పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం, ముగ్గురు మృతి | Bike Accident At mangalagiri Guntur District | Sakshi
Sakshi News home page

గుంటూరు: పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం, ముగ్గురు యువకుల మృతి

Published Sat, Feb 5 2022 7:39 AM | Last Updated on Sat, Feb 5 2022 10:47 AM

Bike Accident At mangalagiri Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పుట్టిన పుట్టినరోజు వేడుకలు ముగించుకొని కృష్ణాయపాలెం నుంచి పెనుమాక వస్తుండగా ఓ ద్విచక్ర వాహనం కరెంటు స్తంభానికి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న సతీష్‌రెడ్డి, ఎస్‌కే రాజుతో పాటు మరో యువకుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మరణించిన ముగ్గురు యువకులు పెనుమాకకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

చదవండి: హైగ్రో కెమికల్స్‌ రూ.1.93 కోట్ల ఎఫ్‌డీల జప్తు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement