సిటీ బస్సు వచ్చేస్తోంది | City bus arrival to cadapa | Sakshi
Sakshi News home page

సిటీ బస్సు వచ్చేస్తోంది

Published Tue, Feb 3 2015 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

సిటీ బస్సు వచ్చేస్తోంది

సిటీ బస్సు వచ్చేస్తోంది

మార్చి నుంచి నడిపేందుకు కసరత్తు
కడపకు రానున్న 40 బస్సులు
ఆర్టీసీ బస్టాండు  సమీపంలో మరో గ్యారేజీ
రూ.4.50 కోట్ల పనులకు టెండర్లు
ప్రయాణికులకు  తప్పనున్న ‘ఆటో’ కష్టాలు


కడప : కడప నగర వాసుల ప్రయాణ కష్టానికి త్వరలో ‘బ్రేక్’ పడనుంది. ఆటోల ప్రయూణాలతో విసిగిపోరుున  ప్రయూణికులకు మార్చి నుంచి మంచిరోజులు రానున్నాయి. సిటీ బస్సుల రాకతో నగర రోడ్లు కొత్త కళను సంతరించుకోనున్నారుు. నగరాలలో సిటీ బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సంకల్పించిన నేపధ్యంలో కడపకు కూడా ప్రత్యేక సిటీ బస్సులు రానున్నాయి. మార్చి తొలి వారంనుంచే సిటీ బస్సులను తిప్పాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొదట ప్రస్తుతం ఉన్న బస్టాండునుంచే వీటిని నడపాలని అధికారులు నిర్ణరుుంచారు. జవహర్‌లాల్ నెహ్రూ అర్బన్, రూరల్ మేనేజ్‌మెంట్ కింద సుమారు 40 బస్సులను కడపకు కేటారుుంచారు. ఈ బస్సులు రావడమే అలస్యం నగరంలో తిప్పాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

రూట్లపై అధికారుల కసరత్తు

సిటీ బస్సులు నడపాల్సిన రూట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాలు (నగరంతో ఎక్కువ అనుబంధం ఉండేవి) కలిసేలా కసరత్తు చేస్తున్నారు. రాజంపేట రూట్‌లోని ఒంటిమిట్ట, పులివెందుల రోడ్డులోని పెండ్లిమర్రి, ప్రొద్దుటూరురోడ్డులోని చెన్నూరు, రాయచోటిరోడ్డులోని ఎన్టీపీసీ, ఎర్రగుంట్ల రోడ్డులోని కమలాపురం వరకు నడపాలని ప్రాథమికంగా నిర్ణయూనికి వచ్చారు. దీంతో పాటు నగరంలో దేవునికడప, రిమ్స్, రైల్వేస్టేషన్, పాత బస్టాండు, అల్మాస్‌పేట, బిల్టప్, అప్సర సర్కిల్, చిన్నచౌకు, ఐటీఐ సర్కిల్ తదితర ప్రాంతాలను గుర్తిస్తున్నారు. రూట్లను సిద్ధం చేసి అందుకు సంబంధించి బస్టాప్‌ల ఏర్పాట్లపై కూడా త్వరలోనే అధికారులు చర్చించి నిర్ణయానికి రానున్నారు. ప్రతినిత్యం లక్షలాది సంఖ్యలో కడపలో వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు రాకపోకలు సాగిస్తున్న నేపధ్యంలో సిటీ బస్సుల రాకతో చాలా వరకు ప్రయోజనం ఒనగూరనుంది.
 
కడపలో మరో ఆర్టీసీ గ్యారేజ్

ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఖాళీ స్థలంలో మరో గ్యారేజి నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకు సంబంధించి ఆర్టీసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్న ప్రాంతంలోనే గ్యారేజీని నిర్మించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. గ్యారేజీ నిర్మాణానికి సుమారు రూ.4.20 కోట్లు కేటాయించారు. అందుకు సంబంధించి హైదరాబాదులో టెండర్లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈనెల 9వ తేదీన టెండర్లను ఓపెన్ చేసి కాంట్రాక్టు ఖరారు చేయనున్నారు.

 ప్రయాణికులకు తప్పనున్న ‘ఆటో’ కష్టాలు

ఆటోలలో అధిక ఛార్జీలతో సతమతమవుతున్న ప్రయాణికులకు త్వరలోనే కష్టాలు తొలిగిపోనున్నాయి. సాధారణ రూట్లలో తీసుకుంటున్న ఆటో ఛార్జి రూ.10లే అయినా ప్రధాన రహదారిలోని ఇంటి వద్దకు వెళ్లాలంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్న నేపధ్యంలో కొంతమేర సిటీ బస్సుల రాకతో సమస్య తొలిగిపోతుందని పలువురు భావిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement