
సాక్షి, అమరావతి: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, శాసన సభాపతి తమ్మినేని సీతారాం పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈకార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్,ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్, ఎస్‌బి.అంజాద్ బాషా, పాముల పుష్పశ్రీ వాణి, మంత్రులు పినిపే విశ్వరూప్,మేకతోటి సుచరిత, తానేటి వనిత, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పల రాజు, వెలంపల్లి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస వేణు గోపాల కృష్ణ,పేర్ని వెంకట్రామయ్య, బుగ్గన రాజేంద్ర నాధ్, కురసాల కన్నబాబు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
చదవండి: Tirupati Water Tank Incident: తిరుపతిలో వింత ఘటన.. చూసేందుకు ఎగబడుతున్న జనం
Comments
Please login to add a commentAdd a comment