cheemakurthi
-
చీమకుర్తికి కరోనా సెగ!
ప్రకాశం, చీమకుర్తి: చైనాలో కరోనా విజృంభిస్తుంటే చీమకుర్తి వాసులు ఆందోళన చెందుతున్నారు. నెలకు 200 మందికి పైగా చైనా గ్రానైట్ బయ్యర్లు చీమకుర్తి రావడమే ఇందుకు కారణం. చీమకుర్తి, రామతీర్థం పరిధిలో ఉన్న గెలాక్సీ గ్రానైట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. చీమకుర్తిలో దాదాపు 80కి పైగా గ్రానైట్‌క్వారీలు, దాదాపు 300కు పైగా గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ముడి రాయి కొనుగోలు చేయడానికి వచ్చిన చైనా బయ్యర్లతోపాటు మధ్యవర్తులు కూడా గ్రానైట్ ఫ్యాక్టరీలను సందర్శించే అవకాశాలు ఉన్నాయి. 80 శాతానికి పైగా గెలాక్సీ గ్రానైట్‌ను చైనా వ్యాపారులే గత పదేళ్ల నుంచి ఎక్కువ మోతాదులో కొనుగోలు చేస్తున్నారు. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి చెంది వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్న వార్తలను ప్రసార సాధనాల్లో చూస్తూ చీమకుర్తి వాసులు ఆందోళనకు గురవుతున్నారు. చైనా బయ్యర్లతో చీమకుర్తి, ఒంగోలుతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన 150 మందికి పైగా స్థానిక మధ్యవర్తులకు సంబంధాలున్నాయి. క్వారీ యజమానులతో మధ్యవర్తులే వ్యాపార సంబంధాలు కలుపుతుంటారు. ఈ నేపథ్యంలో చైనా వాసుల నుంచి గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీల్లో పనిచేసే వారికి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. చైనా నుంచి వచ్చే వ్యక్తులను అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్కానింగ్ చేస్తున్నా, అనుమానితులను ఐసోలేషన్ సెంటర్లకు తరలిస్తున్నా చీమకుర్తి పరిసర ప్రాంతాల ప్రజలను మాత్రం కరోనా భయం వెంటాడుతోంది. చీమకుర్తి, ఒంగోలు పరిసరాల్లో కరోనా వ్యాపించడానికి మార్గాలు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో స్థానికులు, క్వారీ యజమానులు, జనరల్ మేనేజర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మైగ్రేషన్ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు చైనా నుంచి వచ్చే వ్యక్తులను విమానాశ్రయాల్లోనే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మైగ్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు నిశిత పరిశీలన చేస్తున్న నేపథ్యంలో చైనా నుంచి ఇండియా వచ్చే వారికి ప్రవేశం కష్టసాధ్యం. కరోనా వైరస్ బారినపడిన వారు చీమకుర్తి, ఒంగోలు ప్రాంతాల వరకు వచ్చేందుకు వీలుకాకపోవచ్చు.– కేవీవీఎస్ఎస్ ప్రసాద్,డీఎస్పీ, ఒంగోలు చైనా నుంచి వచ్చిన కుటుంబానికి కరోనా పరీక్షలు ఒంగోలు సెంట్రల్: చైనా నుంచి ఓ కుటుంబం జిల్లాకు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొత్తపట్నం మండలం గుండమాలకు చెందిన ఓ కుటుంబం చైనాలోని నాన్‌టాంగ్ సిటీ, జియాంగ్సు ప్రావిన్సీలో ఉద్యోగం చేస్తూ అక్కడే నివసిస్తోంది. చైనాలోని ఉహాన్ అనే నగరంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందడంతో ఆ కుటుంబ యజమాని గత నెల 21వ తేదీన ఇండియాకు వచ్చాడు. అనంతరం సొంత గ్రామం గుండమాల చేరుకున్నాడు. ఈ నెల 1వ తేదీన భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఇండియా చేరుకుని సాంత గ్రామానికి వచ్చారు. ఎయిర్ పోర్టులో వీరికి కరోనా వైరస్ వ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. వీరు గుండమాలలో ఉంటున్నట్లు గుర్తించిన అధికారులు మరోసారి పరీక్షల కోసం స్థానిక జీజీహెచ్‌కు తరలించారు. కరోనా వైరస్ ఇన్క్యుబేషన్ పిరియడ్ దాదాపు 14 రోజులకు పైగా ఉంటుంది. ఈ దశలో వ్యాధి లక్షణాలు పూర్తిస్థాయిలో బయటకు కనిపించవు. బుధవారం జీజీహెచ్‌కు చేరుకున్న వీరిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి కరోనా వైరస్ జీజీహెచ్ నోడల్ అధికారి డాక్టర్ రిచర్డ్స్ ఆధ్వర్యంలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. గొంతు నుంచి స్వాబ్లు తీసి పరీక్షల కోసం తిరుపతిలోని స్విమ్స్ వైద్యశాలకు పంపించారు. అక్కడి నుంచి స్వాబ్లు పరీక్షల కోసం పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు వెళ్లాయి. అక్కడి నుంచి నివేదిక జిల్లాకు అందుతుంది. నివేదిక అందేందుకు దాదాపు వారం రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు బయట తిరగరాదని వారికి వైద్యులు సూచించారు. జీజీహెచ్‌లో కరోనా వ్యాధి అనుమానితులు ఉన్నారనే సమాచారంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. సిబ్బంది ఎన్–95 మాస్క్‌లు ధరించారు. ఆర్ఎంవో డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి కరోనా అనుమానిత వ్యాధిగ్రస్తుల నుంచి సమాచారం సేకరించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆయన దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. -
నకిలీ మకిలీ..!
సాక్షి, ఒంగోలు : జిల్లాలో నకిలీ వే బిల్లులతో గ్రానైట్ లారీలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయి. అడ్రస్ లేని కంపెనీలకు ఎటువంటి విచారణ లేకుండా అడ్డగోలుగా వే బిల్లులు ఇచ్చేస్తుండటంతో అక్రమ దందా యథేశ్ఛగా కొనసాగుతోంది. చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పెట్టి వందల కంపెనీలు సృష్టించేస్తున్నారు. ఫోన్ నంబర్లు, ఈ మెయిల్ అడ్రస్‌లు వంటి కనీస వివరాలు కూడా లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేయగానే వెంటనే ఈ– వేబిల్లులు ఇచ్చేస్తున్నారు. రోజుకు సుమారుగా 200 వరకూ గ్రానైట్ లారీలు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటే అందులో సగానికిపైగా లారీలకు బిల్లులు లేకుండా నకిలీ వే బిల్లుల ద్వారా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. గ్రానైట్ అక్రమ వ్యాపారుల జీరో దందా వల్ల ట్యాక్స్‌ల రూపంలో ప్రభుత్వ ఖజానాకు వచ్చే వందల కోట్ల రూపాయలకు గండి పడుతుంది. ఓ అదృశ్య వ్యక్తి మార్టూరు కేంద్రంగా 33 కంపెనీలను ఏర్పాటు చేసి 133 వే బిల్లులు పొందడమే కాకుండా వాటితో గ్రానైట్‌ను ఇతర రాష్ట్రాలకు తరలించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన 18 శాతం పన్నును చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న పరిస్థితి. దీన్ని గుర్తించిన సేల్స్‌ట్యాక్స్ అధికారులు నెల 7వ తేదీన అడ్రస్ లేకుండా వే బిల్లులు పొందిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మార్టూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఒక్క మార్టూరుకే పరిమితం కాకుండా జిల్లాలో గ్రానైట్ క్వారీలు ఉన్న బల్లికురవ, చీమకుర్తిల్లో సైతం నకిలీ వే బిల్లుల ద్వారా జోరుగా అక్రమ రవాణా జరుగుతందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షాలాది మంది గ్రానైట్ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారు. కొందరు అక్రమ వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా ఈ వ్యాపారాన్ని కలుషితం చేసేస్తున్నారు. జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ, మార్టూరు వంటి ప్రాంతాల్లో కొందరు అక్రమ వ్యాపారులు మాఫియాలాగా ఏర్పడి అవినీతి అధికారుల సహకారం, రాజకీయ నేతల అండదండలతో వక్ర మార్గంలో జీరో వ్యాపారం సాగిస్తున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ఈ అక్రమ దందా సాగుతోంది. గ్రానైట్ రవాణా చేయాలంటే వే బిల్లుల ద్వారా ప్రభుత్వానికి 18 శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు మాత్రం నకిలీ వే బిల్లుల కుంభకోణంతో వందలాది లారీలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన వందల కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతూ తమ జేబులు నింపుకుంటున్నారు. విజిలెన్స్ అధికారులు ఏడాది కాలంలో రూ.2 కోట్ల వరకూ పెనాల్టీలు వేయాలని లక్ష్యంగా ఉంది. అయితే గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడే వారి నుంచి పది నెలల వ్యవధిలోనే రూ.6.70 కోట్లు పెనాల్టీలు వసూలు చేశారంటే అక్రమ దందా ఏ స్థాయిలో జరుగుతందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో పిడుగురాళ్ల, దాచేపల్లి, విజయవాడ, వినుకొండ, వంటి ప్రాంతాల్లో నకిలీ వేబిల్లులతో వెళ్తున్న గ్రానైట్ లారీలు పట్టుబడిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో అయితే టీడీపీ నేతల అండతో అధికారులెవరూ వాటి జోలికి వెళ్లలేని పరిస్థితి ఉండేది. ఇప్పటికీ కొందరు అధికారులు, అక్రమ వ్యాపారులు మాత్రం వారి తీరు మార్చుకోవడం లేదు. అక్రమాలకు పాల్పడుతుందిలా... బిల్లులు లేకుండా నకిలీ వే బిల్లులతో గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రానైట్ రవాణాకు వే బిల్లులు ఇవ్వాలంటే గతంలో స్థానిక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపి నిజంగా కంపెనీ ఉంటేనే వే బిల్లులు మంజూరు చేసేవారు. అయితే జీఎస్టీ వచ్చిన తరువాత ఇందులో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే చాలు వారి గురించి ఎటువంటి విచారణ చేపట్టకుండానే ఇతర ప్రాంతాల అధికారుల ద్వారా వే బిల్లులు ఇచ్చేస్తున్నారు. దీంతో లోపాలను గుర్తించిన అక్రమార్కులు చనిపోయిన వారి ఆధార్‌కార్డులను సేకరించి దరఖాస్తులు చేయడం, ఫేక్ అడ్రస్‌లు, బ్యాంక్ అకౌంట్ నంబర్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తూ వందల సంఖ్యలో వే బిల్లులు సేకరిస్తున్నారు. వీటి ద్వారా అక్రమ రవాణాకు పాల్పడుతూ పక్క రాష్ట్రమైన తెలంగాణాకు వెళ్లగానే వే బిల్లులు రద్దు చేసేస్తున్నారు. కొందరు కోట్ల రూపాయల పన్నులు చెల్లించకుండా ఎగనామం పెట్టినా అడ్రస్ కూడా కనిపెట్టలేక వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నకిలీ వే బిల్లుల వ్యవహారంపై ఇప్పటికే ఏడు కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగతున్నా నకిలీ వే బిల్లుల డొంక మాత్రం కదలడం లేదు. -
కార్మికుల ప్రాణాలు పోతున్నా నిద్రలేవరా?
-
చీమకుర్తిలో లారీ బీభత్సం
ఒంగోలు : ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శుక్రవారం లారీ బీభత్సం సృష్టించింది. రహదారిపై వెళ్తున్న నలుగురిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీలో ముసలం
చీమకుర్తి: ప్రకాశం జిల్లా చీమకుర్తి నగర పంచాయతీ పరిధిలో టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. శుక్రవారం ముగ్గురు కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. నగర పంచాయతీలో మొత్తం 20 స్థానాలకు 12 స్థానాలతో టీడీపీ ఆధీనంలో ఉండగా.. రెండు రోజుల వ్యవధిలో నలుగురు కౌన్సిలర్లు రాజీనామా చేశారు. దీంతో టీడీపీ బలం కాస్తా 8కి తగ్గి మైనారిటీలో పడిపోయింది. ఇక్కడ 8 స్థానాలతో వైఎస్సార్సీపీ ప్రతిపక్షంగా ఉంది. పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా ఇన్నాళ్లు యోగయ్య వ్యవహరించారు. తిరిగి రెండో సారి అదే పదవి దక్కించుకోవాలని ఆయన ఆశపడి భంగపడ్డారు. దీంతో కౌన్సిలర్‌గా ఉన్న తన భార్య నాగేంద్రతో గురువారం రాజీనామా చేయించారు. శనివారం కావ్యారావు, వీరమణి, యలమందలు కూడా కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేశారు. దీంతో టీడీపీ చిక్కుల్లో పడింది.