
మంగళగిరి వద్ద కారు దగ్ధం
గుంటూరు: జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద చోటు చేసుకుంది. వివరాలు.. మహీంద్రా వెరిటో కారులో ప్రమాదవశాత్తూ మంటలు రేగాయి. కారులో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు వెంటనే దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
అనంతరం కారులో మంటలు చెలరేగి పూర్తిగా బూడిదయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.
(మంగళగిరి)