మరోసారి ఆర్టీసీ సమ్మెపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ఆదివారం నాటికి ఐదో రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించే పరిస్థితి దాదాపు కనిపించకపోవడంతో మరోసారి చర్చలకు సన్నద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీసీ కార్మిక సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. ఇప్పటికే పలుమార్లు ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం చర్చలు జరిపినా.. అవి ఫలించని సంగతి తెలిసిందే. మరోపక్క తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మికులు స్పష్టం చేయడంతో ప్రభుత్వం మరోసారి చర్చలకు సిద్ధమవుతోంది.
తమకు 46 శాతం ఫిట్ మెంట్ ను ఇవ్వాలని కోరూతు ఆర్టీసీ కార్మికులు గత బుధవారం సమ్మెకు దిగారు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా.. అటు విద్యార్థులకు ఎంట్రెన్స్ టెస్ట్ లు ఉండటం కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.