ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
మల్కాపురం, న్యూస్‌లైన్: విశాఖపట్నంలోని డాక్‌యార్డ్ సమీపంలో ఉన్న షిప్ బిల్డింగ్ సెంటర్ (ఎస్‌బీసీ)శనివారం జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాద కారణాలను నేవల్ అధికారులు వెల్లడించలేదు. ఎల్‌అండ్‌టీ వద్ద సబ్ కాంట్రాక్ట్ పనులు చేపట్టే అంజలి కన్రస్ట్రక్షన్‌లో పనిచేసే అమర్ (30) షిప్ బిల్డింగ్ సెంటర్‌లో తమ సంస్థ తరఫున సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఎస్‌బీసీకి వచ్చిన అమర్ సైట్ ఏ కంపార్ట్‌మెంట్-4 బ్లాక్ నంబర్-2లో ఆల్ఫా బీ-26 (సబ్‌మెరైన్) వద్ద పనులు పర్యవేక్షిస్తున్నాడు.
ఎల్‌అండ్‌టీలో ఇంజనీర్ అమ్జిత్‌ఖాన్, హెచ్‌ఈడీ ఉద్యోగి విష్ణుతో కలిసి హైడ్రోలింగ్ పవర్‌టెస్ట్ నిర్వహణ కోసం వెళ్లారు. అదే సమయంలో ప్లాంజ్‌పై ఒత్తిడి పెరిగి పేలుడు సంభవిం చింది. దీంతో అమర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు తెలిసింది. అమర్‌ది నగరంలోని అక్కయ్యపాలెం. గాయాలైన అమ్జిత్‌ఖాన్, విష్ణులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనతో కలవరానికి గురైన కార్మికులు అధికారులను ప్రశ్నిస్తే తమపట్ల దురుసుగా ప్రవర్తించారని, వారి తీరును నిరసిస్తూ అక్కడ ఆందోళన చేపట్టారు.
విశాఖ షిప్ బిల్డింగ్ సెంటర్‌లో పేలుడు
Published Sun, Mar 9 2014 5:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
Advertisement