Purandheswari
-
బాబు కొసం పురందేశ్వరి సైతం కోవర్టులా మారారా ?
-
మళ్లీ మళ్లీ అవే అబద్ధాలా?
చంద్రబాబు నాయుడి కోసం ‘ఈనాడు’ రాతలను లేఖలుగా సంధిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చిన్నచిన్న లాజిక్కులు కూడా మిస్ అవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. స్కిల్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తన బావ చంద్రబాబు మెప్పుకోసం కొన్ని రోజులుగా రాష్ట్రంలో ‘మద్యంపై పోరాటం’ అంటూ ఆమె చేస్తున్న హంగామా అంతా చూస్తున్నదే. తాజాగా దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ అందజేశారు. తమ పార్టీ ప్రభుత్వానికే ఇలా వినతి పత్రాలివ్వటమేంటని అంతా ఆశ్చర్యపోతున్నా... టీడీపీ సంక్షేమం కోసం పాటుపడుతున్న పురంధేశ్వరికి మాత్రం ఇవేమీ పట్టడం లేదు. లేఖలో ఆమె పేర్కొన్న కొన్ని అంశాలు ఎంత అసంబద్ధమైనవంటే... అనుమతులిచ్చిన చంద్రబాబును ప్రశ్నించరేం? రాష్ట్రంలో మద్యం నాణ్యతపై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్న పురంధేశ్వరికి... దాన్ని తయారు చేస్తున్న డిస్టిలరీలకు అనుమతులిచ్చింది తన బావ చంద్రబాబు నాయుడేనని తెలియదా? ఒకవేళ తెలియకుంటే తెలుసుకోవాలి కదా? వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుతం 20 మద్యం డిస్టిలరీలుండగా... వాటిలో 14 డిస్టిలరీలకు అనుమతిచ్చింది చంద్రబాబు నాయుడే. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకు ముందటి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. అంతే తప్ప వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు అనుమతిచ్చిన డిస్టిలరీల్లో చాలావరకూ ఆయన హితులు, సన్నిహితులవే. వాళ్లు అప్పట్లో తయారు చేసిన మద్యాన్నే ఇప్పుడూ తయారు చేస్తున్నారు. మరి అప్పట్లో నాణ్యంగా ఉన్న మద్యం ఇప్పుడు ఎందుకు మారిపోయింది? ప్రభుత్వం మారింది కాబట్టా? ఇదెక్కడి తీరు పురంధేశ్వరి గారూ?! నాడు నాలుగు డిస్టిలరీలకే 70 శాతం ఆర్డర్లు.. పురంధేశ్వరి తన లేఖలో వాస్తవానికి సమాధి కట్టి వినిపించిన మరో అందమైన అబద్ధమేంటంటే... వైఎస్సార్ సీపీ నాయకులకు చెందిన డిస్టిలరీలకే ఎక్కువ మద్యం సరఫరా చేసే అవకాశమిస్తున్నారని. నిజం చెప్పాలంటే వైఎస్సార్సీపీ నేతలకు డిస్టిలరీలే లేవు. అన్నీ చంద్రబాబు నాయుడి హయాంలో అనుమతులిచ్చిన ఆయన సన్నిహితులు, టీడీపీ నేతలవే. పైపెచ్చు చంద్రబాబు హయాంలో డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగేది. తమ వారికి చెందిన 4 డిస్టిలరీల నుంచే ఏకంగా 70 శాతం మద్యాన్ని కొనుగోలు చేసేవారు. అంటే తనకు కావాల్సిన ఈ 4 డిస్టిలరీలకూ సగటున ఒక్కోదానికీ 17.5 శాతం ఆర్డర్లు ఇచ్చారు. మిగిలిన 16 డిస్టిలరీలకూ కలిపి 30 శాతం ఆర్డర్లు ఇచ్చారు. అంటే వీటికి సగటున 2 శాతంలోపే ఆర్డర్లు దక్కాయి. కానీ ఇంతటి అవినీతిని పురంధేశ్వరి ఎన్నడూ... ఏ పార్టీలో ఉన్నప్పుడూ ప్రశ్నించలేదు. వాస్తవానికి ఇప్పుడు ప్రతి డిస్టిలరీకీ సమానంగా అవకాశం కల్పిస్తున్నారు. దాదాపు 4 నుంచి 6 శాతం వరకు ప్రతి డిస్టిలరీకీ తయారీ ఆర్డర్లు ఇస్తున్నారు. ఇలా చేస్తున్నందుకే... ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి చెందిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా, నిబంధనల మేరకే జరుగుతున్నాయని ఒక నివేదిక కూడా ఇచ్చింది. కేంద్ర సంస్థే ఇలా చెప్పినపుడు... కేంద్రానికి పురంధేశ్వరి చేసిన ఫిర్యాదులో ఏ కొంచెమైనా అర్థం ఉన్నట్టా? సత్ఫలితాలనిస్తున్న దశలవారీ మద్య నియంత్రణ.. మద్యం విక్రయాలను ప్రభుత్వ అధీనంలో చేపట్టడం... షాపుల సంఖ్యను తగ్గించటం... విక్రయ వేళల్ని పరిమితం చేయటం... పర్మిట్ రూముల్ని రద్దు చేయటం... బెల్టు షాపుల్ని తొలగించటం... వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2018–19లో మద్యం విక్రయాలు 3.84 కోట్లు కేసులు. అదే ఏడాది బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడు పోయాయి. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక విక్రయాలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. 2022–23లో మద్యం విక్రయాలు 3.35 కోట్ల కేసులకు, బీర్లు 1.16 కోట్ల కేసులకు పరిమితమయ్యాయి. మద్యం తాగేవారు వెనుకంజ వేసేలా... రేట్లను షాక్ కొట్టేలా పెంచుతామని గత ఎన్నికల హామీల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దాన్ని అమలు చేశారు. రేట్లను పెంచటంతో పాటు అదనపు పన్నునూ విధించారు. ఇది కూడా మద్యం విక్రయాలు తగ్గటానికి కారణమే. నిధులు మళ్లించింది చంద్రబాబు కాదా? తెలుగుదేశం, ‘ఈనాడు’ బాటలోనే... రాష్ట్రంలో మద్యం విక్రయించగా వచ్చిన సొమ్ము ఖజానాకు కాకుండా ఇంకెక్కడికో తరలిపోతోందంటూ పురంధేశ్వరి సైతం గగ్గోలుపెట్టారు. రాష్ట్రంలో రోజూ 80 లక్షల మంది తలా రూ.200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారని నోటికొచ్చినట్లు చెప్పేశారు. ఇలా చూస్తే మద్యం అమ్మకాల ద్వారా సంవత్సరానికి రూ.57,600 కోట్లు రావాలని, కానీ రూ.32,600 కోట్లే చూపిస్తున్నారు కనక మిగతా రూ.25 వేల కోట్లు అక్రమంగా మళ్లించేస్తున్నారని నమ్మశక్యం కాని కూతలు కూసేశారు. నిజానికి కేంద్ర జాతీయ కుటుంబ ఆరోగ్య నివేదిక 2019–21 ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడ్డవారిలో మద్యం అలవాటు ఉన్నవారు 63.88 లక్షలమంది. వీరిలో రోజూ తాగేవారు సగటున 18.24 లక్షల మందే. మరి 80 లక్షల లెక్క ఎవరు చెప్పారు పురంధేశ్వరి గారూ? వాస్తవానికి ఈ ప్రభుత్వ హయాంలో తక్కువ మద్యం విక్రయిస్తున్నా ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ సొమ్ము సమకూరుతోంది. కానీ చంద్రబాబు హయాంలో ఇప్పటికంటే చాలా ఎక్కువ మద్యాన్ని విక్రయించినా కూడా... ఇప్పటికన్నా తక్కువ మొత్తమే ఖజానాకు చేరేది. మరి నిధుల మళ్లింపు అప్పుడు జరిగినట్టా? ఇప్పుడు జరుగుతున్నట్టా? కాస్త ఆలోచన ఉండాలి కదా? చంద్రబాబును విమర్శించడానికి మనసు ఒప్పుకోకుంటే... ఇలాంటి పనికిమాలిన ఆరోపణలైనా చేయకుండా ఉండాలి కదా?. -
బరిలో ఉమ్మడి అభ్యర్థి
తిరుపతి అర్బన్: తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థినే బరిలో నిలుపుతామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి పేర్కొన్నారు. తిరుపతిలో మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీటీడీకి చెందిన భూములను ధారదత్తంగా విక్రయిస్తున్న యాజమాన్య తీరును అడ్డుకున్నది బీజేపీనే అని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక పాలసీ తప్పుదోవ పడుతోందని విమర్శించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఫేక్ ఐడీ కార్డులతో దొంగ ఓట్లు వేశాయని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇసుక పాలసీని రద్దు చేసి పేదలకు ఉచితంగా ఇసుకను అందజేయాలని డిమాండ్ చేశారు. -
టీడీపీకి గుణపాఠం చెప్పండి
చింతపల్లి (పాడేరు): టీడీపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి గిరిజనులు తగిన గుణపాఠం చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం అంతర్లలో మంగళవారం బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, ఇసుక, మట్టి, భూకబ్జాలు రాష్ట్రంలో పెరిగిపోయాయని, అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం నాయకులు పనిచేశారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాటు తెలుగుదేశం నాయకులు కొన్ని వేల కోట్లు దోచుకున్నారని, ఎన్నికలు దగ్గర పడడంతో ఓటర్లను అధికారికంగా కొనుగోలు చేసేందుకు పసుపు కుంకుమ, నిరుద్యోగ భృతి వంటి పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చారని విమర్శించారు. 2014లో నరేంద్ర మోదీ కారణంగానే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అధికారం దక్కిందన్నారు. మన్యంలో విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నూతన విద్యాలయాలు మంజూరు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మన్యం అభివృద్ధికి కనీస చర్యలు చేపట్టడం లేదని, మన్యంలో అధికార పార్టీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ఆమె ప్రశ్నించారు. బీజేపీతోనే దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని గిరిజనులు అభివృద్ధి చేసే పార్టీకే ఓట్లు వేయాలని కోరారు. గిరిజన కార్యక్రమంలో పాడేరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ లోకుల గాంధీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు పి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
‘బ్లేడు బ్యాచ్ బ్యానర్లు తీస్తే మంచిది’
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు కాట్రగడ్డ బాబుపై బీజేపీ నాయకులు నిప్పులు చెరిగారు. కార్పోరేటర్‌గా కూడా పోటీ చేయలేని కాట్రగడ్డకు పురంధేశ్వరిని విమర్శించే స్థాయి లేదని బీజేపీ నగరాధ్యక్షుడు ఉమా మహేశ్వరరాజు మండిపడ్డారు. రాజకీయ అజ్ఞాని కాట్రగడ్డను టీడీపీ నాయకులే పక్కన పెట్టారని అన్నారు. రాజకీయాల్ని రాజకీయంగా చూడాలేగానీ, వ్యక్తిగత విమర్శలు తగవని హితవు పలికారు. అధిష్టానం దృష్టిలో పడడానికి ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. బ్యానర్లు కడుతున్నారని ధ్వజమెత్తారు. దొందలందరూ టీడీపీలోనే ఉన్నారని విమర్శించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ దొంగ దీక్షలు చేయడం వారికి మామూలేనని టీడీపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదొక బ్లేడు బ్యాచ్ చేతిలో వెయ్యి రూపాయలు ఉంటే చాలు.. ముందూ వెనకా ఆలోచించకుండా ఓ బ్లేడు బ్యాచ్ దేశ ప్రధానిపై కూడా తలా తోకాలేని విమర్శలు చేస్తూ ఫ్లెక్లీలు ఏర్పాటు చేస్తారని విజయవాడ యువమోర్చా అధ్యక్షుడు రవీంద్ర ధ్వజమెత్తారు. కాట్రగడ్డకు కళ్లు నెత్తికెక్కాయని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులపై విమర్శలు చేస్తున్నవారు దమ్ముంటే టీడీపీ మేనిఫెస్టోపై బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. లేదంటే ఫ్లెక్సీలు తొలగించి నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలని అన్నారు. -
టీడీపీ మిత్ర ధర్మం పాటిస్తుందా?
-
పురందేశ్వరిపై బోండా ఆగ్రహం
విజయవాడ: బీజేపీ నేత పురందేశ్వరిపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పురందేశ్వరి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆమెకు రాజకీయ నిరుద్యోగం వల్లే ఈ గందరగోళంలో ఉన్నారని అన్నారు. పోలవరం, రాజధాని డీపీఆర్‌లపై పురందేశ్వరి వ్యాఖ్యలు సత్యదూరమన్నారు. కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. తుని ఘటనలో ముద్రగడ పద్మనాభం పాత్ర కేవలం సభ వరకే పరిమితమన్నారు. తుని ఘటనకు భూమనే కారణమని ఆరోపించారు. -
కాంగ్రెస్‌ను వీడనున్న దగ్గుబాటి దంపతులు!
-
బీజేపీలోకి దగ్గుబాటి దంపతులు!
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయలేమని దిగ్విజయ్‌కు కేంద్ర మంత్రి పురందేశ్వరి లేఖ విభజనపై తమ వాదనలను పట్టించుకోలేదంటూ విమర్శ సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి పురందేశ్వరి దంపతులు కాంగ్రెస్‌ను వీడనున్నారా? బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా? తాజా పరిణామాలు ఇదే విషయూన్ని స్పష్టం చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర విభజన విషయంలో తమ వాదనలను కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదంటూ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవ హారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు శనివారం లేఖ రాసినట్లు ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రకు అన్యాయం చేస్తున్నందున, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోమని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పురందేశ్వరి భర్త, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నిర్దేశించిన అభ్యర్థి కేవీపీ రామచంద్రరావుకు ఓటు వేయలేదు. ఇది జరిగిన మరునాడే దిగ్విజయ్‌కు పురందేశ్వరి లేఖ రాసినట్లు వార్తలొచ్చారుు. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందని, అందువల్ల పార్టీ మారాలన్న అభిప్రాయంతో దగ్గుబాటి దంపతులు ఉన్నట్లు వారి సన్నిహితవర్గాలు తెలిపారుు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కడం కష్టమేనన్న అభిప్రాయంతో వారు రాష్ట్రానికి చెందిన బీజేపీ జాతీయ స్థాయి నేతతో సంప్రదింపులు జరిపి ఆ పార్టీలో చేరేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.