YS Jagan Tweets On 75th Constitution Day Of India

తాడేపల్లి:  రాజ్యాంగానికి ఆమోదముద్ర పడ్డ చరిత్రాత్మక ఘట్టానికి  75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు.

‘మన రాజ్యాంగం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుంది. అలాంటి ప్రాముఖ్యత కల్గిన రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ గుర్తించాలి.ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్నది. వీటి పనితీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతున్నాయి. 

అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్ వైపు ఎందుకు వెళ్లకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాదు.. ఉన్నట్టుగా కూడా కనబడాలి. అందరి ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్ర్యం కొంతకాలంగా అణచివేయబడుతోంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సహా రాజ్యాంగాన్ని రూపొందించిన మన దార్శనిక నాయకులు సమానత్వం వైపు నడిపించారు’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement