ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అడుగడుగునా సమైక్య సెగ తగులుతోంది. గుంటూరు జిల్లా క్రోసూరులో చంద్రబాబుకు సమైక్య ఉద్యమ వేడి తాకింది. ఆయనను అడ్డుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. సమైక్యవాద ప్లకార్డ్స్‌తో నిరసన తెలిపారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు అరెస్టు చేశారు.
సోమవారం రాత్రి రెడ్డిగూడెంలో ప్రసంగిస్తున్న సమయంలో కొందరు యువకులు ముందుకు దూసుకువచ్చి సమైక్యవాదానికి మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. బాబు వ్యక్తిగత సిబ్బంది, రక్షణ వలయాన్ని దాటుకుంటూ బస్ వద్దకు చేరుకుని... సమైక్యవాదం వర్ధిల్లాలి, జై సమైక్యాంధ్ర అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు ‘ఎవడ్రా మీకు ప్లకార్డులు ఇచ్చి పంపింది?’ అంటూ దుర్భాషలాడారు. వారిపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగింపజేశారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశాలు ఉండటంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని ఆపివేసి సత్తెనపల్లికి వెళ్లిపోయారు.
క్రోసూరులో చంద్రబాబుకు సమైక్య సెగ
Published Tue, Sep 3 2013 1:56 PM | Last Updated on Sat, Jul 28 2018 7:54 PM
Advertisement
Advertisement