పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) బృందం సభ్యులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో విద్యార్థులకు ప్రవేశాల కు కల్పించేందుకు కు 2013-14 విద్యాసంవత్సరానికి షరతులతో కూడిన అనుమతి ఇవ్వగా.. రానున్న విద్యాసంవత్సరం లో బీఏఎంఎస్ కోర్సులో ప్రవేశాలు ఇవ్వడం కోసం ఈ తనిఖీ నిర్వహించారు.
ఆ తర్వాత కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆయుర్వేద ఆస్పత్రిలో తనిఖీ చేసిన సీసీఐఎం సభ్యులు ఆస్పత్రిలో సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న సేవలను అడి గి తెలుసుకున్నారు. రోగులకు రాసే కేస్‌షీట్‌లను పరిశీలించి సూపరింటెండెంట్ సత్తయ్యతో సిబ్బంది వివరాలపై ఆరా తీశా రు. అలాగే, కళాశాలలో ఉన్న వసతులు, తరగతి గదులు, ప్రాక్టికల్స్ గదులు, లైబ్రరీ, సిబ్బంది ఎంత మంది ఉన్నారనే వివరాలను ప్రిన్సిపాల్ డాక్టర్ ఫిలిప్ ఆనంద్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.
తనిఖీలో సీసీఐఎం సభ్యులు కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన డాక్టర్ శ్రీనివాస్, మధ్యప్రదేశ్‌లోని జబాల్‌పూర్‌కి చెందిన శ్రీవాస్తవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల, ఆస్పత్రి భవనాలు, సౌకర్యాలను వీడియో చిత్రీకరించి, పలు రికార్డుల ప్రతులను తీసుకువెళ్లారు. కార్యక్రమంలో డాక్టర్ అశోక్‌కుమార్, పాములపర్తి రామారావు, అనిశెట్టి శ్రీధ ర్, జగదీశ్వర్, సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆయుర్వేద కళాశాలలో సీసీఐఎం బృందం
Published Sun, Feb 16 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM
Advertisement
Advertisement