చీమకుర్తి: ప్రకాశం జిల్లా చీమకుర్తి నగర పంచాయతీ పరిధిలో టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. శుక్రవారం ముగ్గురు కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. నగర పంచాయతీలో మొత్తం 20 స్థానాలకు 12 స్థానాలతో టీడీపీ ఆధీనంలో ఉండగా.. రెండు రోజుల వ్యవధిలో నలుగురు కౌన్సిలర్లు రాజీనామా చేశారు. దీంతో టీడీపీ బలం కాస్తా 8కి తగ్గి మైనారిటీలో పడిపోయింది. ఇక్కడ 8 స్థానాలతో వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంగా ఉంది.
పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా ఇన్నాళ్లు యోగయ్య వ్యవహరించారు. తిరిగి రెండో సారి అదే పదవి దక్కించుకోవాలని ఆయన ఆశపడి భంగపడ్డారు. దీంతో కౌన్సిలర్‌గా ఉన్న తన భార్య నాగేంద్రతో గురువారం రాజీనామా చేయించారు. శనివారం కావ్యారావు, వీరమణి, యలమందలు కూడా కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేశారు. దీంతో టీడీపీ చిక్కుల్లో పడింది.
టీడీపీలో ముసలం
Published Fri, Sep 4 2015 10:12 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM
Advertisement
Advertisement