
పరీక్షల నిర్వహణపై అధికారులకు సూచనలిస్తున్న ఆర్‌ఐఓ ప్రభాకరరావు - Sakshi
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : ఇంటర్మీడియెట్ పరీక్షలు ఈనెల 28 నుంచి ప్రారంభంకానున్నాయని, ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని ఆర్‌ఐఓ బి.ప్రభాకరరావు సూచించారు. శనివారం స్థానిక సెయింట్ థెరిస్సా కళాశాలలో ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై 102 పరీక్షా కేంద్రాల సీఎస్‌లు, డీఓలు, ఏసీఎస్‌లతో సమావేశం నిర్వహించారు. వి ద్యార్థులు ఉదయం 8.45 గంటలకే వారికి కేటాయించిన సీట్లలో కూర్చునేలా సం బంధిత అధికారులు చర్యలు తీసుకో వాలని ఆయన ఆదేశించారు. పరీక్షా కేం ద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసేలా సంబంధిత అధికారులతో చర్చించి ఏర్పాట్లు చేయాలని, పరీక్షా కేంద్రాల్లో గాలి, వెలుతురు సరిగా ఉండేలా చూడటంతోపాటు ప్రాథమిక చికిత్సకిట్లు ఉంచేలా వైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు బెంచీలపై కూర్చుని మాత్రమే పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment