గ్రామ, వార్డు సచివాలయ రిజర్వేషన్లపై కుస్తీ | AP Grama Sachivalayam Merit List Divided As Reservation In Chittoor | Sakshi
Sakshi News home page

గ్రామ, వార్డు సచివాలయ రిజర్వేషన్లపై కుస్తీ

Published Mon, Sep 23 2019 11:48 AM | Last Updated on Mon, Sep 23 2019 11:48 AM

AP Grama Sachivalayam Merit List Divided As Reservation In Chittoor - Sakshi

రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలుపై అధికారులతో సమావేశమైన కలెక్టర్‌ నారాయణభరత్‌గుప్త

సాక్షి, చిత్తూరు : గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శి పోస్టులకు సంబంధించి పొరబాట్లు లేకుండా, అవకతవకలకు తావివ్వకుండా పారదర్శకమైన ఎంపిక జాబితాను తయారు చేసేం దుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గ్రామ సచివాలయాల ఫలితాలు విడుదలై మూడు రోజులు కావస్తోంది. ఫలితాలైతే విడుదలయ్యాయి కానీ.. అర్హుల జాబితా ఆలస్యమవుతోంది. దీంతో అర్హత పొందిన అభ్యర్థుల్లో ఉత్కంఠ ఎక్కువవుతోంది. తమ కేటగిరీలో మెరిట్‌ ఎంత? ఏ స్థానంలో ఉన్నామో? తమకు ఉద్యోగం వస్తుందా? అనే సందేహాలతో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జిల్లా ఎంపిక జాబితా కలెక్టరేట్‌కు వచ్చేసింది. ఆ జాబితాను ఆయా శాఖలకు అందజేసి మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రెండు రోజులుగా కుస్తీ పడుతున్న అధికారులు
జిల్లాకు అభ్యర్థుల అర్హుల జాబితా చేరినప్పటి నుంచి అధికారులు ఎంపిక జాబితాను తయారు చేసేందుకు రాత్రింబవళ్లు కుస్తీ పడుతున్నారు. అర్హుల జాబితాను అనుసరించి మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించి ఎంపిక జాబితాను తయారు చేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియపై శనివారం, ఆదివారం కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్‌ నారాయణభరత్‌గుప్త ఆదివారం కలెక్టరేట్‌లో ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలులో ఏమైనా పొరబాట్లు జరిగితే ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కౌన్సెలింగ్‌ సమయం తక్కువగా ఉండడంతో అధికారులు కసరత్తు చేయలేకపోతున్నారు. సోమవారం సాయంత్రం వరకు సాగుతుందని అధికారులు అంటున్నారు. అనంతరం ఎంపిక జాబితాను వెబ్‌సైట్‌లో, ఎంపికైన అభ్యర్థుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు, మెయిల్స్‌కు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కాల్‌లెటర్స్‌ను పంపుతామని వెల్లడించారు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పక్కాగా, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ సాగుతోందని జిల్లా ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు.

అధిక పోటీ బీసీల్లోనే
జిల్లాలో సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో అధిక శాతం బీసీ సామాజిక వర్గానికే చెందిన వారే ఉండడం గమనార్హం. దీంతో అధిక పోటీ వారి మధ్యనే కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సీలకు 4 వేల వరకు, ఎస్టీలకు 8వేల వరకు, వికలాంగులకు వెయ్యి వరకు అర్హత పొందే అవకాశమున్నట్లు తెలిసింది. నాన్‌లోకల్‌ కేటగిరిలో అధిక పోటీ కనిపిస్తోంది. స్పోర్ట్సు కోటా ఉన్న వారందరికీ ఉద్యోగం కచ్ఛితమని  తెలుస్తోంది. ఈ ఉత్కంఠకు సోమవారం సాయంత్రం తెరపడనుంది.

24న జరగాల్సిన సర్టిఫికేషన్‌ పరిశీలన వాయిదా
ఈ నెల 24న జరగాల్సిన సచివాలయ ఉద్యోగుల సర్టిఫికెట్ల పరిశీలనను వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్‌ నారాయణభరత్‌గుప్తా తెలిపారు. ఈ నెల 24న జరగాల్సిన చిత్తూరు, నగరి, పూతలపట్టు, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు ఈ నెల 27వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలన్నారు. 25వ తేదీన తిరుపతి అర్బన్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు, 26న తంబళ్లపల్లి, మదనపల్లె, పుంగనూరు, పీలేరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. అన్ని నియోజకవర్గాలకు జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరం, డీఆర్‌డీఏ సమావేశ మందిరం, పీవీకేఎన్‌ కళాశాల వద్ద యోగా అసోసియేషన్‌ భవనం, నాగయ్య కళాక్షేత్రంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు కచ్చితంగా నిర్వహించాలని ఆదివారం రాత్రి కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.
22 సీటీఆర్‌ 503– రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలును ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశిస్తున్న కలెక్టర్‌ 
 
సర్టిఫికెట్ల పరిశీలన ఇక్కడే..
అన్ని నియోజకవర్గాలకు జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరం, డీఆర్‌డీఏ సమావేశ మందిరం, పీవీకేఎన్‌ కళాశాల వద్ద యోగా అసోసియేషన్‌ భవనం, నాగయ్య కళాక్షేత్రంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు కచ్చితంగా నిర్వహించాలని ఆదివారం రాత్రి కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 1,730 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో పరిపాలన కార్యదర్శి పోస్టులు 265, సదుపాయాల కార్యదర్శి 293, విద్యా కార్యదర్శి 294, ప్రణాళికా కార్యదర్శి 293, పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శి 291, సంక్షేమ–అభివృద్ధి కార్యదర్శి 294 పోస్టులు ఉన్నాయన్నారు.

అధిక పోటీ బీసీల్లోనే..
జిల్లాలో సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో అధిక శాతం బీసీ సామాజిక వర్గానికే చెందిన వారే ఉండడం గమనార్హం. దీంతో అధిక పోటీ వారి మధ్యనే కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సీలకు 4 వేల వరకు, ఎస్టీలకు 8వేల వరకు, వికలాంగులకు వెయ్యి వరకు అర్హత పొందే అవకాశమున్నట్లు తెలిసింది. నాన్‌లోకల్‌ కేటగిరిలో అధిక పోటీ కనిపిస్తోంది. స్పోర్ట్సు కోటా ఉన్న వారందరికీ ఉద్యోగం కచ్ఛితమని  తెలుస్తోంది. ఈ ఉత్కంఠకు సోమవారం సాయంత్రం తెరపడనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement