
నిధులు, అధికారాలు ఇవ్వాలి: చలసాని
బి. కొత్తకోట: జిల్లాలకు ప్రత్యేక అధికారాలు, నిధులు ఇవ్వాలని ఆంధ్ర మేధావుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా బి. కొత్తకోటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు జిల్లా ప్రణాళికలు సిద్ధంచేసి అమలుచేస్తామని చెప్పారని, దీంతోనే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. తెలంగాణకు మిగులు నిధులు ప్రత్యేక రాష్ట్రంతోనే సాధ్యమైందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు రూ. 16 వేల కోట్ల లోటు ఉందని, దీన్ని భర్తీ చేస్తానని ప్రధాని ఇంతవరకు హామీ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఈ ప్రాంతానికి చెందిన చిరంజీవి చెన్నైలో, రాజగోపాల్ ఢీల్లీలో పన్నులు కడుతున్నారని అన్నారు. తిరుపతిలో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ రాష్ట్రపతి జారీచేసిన ఆర్టినెన్స్ చెల్లదన్నారు.