‘ఏపీలో అంబేద్కర్‌ రాజ్యాంగం అమలు కావడం లేదు’ | 75th constitution day: YSRCP Takes On Chandrababu And His Government | Sakshi
Sakshi News home page

‘ఏపీలో అంబేద్కర్‌ రాజ్యాంగం అమలు కావడం లేదు’

Published Tue, Nov 26 2024 12:02 PM | Last Updated on Tue, Nov 26 2024 1:28 PM

75th constitution day: YSRCP Takes On Chandrababu And His Government

కర్నూలు జిల్లా:  ఆంధ్రప్రదేశ్‌లో అంబేద్కర్‌ రాజ్యాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూట్లు పొడిచారని మండిపడ్డారు  కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి,.కేవలం చంద్రబాబు తన రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని మాత్రమే రాష్ట్రంలో అమలు చేస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.  

గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిందని, ఇంటి వద్దకే సంక్షేమ పాలనతో పాటు సంక్షేమ పథకాలు అందించిన సంగతిని ఎస్వీ మోహన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ రోజు సంక్షేమ పథకాలు లేవు, రాజ్యాంగానికి విరుద్ధంగా పాలనను చంద్రబాబు సాగిస్తున్నారంటూ విమర్శించారు.

‘సోషల్‌ మీడియా పోస్టులకు లైక్‌ కొట్టిన వారిపై నాన్‌ బెయిల్‌బెల్‌ కేసులు’
ఏపీలో నిరంకుశ, దుర్మార్గ పాలన సాగుతోందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా తునిలో ఘనంగా 75వ భారత జ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు  మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో గత ఆరు నెలలుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా పాలన జరుగుతోంది. ప్రత్యర్థులను అణిచివేసే ధోరణి చాలా నిరంకుశంగా జరుగుతోంది. 

తునిలో 17 మందిపై అక్రమ కేసులు పెట్టారు. సోషల​ మీడియాలో పోస్ట్‌ను లైక్‌ చేసిన వారిపై నాన్‌ బెయిల్‌బెల్‌ కేసులు పెట్టారు. పసుపు చొక్కా లేసుకుని ఉద్యోగాలు చేయొద్దని పోలీసులను కోరుతున్నాను. గత పదేండ్ల కాలంలో వైఎస్సార్‌సీపీ  ఒక పర్సంటేజ్‌సోషల్‌ మీడియా పోస్టులు పెడితే, టీడీపీ, జనసేన 99 శాతం అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారు. తునిలో మామ-అల్లుళ్ల పాలన కొనసాగుతోంది. అల్లుడు గల్లా పెట్టె దగ్గర కూర్చుంటే.. మామ యనమల అమాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు.

ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement