‘మాగంటి’పై చీటింగ్ కేసు | Cheating case on Maganti Nagabhushanam | Sakshi
Sakshi News home page

‘మాగంటి’పై చీటింగ్ కేసు

Published Tue, Nov 4 2014 8:37 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

Cheating case on Maganti Nagabhushanam

 ఏలూరు : ఏలూరు ఆటోనగర్‌లో స్థలాల కేటాయింపుల్లో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించిది ఏలూరు ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మాగంటి నాగభూషణంపై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ డాక్టర్ కె.రఘురామ్‌రెడ్డి వెల్లడించారు. ఆటోనగర్‌లో ఇష్టారాజ్యంగా స్థలాలు కేటాయిస్తున్నారన్న వాదనల నేపథ్యంలో ‘పెద్దలే గద్దలు’ శీర్షికన గత నెల 22న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విది తమే. ఈ వ్యవహారంపై పోలీసులు సీరి యస్‌గా దృష్టి సారించారు.
 
 బాధితులూ ధైర్యంగా ముందుకొచ్చి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ రఘురామ్‌రెడ్డిలను గత నెల 28న కలిసి ఫిర్యాదు చేశారు. అసోసియేషన్ సభ్యులైన సబ్బవరపు నందనరావు, మోటూ రి మాధవరావులతోపాటు మెకానిక్‌లుగా పనిచేస్తున్న తమను సభ్యులుగా చేర్చమని కోరితే   పట్టించుకోవటం లేదంటూ 75 మంది బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మాగంటి నాగభూషణంతోపాటు అసోసియేషన్ నేతలనూ విచారించారు. సోమవారం మాగంటిపై సెక్షన్-420తోపాటు 406, 468, 506 కింద రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ రఘురామ్‌రెడ్డి వెల్లడించారు. ప్రాథమిక విచారణ జరిపి కేసులు నమోదు చేసామని, దర్యాప్తులో భాగం గా ఏపీఐఐసీ అధికారుల నుంచి పూర్తివివరాలు కోరతామని చెప్పారు.
 
 పత్రాలు స్వాధీనం
 కాగా, సోమవారం రాత్రి పోలీసులు సెర్చ్ వారెంట్ తీసుకుని స్థానిక ఏఎస్ ఆర్ స్టేడియం సమీపంలోని మాగంటి నాగభూషణం ఇంట్లో సోదాలు చేపట్టా రు. ఆటోనగర్‌కు సంబంధించిన  కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సీఐ ధర్మేందర్‌రెడ్డి, ఎస్సై జి.ఫణీంద్ర, పెదపాడు ఎస్సై టి.నాగరాజు ఆధ్వర్యంలో 20మంది పోలీసులు  సోదాలు జరిపారు.
 
 డీఐజీతో ఎమ్మెల్యేల భేటీ
 పోలీసులు మాగంటి నాగభూషణం ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలోనే ఏలూరు రేంజ్ డీఐజీ పి.హరికుమార్‌తో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి భేటీ కావడం చర్చనీయూంశమైంది. మాగంటి అరెస్ట్ కాకుండా పోలీ సులపై ఒత్తిళ్లు తీసుకు తెచ్చేందుకు ఆయనతో భేటీ అయ్యారన్న వాదనలు వినిపించాయి. డీఐజీతో చర్చలు జరిపిన అనంతరం వారిద్దరితోపాటు జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు నేరుగా మాగంటి నాగభూషణం ఇం టికి వెళ్లారు. ఓ పక్క పోలీసులు తని ఖీలు చేస్తున్న సమయంలోనే వారు ఇంట్లోకి వెళ్లి మాగంటితో చర్చలు జరి పారు. కాగా, సోదా చేస్తున్న పోలీసులపై మాగంటి కుటుంబ సభ్యులు కస్సుబుస్సులాడటం, సెర్చ్ వారెంట్ తీసుకుని వెళ్లిన పోలీసులకు సహకరించకపోవడం కొసమెరుపు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement