Ayurvedic Medical College
-
రద్దయిన అడ్మిషన్లు పునరుద్ధరించాలి
కాశీబుగ్గ: వరంగల్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాలలో 2022–23 విద్యా సంవత్సరానికి రద్దయిన ప్రవేశాలను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ, ఆయుర్వేద వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ...2011 నుంచి కళాశాలలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మొత్తం 67 పోస్టులకు 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మండిపడ్డారు. కళాశాలలో కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని గమనించాకే భారతీయ వైద్య వ్యవస్థ జాతీయ కమిషన్ (ఎన్సీఐఎస్ఎం) అడ్మిషన్లు రద్దు చేసిందని తెలిపారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవీందర్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ వరంగల్ నిర్వాహక కార్యదర్శి హర్షవర్ధన్, హనుమకొండ జిల్లా కన్వీనర్ నిఖిల్, సుజిత్ తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్ ఆయుర్వేద వైద్య కళాశాలలో అడ్మిషన్లు రద్దు!
కాశిబుగ్గ: వరంగల్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాలలో 2022–23 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు రద్దయినట్లు తెలిసింది. కళాశాలలో అధ్యాపకులు, సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల లేమి కారణంగా నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్(ఎన్సీఐఎస్ఎం) రద్దు చేసినట్లు సమాచారం. 2022 ఆగస్టు మొదటి వారంలో ఢిల్లీలోని ఎన్సీఐఎస్ఎం.. వైద్య కళాశాలతోపాటు కళాశాలకు అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రిలో ఆన్లైన్లో తనిఖీలు చేసింది. కళాశాల, వైద్యశాలలో సరిపోను బోధన సిబ్బంది, వైద్యులు, బోధనేతర సిబ్బంది, మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, కళాశాలకు వెబ్సైట్, ల్యాబొరేటరీలో కనీస సౌకర్యాలు, పరికరాలు లేకపోవడాన్ని బృందం గుర్తించింది. అధ్యాపకులు, సిబ్బందిని నియమించాలని స్థానిక అధికారులు ప్రభు త్వానికి లేఖలు రాసినా పట్టించుకోలేదని తెలిసింది. కళాశాలను పార్ట్‌టైం అధ్యాపకు లు, సిబ్బందితో నిర్వహిస్తున్నట్లుగా గుర్తించిన ఎన్సీఐఎస్ఎం సీట్లను రద్దు చేస్తున్నట్లు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనట్లు తెలిసింది. అడ్మిషన్ల రద్దుతో తెలంగాణలోని 63 మంది విద్యార్థులు వైద్యులుగా అయ్యే అవకాశాలు కోల్పోనున్నారు. రిక్రూట్మెంట్ లేక ఖాళీలు 2011 నుంచి అ«ధ్యాపకులు, వైద్యశాలలో డాక్టర్లు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయడం లేదు. దీంతో రాష్ట్రంలోని రెండు ఆయుర్వేద వైద్య కళాశాలల్లో అధ్యాపకులు, వైద్యుల పోస్టులు ఖాళీలు ఉండటంతో సిలబస్ పూర్తికావడం లేదని, పరీక్షలకు ఎలా సిద్ధం కావాలని విద్యార్థులు పలుమార్లు కళాశాలల్లో నిరసన వ్యక్తం చేశారు. దీంతో పీజీ పూర్తి చేసిన విద్యార్థులను పార్ట్‌టైం లెక్చరర్లుగా నియమించినా వేతనాలు చెల్లించకపోవడంతో బోధించడం లేదు. -
ఆయుర్వేద కళాశాలలో సీసీఐఎం బృందం
పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) బృందం సభ్యులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో విద్యార్థులకు ప్రవేశాల కు కల్పించేందుకు కు 2013-14 విద్యాసంవత్సరానికి షరతులతో కూడిన అనుమతి ఇవ్వగా.. రానున్న విద్యాసంవత్సరం లో బీఏఎంఎస్ కోర్సులో ప్రవేశాలు ఇవ్వడం కోసం ఈ తనిఖీ నిర్వహించారు. ఆ తర్వాత కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆయుర్వేద ఆస్పత్రిలో తనిఖీ చేసిన సీసీఐఎం సభ్యులు ఆస్పత్రిలో సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న సేవలను అడి గి తెలుసుకున్నారు. రోగులకు రాసే కేస్షీట్లను పరిశీలించి సూపరింటెండెంట్ సత్తయ్యతో సిబ్బంది వివరాలపై ఆరా తీశా రు. అలాగే, కళాశాలలో ఉన్న వసతులు, తరగతి గదులు, ప్రాక్టికల్స్ గదులు, లైబ్రరీ, సిబ్బంది ఎంత మంది ఉన్నారనే వివరాలను ప్రిన్సిపాల్ డాక్టర్ ఫిలిప్ ఆనంద్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో సీసీఐఎం సభ్యులు కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన డాక్టర్ శ్రీనివాస్, మధ్యప్రదేశ్‌లోని జబాల్పూర్కి చెందిన శ్రీవాస్తవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల, ఆస్పత్రి భవనాలు, సౌకర్యాలను వీడియో చిత్రీకరించి, పలు రికార్డుల ప్రతులను తీసుకువెళ్లారు. కార్యక్రమంలో డాక్టర్ అశోక్‌కుమార్, పాములపర్తి రామారావు, అనిశెట్టి శ్రీధ ర్, జగదీశ్వర్, సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.