
విశాఖలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి
విశాఖపట్నం : విశాఖలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అమిర్ ఘోష్ ప్రొడక్షన్‌పై బత్తుల అమర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘టైమ్ బాలేదు’ లఘుచిత్రం ఆదివారం విడుదలైంది. ఏయూ ప్లాటినం జూబ్లీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి గంటా, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, జర్నలిజం ప్రొఫెసర్ బాబివర్ధన్‌లు వీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విశాఖలో ఎంతో మంది నైపుణ్యం గల యువకులు ఉన్నారన్నారు. కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం సాధించవచ్చునని పేర్కొన్నారు.
రచయిత్రి జాలాది విజయ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు అన్నంరెడ్డి వాణి, ప్రతినిధి కేదారలక్ష్మి, లఘు చిత్రం హీరో కేదార్ వెంకటేష్, హీరోయిన్ నవ్యగోవర్థన్ తదితరులు పాల్గొన్నారు.