మంగినపూడిబీచ్ అందవిహీనంగా మారింది. కోట్ల రూపాయల్లో బీచ్‌ను అభివృద్ధి చేస్తామని పాలకులు చెబుతున్నప్పటికీ ఇంత వరకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. గతంలో ఏర్పాటు చేసిన స్నానాల గదులు, మహిళలు దుస్తులు మార్చుకునే రూమ్‌లు, వస్తువులు భద్రపరుచుకునే స్ట్రాంగ్‌రూమ్‌లు, నిరుపయోగంగా ఉన్నాయి. స్నానాల గదులకు, రూమ్‌లకు తలుపులు లేక సందర్శకులు దుస్తులు ఎక్కడ మార్చుకోవాలో తెలియక ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం ప్రయాణికులతో సందడిగా ఉండే మంగినపూడిబీచ్ సౌకర్యాల లేమితో అందవిహీనంగా మారింది. మరో నాలుగు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కానున్న దృష్ట్యా సందర్శకులు తాకిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. సౌకర్యాలతోపాటు తాగునీటి సౌకర్యం లేక సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. బీచ్ అభివృద్ధిని చేయటం పక్కన పెట్టి ఉన్న సౌకర్యాలను మెరుగుపరచాలని సందర్శకులు వాపోతున్నారు. – ఫోటోలు : అజీజ్, మచిలీపట్నం
Comments
Please login to add a commentAdd a comment