
పుష్కర గోదావరికి అఖండ హారతి
త్వరలో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరికి నిత్యహారతి వేడుకను ప్రారంభించారు. ముందుగా గోదావరికి హారతి ఇచ్చిన తర్వాత ఆయన శంఖం పూరించారు. ఇప్పటి నుంచి గోదావరికి నిత్యహారతి ఇవ్వనున్నట్లు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.