మంగమ్మ మృతికి వెంకయ్య నాయుడు సంతాపం | central minister venkaiah naidu tributes to jolepalem mangamma | Sakshi
Sakshi News home page

మంగమ్మ మృతికి వెంకయ్య నాయుడు సంతాపం

Published Thu, Feb 2 2017 11:04 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM

మంగమ్మ మృతికి వెంకయ్య నాయుడు సంతాపం

మంగమ్మ మృతికి వెంకయ్య నాయుడు సంతాపం

హైదరాబాద్‌ : రేడియో మొదటి మహిళా న్యూస్‌ రీడర్, రచయిత జోలెపాళెం మంగమ్మ (92) మృతి పట్ల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం బాధాకరమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మంగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు.

చిత్తూరు జిల్లాకు మదనపల్లెకు చెందిన మంగమ్మ దేశంలోనే మొట్టమొదటి మహిళా న్యూస్‌రీడర్‌గా పదేళ్లపాటు పని చేశారు. ఆమె పలు భాషల్లో గ్రంథాలు రాయడంతో పాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆమె బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. మంగమ్మ అంత్యక్రియలు ఇవాళ మదనపల్లెలో నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement