ఏజేసీగా సీహెచ్ నర్సింగరావు
జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్‌గా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఏజేసీ సీహెచ్ నరసింగరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఏజేసీగా పనిచేసిన యూసీజీ నాగేశ్వరరావును ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయమని ఆదేశించినట్టు తెలిసింది. ఎన్నికల బదిలీల్లో భాగంగా ఏజేసీగా ఫిబ్రవరి 12న నరసింగరావు పశ్చిమగోదావరి జిల్లాలో బాధ్యతలు స్వీకరించారు. దెందులూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి సమర్థవంతమైన సేవలందించారు. ప్రస్తుత ఏజేసీ నాగేశ్వరరావుకు బదిలీ అవుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. కాకపోతే ఆయన బదిలీని ఆపుకోడానికి యత్నించడం వల్లే ఈ జాప్యం జరిగినట్టు తెలిసింది.