ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులు ఖరారు
హైదారబాద్: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సరిహద్దులు ఖరారయ్యాయి. సరిహద్దులలో 8 చెక్పోస్టులు ఏర్పాటు చేయడానికి ఉత్తర్వులు ఖరారయ్యాయి. ఆలంపూర్, నాగార్జున సాగర్, ఈగలపెంట, కోదాడ, విష్ణపురం, అశ్వరావుపేట, కల్లూరు, పల్వంచలలో చెక్పోస్టులు ఏర్పాటు చేస్తారు. తెలంగాణకు పది జిల్లాలు, ఆంధ్రప్రదేశ్కు 13 జిల్లాలు కేటాయించిన విషయం తెలిసిందే.
రాష్ట్రం జూన్ 2న ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోనున్న విషయం తెలిసిందే. వివిధ అంశాలకు సంబంధించి సరిహద్దులు అనేవి ముఖ్యం. రవాణా, పన్నులు, ఇతర అంశాలకు సరిహద్దులకు ప్రధాన్యత ఉంటుంది. అందువల్ల సరిహద్దులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇదిలా ఉంటే, రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన పెద్ద సమస్యగా మారింది. ఈ విషయమై వివాదం నెలకొంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు వస్తే కొంతవరకు సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 26న మార్గదర్శకాలు వెలువడతాయని సమాచారం.