కేశినేని నానిపై బాబు సీరియస్? | chandra babu reacts on comments of kesineni nani | Sakshi
Sakshi News home page

కేశినేని నానిపై బాబు సీరియస్?

Published Fri, Dec 26 2014 7:14 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

కేశినేని నానిపై బాబు సీరియస్? - Sakshi

కేశినేని నానిపై బాబు సీరియస్?

విజయవాడ ఎంపీ కేశినేని నాని.. అధికారులపైన, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపైన చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆయన ఎంపీ నానిని ఆదేశించారని సమాచారం. నాయకుల మధ్య ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిపై అంతర్గతంగా చర్చించుకోవాలే తప్ప.. బహిరంగంగా వాటిని ప్రస్తావించడం సరికాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
 
శుక్రవారం నాడు కృష్ణాజిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమాపైన, రాష్ట్ర ప్రభుత్వ అధికారులపైన కేశినేని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఆరు నెలల కాలంలో విజయవాడకు ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, అధికారుల తీరుపై నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయం ఏమాత్రం లేదని వ్యాఖ్యానించారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌పై కూడా నాని ఘాటైన విమర్శలు గుప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement