పురందేశ్వరిపై బోండా ఆగ్రహం
విజయవాడ: బీజేపీ నేత పురందేశ్వరిపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పురందేశ్వరి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆమెకు రాజకీయ నిరుద్యోగం వల్లే ఈ గందరగోళంలో ఉన్నారని అన్నారు.
పోలవరం, రాజధాని డీపీఆర్‌లపై పురందేశ్వరి వ్యాఖ్యలు సత్యదూరమన్నారు. కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. తుని ఘటనలో ముద్రగడ పద్మనాభం పాత్ర కేవలం సభ వరకే పరిమితమన్నారు. తుని ఘటనకు భూమనే కారణమని ఆరోపించారు.