సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష కార్యవర్గాన్ని త్వరలో ప్రకటించనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. దీనిపై మంగళవారం పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు. 22 మందితో జాబితాను రూపొందించారు. వీరిలో కొందరిని టీడీఎల్పీ ఉప నేతలుగా, కొందరిని కార్యదర్శులుగా నియమించనున్నారు. ఒక కోశాధికారిని ఎంపిక చేయనున్నారు. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని ఉప నేతలను ఎంపిక చేయనున్నారు. సభలో దీటుగా సమాధానం చెప్పగలిగే సీనియర్లను ముఖ్య స్థానాల్లో నియమించవచ్చని తెలుస్తోంది.
ఉప నేతలుగా పతివాడ నారాయణస్వామినాయుడు, కాగిత వెంకటరావు, యరపతినేని శ్రీనివాసరావు, బీకే పార్ధసారధిల లో కొందరికి అవకాశం ఉండొచ్చని సమాచారం. కార్యదర్శులుగా ముడియం శ్రీనివాస్, టి.శ్రావణ్‌కుమార్, బి.సి.జనార్ధనరెడ్డి, బోండా ఉమామహేశ్వరరావు, కలవపూడి శివలతో పాటు మీసాల గీత, పిల్లి అనంతలక్ష్మిల్లో కొందరిని నియమించే అవకాశం ఉంది. ఇతర పదవుల్లో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, కేఎస్ జవహర్, బెందాళం అశోక్, త లారి ఆదిత్య, దామచర్ల జనార్ధన్, వెంకటరమణ, పెందుర్తి వెంకటేశ్, వాసుపల్లి గణేశ్‌కుమార్, వ నమాడి వెంకటేశ్వరరావులను నియమించే అవకాశం ఉంది. శ్రీరాం తాతయ్యను కోశాధికారిగా నియమించవచ్చని పార్టీవర్గాలు భావిస్తున్నాయి.
త్వరలో టీడీఎల్పీ కార్యవర్గం!
Published Wed, Aug 6 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement
Advertisement