హైదరాబాద్:తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సంభవించిన ప్రమాద ఘటనలో ప్రాణాలతో బతికి బయటపడ్డ చిన్నారికి మెరుగైన చికిత్స అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాద ఘటనపై సహాయక చర్యలను చేపట్టాలని డిప్యూటీ సీఎం చిన రాజప్పను బాబు ఆదేశించారు. దీంతో ప్రమాద ఘటనపై చిన రాజప్ప విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను తెలపాలని రాజమండ్రి అర్బన్ ఎస్పీని కోరారు.
కాగా, మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రమాద ఘటనపై ఆరా తీశారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు త్వరగా అందజేయాలని అధికారులను ఆదేశించారు.శుక్రవారం రాత్రి సమయంలో చోటు చేసుకున్న ప్రమాద ఘటనలో 22 మంది మృతి చెందగా, ఓ చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. స్వల్పంగా గాయపడిన ఈగల కిరణ్ ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
'చిన్నారికి మెరుగైన చికిత్స అందించండి'
Published Sat, Jun 13 2015 9:09 AM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM
Advertisement
Advertisement