బాబుపై నిప్పులు చెరిగిన ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు | APNGO ex president Gopal reddy takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

బాబుపై నిప్పులు చెరిగిన ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు

Published Sun, Mar 23 2014 2:27 PM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM

APNGO ex president Gopal reddy takes on chandrababu naidu

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ఆదివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు అధికారంలో ఉన్న హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్ల మోసం చేశారని ఆరోపించారు. ఓ విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు.అధికారం కోసం బాబు మళ్లీ అబద్దాలు ఆడుతుకున్నారని ఎద్దేవా చేశారు. ఆ అబద్దాలలో భాగంగానే సాధ్యం కానీ పలు హామీలు గుప్పిస్తున్నారన్నారు.సెంట్రల్ పీఆర్సీ అమలు చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇస్తున్నారు.

ఆ హామీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శాపమని తెలియదా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు.9 ఏళ్ల ముఖ్యమంత్రిని అని  చెప్పుకునే చంద్రబాబుకు బడ్జెట్పై కనీసం అవగాహాన కూడా లేదన్నారు. ఎన్నికలలో గెలిచేందుకు రూ. 5 లక్షల కోట్ల హామీ ఇచ్చారని గోపాల్ రెడ్డి గుర్తు చేశారు. ఇంట్లో ఉద్యోగం అని బాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.చంద్రబాబును ఉద్యోగులు నమ్మరని గోపాల్ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement